మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Anand Deverakonda: ఆనంద్ దేవరకొండ సిక్స్ ప్యాక్.. అదిరిన లుక్‌

ABN, Publish Date - May 19 , 2024 | 06:20 PM

తన ప్రతి సినిమాకు కథల ఎంపికలో కొత్తదనం చూపిస్తూ వస్తున్నారు యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ . ఈసారి ‘గం..గం..గణేశా’ కోసం తన లుక్ కూడా మార్చేశారు. ఆయన ఫస్ట్ టైమ్ ఈ సినిమాలో సిక్స్ ప్యాక్ బాడీతో కనిపించబోతున్నారు. తాజాగా ఈ ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు.

తన ప్రతి సినిమాకు కథల ఎంపికలో కొత్తదనం చూపిస్తూ వస్తున్నారు యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ (Anand Deverakonda). ఈసారి ‘గం..గం..గణేశా’ (Gam Gam Ganesha) కోసం తన లుక్ కూడా మార్చేశారు. ఆయన ఫస్ట్ టైమ్ ఈ సినిమాలో సిక్స్ ప్యాక్ బాడీతో కనిపించబోతున్నారు. సిక్స్ ప్యాక్ తో తన ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు ఆనంద్ దేవరకొండ. ‘గం..గం..గణేశా’ (Gam Gam Ganesha) యాక్షన్ క్రైమ్ కామెడీ మూవీగా ఈ నెల 31న థియేటర్స్ లోకి రాబోతోంది.


ఆనంద్ (Anand Deverakonda) సరసన ప్రగతి శ్రీవాస్తవ (Pragati Srivastava), నయన్ సారిక (Nayansarika) హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ సినిమాను హై-లైఫ్ ఎంటర్ టైన్ మెంట్ (Hylife Entertainments) పతాకంపై కేదార్ సెలగంశెట్టి, వంశీ కారుమంచి (vamsi Karumanchi) నిర్మిస్తున్నారు.

ఉదయ్ శెట్టి (Uday Bommisetty) ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ‘గం..గం..గణేశా’ (Gam Gam Ganesha) ట్రైలర్ ను రేపు (సోమ‌వారం) సాయంత్రం 4 గంటలకు విడుదల చేయబోతున్నారు. ఈ మంత్ ఎండ్ లో వస్తున్న చిత్రాల్లో ఒక కొత్త ప్రయత్నంగా ‘గం..గం..గణేశా’ (Gam Gam Ganesha) ప్రేక్షకుల్లో ఆసక్తి కలిగిస్తోంది.

Updated Date - May 19 , 2024 | 06:20 PM