మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Anand Deverakonda: రాబోయే చిత్రాలు మామూలుగా ఉండవు!

ABN, Publish Date - May 21 , 2024 | 12:21 PM

"నా  అన్నయ్య విజయ్‌ దేవరకొండ హీరోగా నటించిన ‘ఫ్యామిలీస్టార్‌’కు కావాలనే  నెగెటివ్‌ టాక్‌ క్రియేట్‌ చేశారని" ఆనంద్‌ దేవరకొండ అన్నారు. ‘గం గం గణేశా’ ట్రైలర్‌ విడుదల వేడుకలో ఈ విషయంపై ఆయన స్పందించారు.

"నా  అన్నయ్య విజయ్‌ దేవరకొండ (Vijay Devarakonda) హీరోగా నటించిన ‘ఫ్యామిలీస్టార్‌’కు కావాలనే  నెగెటివ్‌ టాక్‌ క్రియేట్‌ చేశారని" ఆనంద్‌ దేవరకొండ (Anand Devarakonda) అన్నారు. ‘గం గం గణేశా’ (Gam gam Ganesha) ట్రైలర్‌ విడుదల వేడుకలో ఈ విషయంపై ఆయన స్పందించారు. ‘ఫ్యామిలీస్టార్’ (Family) దుష్ప్రచారంపై సైబర్‌క్రైమ్‌కు ఇచ్చిన కంప్లైంట్‌ గురించి ఆయన మాట్లాడారు. ‘'ఆ సినిమా విడుదలకు 48 గంటల ముందు నుంచే విజయ్‌ దేవరకొండ పాతచిత్రాల నెగెటివ్‌ టాక్‌ వీడియోలు యూట్యూబ్‌లో అప్‌లోడ్‌ చేశారు. ‘ఫ్యామిలీస్టార్‌’ రిజల్ట్‌ అంటూ థంబ్‌ నెయిల్స్‌ పెట్టారు. దీంతో ప్రేక్షకులు గందరగోళానికి గురయ్యారు. సినిమా చూసిన తర్వాత ఫలితం గురించి ఎవరైనా మాట్లాడొచ్చు. కానీ, రిలీజ్‌ కాకముందే దాని టార్గెట్‌ చేసి ఎటాక్‌ ఎందుకు చేస్తున్నారు? అలాంటి వాళ్లు మన ఇండస్ట్రీ  ప్రమాదకరం. ఇది సరైన పద్థతి కాదు. ఇలా ఎవరు చేస్తున్నారు? ఎందుకు చేస్తున్నారు? అనేది తెలియడం కోసం సైబర్‌క్రైమ్‌లో ఫిర్యాదు చేశాం. ఎదుగుతున్న క్రమంలో ఇవన్నీ సహజం. వాటిని పక్కన పెడితే విజయ్‌ దేవరకొండ నుంచి ఇకపై మంచి సినిమాలు రాబోతున్నాయి. ఇటీవల మూడు సినిమాలు ప్రకటించారు. అవన్నీ కూడా డిఫరెంట్‌ జానర్‌ చిత్రాలు. కచ్చితంగా మీకు నచ్చుతాయని ఆశిస్తున్నా’ అని అన్నారు. విజయ్‌ దేవరకొండ -  మృణాల్‌ ఠాకూర్‌ జంటగా నటించిన  'ఫ్యామిలీస్టార్‌’ ఈ ఏడాది ఏప్రిల్‌ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దీనిపై ఉద్దేశపూర్వకంగా సోషల్‌ మీడియాలో నెగటివ్‌ కామెంట్స్‌ చేశారని విజయ్‌ టీమ్‌ తెలిపింది.

Updated Date - May 21 , 2024 | 12:24 PM