Amitabh Bachchan: మీ హీరోపై పోరాడే వ్యక్తిని.. నన్ను తిట్టుకోకండి!

ABN, Publish Date - Jun 24 , 2024 | 05:07 PM

"ప్రభాస్‌ (Prabhas) అభిమానులంతా దయచేసి నన్ను క్షమించాలి. చేతులు జోడించి మీ అందరినీ క్షమాపణలు కోరుతున్నాను’’ అన్నారు బాలీవుడ్‌ అగ్ర నటుడు అమితాబ్‌ బచ్చన్ (Amitabh Bachchan)


"ప్రభాస్‌ (Prabhas) అభిమానులంతా దయచేసి నన్ను క్షమించాలి. చేతులు జోడించి మీ అందరినీ క్షమాపణలు కోరుతున్నాను’’ అన్నారు బాలీవుడ్‌ అగ్ర నటుడు అమితాబ్‌ బచ్చన్ (Amitabh Bachchan) . ప్రభాస్‌ హీరోగా నాగ్‌ అశ్విన్  తెరకెక్కించిన 'కల్కి 2898 ఎడీ’ (Kalki 2898 Ad) చిత్రంలో ఆయన  కీలక పాత్ర పోషించారు. ఈ నెల 27న పాన్  ఇండియా స్థాయిలో విడుదల కానున్న ఈ చిత్రం గురించి చిత్ర బృందం ఓ ఇంటర్వ్యూ ఇచ్చింది. అందులో అమితాబ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. "నాగ్ అశ్విన్ నా  దగ్గరికి వచ్చి  నా పాత్ర  ప్రభాస్‌ పాత్ర గురించి  వివరించారు. ఇందులో ప్రభాస్ పై  పోరాడే వ్యక్తిని నేను. అందుకు ప్రభాస్‌ అభిమానులు అంతా నన్ను క్షమించాలి. సినిమాలో నేను మీ హీరోతో ప్రవర్తించిన తీరుకు నన్ను తిట్టుకోకండి. అది సినిమాలో భాగమంతే’’ అని చెబుతూ నవ్వులు పూయించారు. దానికి సమాధానంగా  ప్రభాస్‌ వాళ్లందరూ మీ అభిమానులు కూడా సర్‌.. ఏమీ అనుకోరు అని సమాధానమిచ్చారు. చిత్రీకరణ మొదటిరోజే అమితాబ్‌కు, నాకు మధ్య ఫైట్‌ సీన. వయసుతో  సంబంధం  లేదు" అని ఆయన నిరూపించారు.  25 ఏళ్ల యువకుడు ఎంత ఉత్సాహంగా ఉంటాడో అమితాబ్‌ అలా ఉంటారు’’ అని ప్రభాస్‌ చెప్పారు.



"సినిమాలో కొన్ని విజువల్స్‌ నమ్మశక్యం కావు. అన్నింటిని తెరపై అద్భుతంగా చూపించారు. ఇంతగొప్ప ప్రాజెక్ట్‌లో భాగం కావడం ఎప్పటికీ మర్చిపోలేని ఓ అనుభవం. నాగ్‌అశ్విన్‌ ఈ కథ చెప్పి వెళ్లిన తర్వాత ‘ఇతను ఏం తింటున్నాడు. ఇంత గొప్పగా రాశాడు’ అని గంటల కొద్దీ ఆలోచించాను’’ అని అమితాబ్‌ పేర్కొన్నారు.

Updated Date - Jun 24 , 2024 | 05:08 PM