Allu Arjun: బిస్కెట్‌కి ఫిలాసఫీ.. సినిమా టికెట్ల విషయంలో మాత్రం

ABN, Publish Date - Dec 05 , 2024 | 09:39 PM

ఇటీవల అల్లు అర్జున్ ఇచ్చిన ఇంటర్వ్యూ బ్యాక్ ఫైర్ అయ్యింది. దీంతో నెటిజన్లు ఆయనపై మండిపడుతున్నారు. ఇంతకీ ఏమైందంటే..

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో అల్లు అర్జున్ మాట్లాడిన మాటలు ప్రస్తుతం వైరల్ గా మారాయి. దీంతో నెటిజన్లు బన్నీపై ఫైర్ అవుతున్నారు. రియల్ లైఫ్ లో ఒక లాగ బిహేవ్ చేస్తూ రీల్ లైఫ్ కోసం ఇలా బిహేవ్ చేస్తున్నారేంటి అని పబ్లిక్ నిలదీస్తున్నారు. ఇంతకీ బన్నీ ఏమన్నారు. పబ్లిక్ కి కోపం ఎందుకు వచ్చిందంటే..


'పుష్ప 2' టికెట్ ధరలు ఎప్పుడు లేని విధానంగా ఆకాశాన్ని తాకాయి. దీంతో సగటు మధ్య తరగతి ప్రజలే కాదు అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా సినిమాకి వెళ్ళడానికి సంకోచిస్తునారు. ఈ నేపథ్యంలోనే అల్లు అర్జున్ ఓ ఇంటర్వ్యూలో చెప్పిన మాటలను నెటిజన్లు షేర్ చేస్తున్నారు. ఆ ఇంటర్వ్యూలో బన్నీ మాట్లాడుతూ.. ఒక ఆర్థిక నియమం చెప్పారు. 'నేను ఒక పది రూపాయల బిస్కెట్ ప్యాకెట్ నేను కొనాలి అంటే దానిని పదికి మాత్రమే కొంటాను, వందకి కొనను, ఎందుకంటే దాని విలువ అంతే కాబట్టి' అన్నారు. దీంతో ఇప్పుడు నెటిజన్లు.. ' మేము కూడా ఒక సినిమాని ఎంత ధర పెట్టి టికెట్ కొనుక్కోవాలో అంతకు మాత్రమే కొంటాము. అంతకు మించి ఉంటె కొనము' అంటూ ఫైర్ అవుతున్నారు. అలాగే ఒక టికెట్ ధర రూ.600 నుండి రూ.1000 ఉంటె ఎలా చూసేది, రూ. 250 కరెక్ట్ ప్రైజ్ కదా అని నిలదీస్తున్నారు. ఇంకా మరికొందరు రూ. 20ల వాటర్ బాటిల్ ని మల్టీ‌ప్లెక్స్‌లలో రూ. 50కి గురించి అమ్మడం గురించి కూడా ఆయన చెబితే బాగుండేది అన్నారు. చివరిగా డబ్బులు ఎవరికీ ఊరికే రావు అంటూ మండిపడుతున్నారు.


మరోవైపు 'పుష్ప 2' సినిమా సూపర్ సక్సెస్ సాధించడంతో మేకర్స్ రేపు(శుక్రవారం) ఉదయం 10:00 గంటలకి ప్రెస్ మీట్ నిర్వహించనున్నారు.

Updated Date - Dec 05 , 2024 | 09:48 PM