Allu Arjun Arrest: బన్నీ క్వాష్ పిటిషన్ విచారణ వాయిదా..
ABN, Publish Date - Dec 13 , 2024 | 03:04 PM
అల్లు అర్జున్ క్వాష్ పిటిషన్ విచారణను తెలంగాణ హైకోర్టు వాయిదా వేసింది..
సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాట ఘటనలో నిందితుడిగా ఉన్న బన్నీని చిక్కడపల్లి పోలీసు స్టేషన్‌కు తరలించారు. అక్కడ ఆయన్ను విచారిస్తున్నారు. తాజాగా ఈ కేసులో హైకోర్టును ఆశ్రయించారు అల్లు అర్జున్. కేసును కొట్టి వేయాలని కోరుతూ కోర్టులో ఆల్రెడీ క్వాష్ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. అయితే శుక్రవారం బన్నీని పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో ఆయన తరఫు న్యాయవాది దీనిని అత్యవసర పిటిషన్‌గా విచారించాలని కోర్టును కోరారు.
క్వాష్ పిటిషన్‌ను ఉదయం 10.30 గంటలకు మాత్రమే మెన్షన్ చేయాలని ఈ సందర్భంగా కోర్టు పేర్కొంది. అయితే బుధవారం నాడే పిటిషన్ ఫైల్ చేశామని, దీన్ని పోలీసుల దృష్టికి కూడా తీసుకెళ్లినట్లు బన్నీ తరఫు లాయర్ నిరంజన్ రెడ్డి హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై స్పందించిన న్యాయస్థానం.. క్వాష్ పిటిషన్‌ను సోమవారం విచారిస్తామని చెప్పింది. ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ దృష్ట్యా లంచ్ మోషన్ పిటిషన్‌గా స్వీకరించాలని అల్లు అర్జున్ తరఫు న్యాయవాది కోరారు. సోమవారం వరకు అరెస్టు చేయకుండా ఆర్దర్స్ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. దీంతో పోలీసులను అడిగి 2.30కి చెబుతానని అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ తెలిపారు. అయితే ఈ పిటిషన్ ని మధ్యాహ్నం 2.30 నిమిషాలకు కాకుండా సాయంత్రం 4.00లకు వాయిదా వేసినట్లు తెలుస్తోంది.