మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Arya: ఆర్య ప్రేమ కథకు 20 ఏళ్లు! 

ABN, Publish Date - May 07 , 2024 | 09:49 AM

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu arjun) నటించిన 'ఆర్య' (Arya) చిత్రం విడుదల అయి నేటికీ సరిగ్గా 20 ఏళ్లు. సుకుమార్ (Sukumar) దర్శకత్వం రూపుదిద్దుకున్న ఈ చిత్రం ,2004 మే ఏడు న విడుదలై హిట్ అయింది.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu arjun) నటించిన 'ఆర్య' (Arya) చిత్రం విడుదల అయి నేటికీ సరిగ్గా 20 ఏళ్లు. సుకుమార్ (Sukumar) దర్శకత్వం రూపుదిద్దుకున్న ఈ చిత్రం ,2004 మే ఏడు న విడుదలై హిట్ అయింది. దిల్ సినిమా తర్వాత నిర్మాత దిల్ రాజు కి మరో హిట్ అందించిన చిత్రం ఇది.

ప్రేమ కథా చిత్రాల్లో ఆర్య అప్పట్లో ట్రెండ్ సెట్టర్. 99 ప్రింట్స్ తో చిత్రాన్ని విడుదల చేశారు. మూడో వారానికి ప్రింట్ల సంఖ్య 150 కి చేరుకుంది. ఆర్య మ్యూజికల్ హిట్ కూడా. విడుదలకు ముందే రెండు లక్షల క్యాసెట్లు సేల్ కావడం ఒక రికార్డ్. కర్నూలు లో ఈ సినిమా టికెట్స్ కోసం దాదాపు 11 షో లకు ప్రయత్నించినా  దొరకక పోవడం తో ఓ అభిమాని ఆత్మహత్య కు ప్రయత్నించాడు.

ఆర్య చిత్రం విడుదల అయిన వారం రోజులకు మహేశ్ నటించిన నాని చిత్రం రిలీజ్ అయింది.రెండు వారాల తర్వాత ప్రభాస్ నటించిన అడవి రాముడు చిత్రం విడుదల అయింది. ఆ రెండు చిత్రాలూ బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడడం తో ఆర్య దూసుకు పోయింది. 56 సెంటర్స్ లో ఈ సినిమా వంద రోజులు పూర్తి  చేసుకుంది. (Arya vompletes 20 years)

  • వినాయకరావు

Read More: Tollywood, Cinema News

Updated Date - May 07 , 2024 | 09:49 AM