Allu Arjun: మెగా హీరోలు ఏమయ్యారు.. బన్నీ ఇంట్లో టాలీవుడ్ టాప్ హీరోలు

ABN, Publish Date - Dec 14 , 2024 | 09:12 PM

ఒకవైపు టాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం బన్నీ ఇంట్లో సందడి చేస్తున్న తరుణంలో చిరు, నాగబాబు మినహా ఏ మెగా హీరో కూడా స్పందించకపోవడం గమనార్హం.

జైలు నుండి మధ్యంతర బెయిల్‌తో విడుదలైన అల్లు అర్జున్‌కు సంఘీభావం తెలిపేందుకు సినీ ప్రముఖులు క్యూ కడుతున్నారు. చిన్న,పెద్ద తేడా లేకుండా హీరోలు, దర్శకనిర్మాతలతో అల్లు అర్జున్ ఇంటి దగ్గర సందడి చేస్తున్నారు. అందుబాటులో లేనివారు ఫోన్ కాల్ ద్వారా బన్నీని పరామర్శిస్తున్నారు. ,మరోవైపు మెగా ఫ్యామిలీ నుండి చిరంజీవి, నాగబాబు మాత్రమే అల్లు ఫ్యామిలీని కలిశారు. మిగతా మెగా హీరోలు ఎవ్వరు కనిపించలేదు. కనీసం సోషల్ మీడియా ఖాతాల ద్వారా కూడా మద్దతు తెలపకపోవడం చర్చనీయాంశమైంది.


ఫోన్‌లో పరామర్శించిన సీఎం

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, నందమూరి బాలకృష్ణ, ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్ లు అల్లు అర్జున్ కి కాల్ చేసి అరెస్ట్ పై సంఘీభావం తెలిపారు.


ఇంటికొచ్చిన ఇండస్ట్రీ

సీనియర్ హీరో వెంకటేష్ దగ్గుబాటితో పాటు రానా దగ్గుబాటి, నాగ చైతన్య, కె. రాఘవేంద్రరావు, శ్రీకాంత్, విజయ్ దేవరకొండ సోదరులు, ఆర్. నారాయణమూర్తి, దర్శకుడు సుకుమార్, హరీష్ శంకర్, బివిఎస్ రవి, సురేందర్ రెడ్డి, వక్కంతం వంశీ, పుష్ప నిర్మాతలు నవీన్ & రవిశంకర్, కొరటాల శివ, దిల్ రాజు, వంశీ పైడిపల్లి, తమన్, జీవితా రాజశేఖర్ ,అడవి శేష్, అక్కినేని అఖిల్, రోషన్, సుకుమార్, త్రివిక్రం బన్నీతో మనసారా మాట్లాడారు. బన్నీ స్వయంగా గేటు దగ్గరికి వెళ్లి ఆప్యాయంగా రిసీవ్ చేసుకున్నారు. అందర్నీ హాగ్ చేసుకొని ముచ్చటించారు.


మౌనం వీడని మెగా హీరోలు

ఒకవైపు టాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం బన్నీ ఇంట్లో సందడి చేస్తున్న తరుణంలో ఏ మెగా హీరో కూడా స్పందించకపోవడం గమనార్హం. చిరు, నాగబాబు మినహా ఎవరు కూడా అల్లు కుటుంబాన్ని పరామర్శించలేదు. దీంతో మెగా వర్సెస్ అల్లు చిచ్చు ఇంకా సమసిపోలేదని తెలుస్తుంది. నిన్నటి వరకు మెగా, అల్లు అభిమానులు కలిసి పోయినట్లేనా కనిపించిన.. హీరోలో తీరుతో ఫ్యాన్స్ ఎలా రియాక్టవుతారో అనేది ఆసక్తిగా మారింది.

Updated Date - Dec 14 , 2024 | 09:12 PM