Allu Arjun: ‘అయాన్.. నా గొడ్డలి ఎప్పుడు తీసుకెళ్లావ్’ బన్నీ వైరల్ పోస్ట్
ABN, Publish Date - Oct 29 , 2024 | 05:02 PM
అల్లు అర్జున్ తన పిల్లలు అయాన్, అర్హా చేసే అల్లరిని చూసి మురిసిపోతుంటారు. ఆ వీడియోలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటారు. ఆయన సతీమణి స్నేహారెడ్డి తాజాగా హాలోవీన్ కాస్ట్యూమ్స్‌లో ఉన్న వీరి ఫొటోలను షేర్ చేశారు.
అల్లు అర్జున్ (Allu arjun) తన పిల్లలు అయాన్, అర్హా చేసే అల్లరిని చూసి మురిసిపోతుంటారు. ఆ వీడియోలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటారు. ఆయన సతీమణి స్నేహారెడ్డి (Sneha reddy) తాజాగా హాలోవీన్ కాస్ట్యూమ్స్‌లో ఉన్న వీరి ఫొటోలను షేర్ చేశారు. ఆ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతుంది. ఆ పోస్ట్‌ను అల్లు అర్జున్ తన ఇన్‌స్టాలో పంచుకుంటూ ఆసక్తికర కామెంట్ చేశారు. ఇందులో అయాన్(Ayaan), అర్హలు (Arha) ఘోస్ట్ కాస్ట్యూమ్‌లో ఉండగా, అయాన్ ఓ చేతిలో గొడ్డలి పట్టుకుని నిలబడ్డాడు. ఈ ఫొటోపై ‘అయాన్.. నా షూట్ నుంచి గొడ్డలి ఎప్పుడు తీసుకెళ్లావ్’ అంటూ అల్లు అర్జున్ నవ్వుతున్న ఎమోజీలను పంచుకున్నారు.
సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా ఎర్రచందనం స్మగ్లర్ పాత్రలో కనిపించిన సంగతి తెలిసిందే. పాన్ ఇండియా స్థాయిలో భారీ విజయాన్ని సాధించిన ఈ చిత్రానికి కొనసాగింపుగా ‘పుష్ప: ది రూల్’ (Pushpa -2) తెరకెక్కుతుంది. ఈ మూవీకి సంబంధించి విడుదల చేసిన ఓ పోస్టర్‌లోనూ అల్లు అర్జున్ గొడ్డలి పట్టుకొని నిలబడిన స్టిల్ వైరల్ అయింది. ఇప్పుడు అదే తరహా గొడ్డలి పట్టుకొని అయాన్ ఫొటో దిగడంతో అభిమానులు ఆ ఫొటోను సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు. డిసెంబరు 5న ప్రేక్షకుల ముందుకు రానుంది.