Allu Arjun - Drugs: డ్రగ్స్ గురించి అల్లు అర్జున్ ప్రత్యేక వీడియో 

ABN, Publish Date - Nov 28 , 2024 | 08:20 PM

ప్రభుత్వ ఉద్దేశం వారికి సాయం చేయడమే కానీ వారిని శిక్షించడం కాదు.  మంచి సమాజం కోసం బాధితులకు అండగా నిలుద్దాం’

మాదక ద్రవ్య రహిత సమాజమే లక్ష్యంగా కృషి చేస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ (Allu Arjun) పిలుపునిచ్చారు. మాదకద్రవ్యాలకు ఆకర్షితులై జీవితాన్ని నాశనం చేసుకుంటున్న బాధితులకు అండగా నిలవాలని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు డ్రగ్స్ రహిత తెలంగాణపై యాంటీ నార్కోటిక్‌ టీమ్‌కు (Anti-Narcotics awareness campaign) సహకరిస్తూ తన వంతు బాధ్యతగా ఎక్స్‌ (ట్విటర్‌) వేదికగా అల్లు అర్జున్‌ ప్రత్యేక వీడియో షేర్‌ చేశారు. (Allu Arjun Video For Anti-Narcotics awareness)

‘‘మీకు తెలిసిన వారు ఎవరైనా డ్రగ్స్‌ తీసుకుంటే తెలంగాణ (Telangana Govt)యాంటీ నార్కోటిక్‌ బ్యూరో టోల్‌ ఫ్రీ నంబర్‌: 1908కు ఫోన్‌ చేయండి. వాళ్లు వెంటనే బాధితులను పునరావాస కేంద్రాలకు తీసుకువెళ్లి.. సాధారణ జీవనశైలిలోకి వచ్చేవరకూ కేర్ గా  చూసుకుంటారు.  ప్రభుత్వ ఉద్దేశం వారికి సాయం చేయడమే కానీ వారిని శిక్షించడం కాదు.  మంచి సమాజం కోసం బాధితులకు అండగా నిలుద్దాం’’ అని ఆయన పేర్కొన్నారు. చిరంజీవి, ఎన్టీఆర్‌ కూడా ఈ విధమైన అవగాహన వీడియోలు విడుదల చేసిన విషయం తెలిసిందే.

Updated Date - Nov 28 , 2024 | 08:24 PM