మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

AP Elections - Allu Arjun: పవన్ కళ్యాణ్‌కు మద్దతుగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్

ABN, Publish Date - May 09 , 2024 | 05:21 PM

ఆంధ్ర ప్రదేశలో ఎన్నికల ప్రచారం మాంచి వేడిగా సాగుతోంది. గెలుపు కోసం పార్టీలన్నీ తీవ్రంగా శ్రమిస్తున్నాయి. అయితే పవన్ కల్యాణ్‌ పోటీ చేస్తున్న పిఠాపురం అందరినీ ఆకర్షిస్తున్న నియోజకవర్గాల్లో ఒకటి.

ఆంధ్ర ప్రదేశలో ఎన్నికల ప్రచారం మాంచి వేడిగా సాగుతోంది. గెలుపు కోసం పార్టీలన్నీ తీవ్రంగా శ్రమిస్తున్నాయి. అయితే పవన్ కల్యాణ్‌ పోటీ చేస్తున్న పిఠాపురం అందరినీ ఆకర్షిస్తున్న నియోజకవర్గాల్లో ఒకటి. పవన్‌ కళ్యాణ్‌ గెలుపు కోసం ఎన్డీయే కూటమి, మెగా ఫ్యామిలీ, అభిమానులు కష్టపడుతుంటే.. పవన్‌ను ఓడించడమే టార్గెట్‌గా పెట్టుకుని వైసీపీ వ్యూహలు రచిస్తోంది. ఈ క్రమంలో జనసేనాని కల్యాణ్‌కు మద్దతు పెరుగుతోంది. సినీ ఇండస్ట్రీ నుంచి ఒక్కొక్కరుగా పవన్‌ కళ్యాణ్‌ గెలుపు కోసం ప్రచారం చేస్తున్నారు. (Pawan Kalyan Janasena)

మెగా ఫ్యామిలీ నుంచి చిరంజీవి, రాంచరణ్‌, వరుణ్‌తేజ్‌, సాయిధరమ్‌ తేజ్‌, వైష్ణవ్‌ తేజ్‌, పద్మజాలతో పాటు నిర్మాత నాగవంశీ, నాని, రాజ్‌తరుణ్‌, అభిమానులు, హైపర్‌ ఆది, సుడిగాలి సుధీర్‌, రాంప్రసాద్‌తోపాటు పలువురు ఆర్టిస్ట్‌లు జనసేన కోసం ప్రచారం చేస్తున్నారు. తాజాగా ఐకాన్ స్టార్  అల్లు అర్జున్ కూడా ఈ జాబితాలో చేశారు. పవనకు మద్దతిస్తూ, ఆయన గెలవాలని ఆకాంక్షిస్తూ, ట్వీట్‌ చేశారు. (Allu Arjun Supports to Pawan Kalyan) 


"ఎన్నికల ప్రయాణంలో బిజీగా ఉన్న కల్యాణ్‌గారికి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలుపుతున్నా. ఆయన ఎంచుకున్న మార్గాన్ని, అందులో ఆయన చూపించే డెడికేషన్ కు  ఎప్పుడు గర్విస్తుంటా. కుటుంబ సభ్యుడిగా నా ప్రేమా,  మద్దతు మీకు ఎప్పుడూ ఉంటుంది.మీరు గెలుపొందాలని, కోరిక నెరవేరాలని కోరుకుంటున్నాను’’ అని ట్వీట్‌లో పేర్కొన్నారు అల్లు అర్జున్ (Allu Arjun). 

Updated Date - May 09 , 2024 | 05:37 PM