Allu Arjun: మీడియా ముందుకు ‘పుష్పరాజ్’.. అరెస్ట్‌పై ఏమన్నారంటే..
ABN, Publish Date - Dec 14 , 2024 | 09:05 AM
మధ్యంతర బెయిల్‌తో శనివారం ఉదయం జైలు నుండి విడుదలైన అల్లు అర్జున్.. ముందు గీతా ఆర్ట్స్ ఆఫీస్‌కు వెళ్లి.. అనంతరం జూబ్లీ హిల్స్‌లోని ఇంటికి చేరుకున్నారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ..
జూబ్లీహిల్స్‌లోని ఇంటికి చేరుకున్న అల్లు అర్జున్.. మీడియాతో మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ.. ‘‘అందరికీ నమస్కారం. నాకు మద్దతు తెలిపి అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. నేను బాగానే ఉన్నా.. ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఆరోజు ఘటన అనుకోకుండా జరిగింది. తొక్కిసలాటలో మహిళ చనిపోవడం చాలా బాధగా ఉంది. ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ రాలేదు. రేవతి కుటుంబానికి అన్ని విధాలా నేను అండగా ఉంటాను. లీగల్ అంశాలపై ఇప్పుడేమీ మాట్లాడలేను. నేను చట్టాన్ని గౌరవిస్తా’’ అని తెలిపారు.
Also Read- Allu Arjun Released: అల్లు అర్జున్ విడుదల.. వెంటనే ఇంటికి వెళ్లలేదు
అంతకు ముందు సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో అరెస్టైన పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ రిలీజ్ అయ్యారు. విడుదలైన వెంటనే గీతా ఆర్ట్స్ ఆఫీస్‌కు వెళ్లిన బన్నీ.. ఆ తర్వాత ఇంటికి బయల్దేరారు. ఇంట్లోకి అడుగుపెట్టిన వెంటనే తన కుమారుడు అల్లు అయాన్‌ను హత్తుకున్నారు. కొడుకును కౌగిలించుకొని తన సంతోషాన్ని వ్యక్తం చేశారు.
అసలు జరిగింది ఇదే..
తెల్లవారితే పుష్ప-2 సినిమా విడుదలవుతుందనగా.. డిసెంబర్ నెల 4వ తేదీ రాత్రి హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్‌లో ప్రీమియర్ షో వేయడం, ఆ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో దిల్‌సుక్‌నగర్‌కు చెందిన రేవతి(35) మృతి చెందడం, ఆమె కుమారుడు శ్రీతేజ్ (13) అపస్మారక స్థితికి చేరుకొని చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. వీరితోపాటు తొక్కిసలాటలో మరికొంత మందికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటనకు థియేటర్ యాజమాన్యం నిర్లక్ష్యంతోపాటు.. ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ప్రీమియర్ షో వీక్షించడానికి హీరో అల్లు అర్జున్ రావడం కూడా కారణమని పోలీసులు భావించారు. ఈ మేరకు ఆయనపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి.