Allu Arjun Arrest: భార్యకు బన్నీ భరోసా..

ABN, Publish Date - Dec 13 , 2024 | 03:15 PM

అరెస్ట్ అవుతున్న వేళా అల్లు అర్జున్ తన భార్య స్నేహకి భరోసానిచ్చారు.

అరెస్ట్ సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి అల్లు అర్జున్ ధైర్యం చెప్పారు. తనకు ఏమీ కాదని ఆమెకు భరోసా ఇచ్చారు. తలను నిమిరి, ముద్దు పెట్టి ధైర్యం చెప్పారు. అనంతరం పోలీసులతో కలిసి చిక్కడపల్లి పీఎస్‌కు వెళ్లారు.


మరోవైపు అల్లు అర్జున్‌ను పోలీసులు అదుపులోకి తీసుకునే సమయంలో రెండు పరిణామాలు చోటు చేసుకున్నాయి. అల్లు అర్జున్‌తో పాటు ఆయన తండ్రి అల్లు అరవింద్ సైతం పోలీస్ వాహనం ఎక్కారు. దీంతో తండ్రిని పోలీస్ వాహనం ఎక్కొద్దంటూ అల్లు అర్జున్ వారించారు. ఏం జరిగినా.. మంచైనా.. చెడైనా.. అంతా తనదేనంటూ తండ్రికి చెప్పారు. అరవింద్‌ను పోలీస్ వాహనం నుంచి దించేశారు.


ఈ కేసులో అల్లు అర్జున్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు.. ఆయనపై 105, 118(1) రెడ్ విత్‌ 3/5 BNS సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. బాధిత కుటుంబం ఇచ్చిన ఫిర్యాదు మేరకు అల్లు అర్జున్‌పై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

Updated Date - Dec 13 , 2024 | 03:17 PM