Allu Arjun: విచారణకు బయలుదేరిన బన్నీ...
ABN, Publish Date - Dec 24 , 2024 | 10:53 AM
సంధ్య థియేటర్ తొక్కిసలాట (Sandhya Theater Stampede), మహిళ మృతి కేసులో అరెస్ట్ అయిన అల్లు అర్జున్ మంగళవారం ఉదయం 11 గంటలకు విచారణ (inquiry) నిమిత్తం చిక్కడపల్లి పోలీసుస్టేషన్‌కు హాజరుకావాల్సి ఉంది.
సంధ్య థియేటర్ తొక్కిసలాట (Sandhya Theater Stampede), మహిళ మృతి కేసులో అరెస్ట్ అయిన అల్లు అర్జున్ మంగళవారం ఉదయం 11 గంటలకు విచారణ (inquiry) నిమిత్తం చిక్కడపల్లి పోలీసుస్టేషన్‌కు హాజరుకావాల్సి ఉంది. 10.35 గంటలకు అల్లు అర్జున్ ఇంటి నుంచి విచారణకు బయలుదేరారు. తొలుత ఆరోగ్యం బాగోలేదని, విచారణకు హాజరు కాలేనన్నారనే వార్తలొచ్చాయి. ఫైనల్ ఆయన పోలీస్ స్టేషన్‌కు బందోబస్తు మధ్య బయల్దేరారు. తొక్కిసలాట ఘటనపై పోలీసులు ఇటీవల 10 నిమిషాల వీడియో విడుదల చేశారు. దాని ఆధారంగా అల్లు అర్జున్‌ను (Allu Arjun) ప్రశ్నించే అవకాశముంది. దీంతో పాటు ఆయన నిర్వహించిన ప్రెస్‌మీట్‌పైనా విచారించే అవకాశం ఉందని తెలుస్తోంది. చిక్కడపల్లి పీఎస్ వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఈ నెల 4న రాత్రి సంధ్య థియేటర్‌లో పుష్ప 2 ప్రీమియర్‌షో చూేసందుకు అల్లు అర్జున్ వచ్చిన సమయంలో జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మరణించగా ఆమె కుమారుడు శ్రీతేజ్ గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పోలీసులు అనుమతి నిరాకరించినా ర్యాలీ నిర్వహించి ఒకరి మృతికి కారణమయ్యాడని అభియోగంతో చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేసి అల్లు అర్జున్‌ను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఆయనకు హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయటంతో చంచల్‌గూడ జైలు నుంచి విడుదలయ్యారు. అనంతరం చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో పోలీసులు ఆయనను విచారించేందుకు సిద్ధమయ్యారు.