Allu Arjun: రేవతి మృతిపై స్పందించిన అల్లు అర్జున్.. ఏమన్నారంటే
ABN, Publish Date - Dec 06 , 2024 | 09:43 PM
సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ మృతిపై తాజాగా అల్లు అర్జున్ సోషల్ మీడియా వేదికగా ఓ వీడియోను విడుదల చేశారు. ఈ వీడియోలో ఆయన ఏమన్నారంటే..
సంధ్య థియేటర్‌లో జరిగిన విషాద సంఘటన హృదయ విదారకంగా ఉంది. ఈ కష్ట సమయంలో దుఃఖిస్తున్న కుటుంబానికి హృదయపూర్వకంగా సానుభూతి తెలియజేస్తున్నాను. ఈ బాధలో వారు ఒంటరిగా లేరని మరియు కుటుంబాన్ని వ్యక్తిగతంగా కలుస్తామని నేను వారికి భరోసా ఇవ్వాలనుకుంటున్నాను. ఈ సవాలుతో కూడిన ప్రయాణంలో వారికి సహాయపడటానికి సాధ్యమైన ప్రతి సహాయాన్ని అందించడానికి నేను కట్టుబడి ఉన్నానని అన్నారు. రేవతి కుటుంబానికి రూ. 25 లక్షల ఆర్థిక సాయంతో పాటు కుటుంబాన్ని ఆదుకుంటానని అల్లు అర్జున్ హామీ ఇచ్చారు.
Also Read-Daggubati Family: దగ్గుబాటి ఇంట్లో పెళ్లి కొడుకుగా చైతూ.. ఫొటోలు వైరల్
ఈ వీడియోలో
‘‘అందరికీ నమస్కారం. మొన్న పుష్ప 2 సినిమా ప్రీమియర్ చూడటానికి RTC X Roads సంధ్య థియేటర్‌కి వెళ్లాం. అక్కడ అనుకోకుండా క్రౌడ్ ఎక్కువగా రావడం జరిగింది. మేము సినిమా చూసి వచ్చిన తర్వాత నెక్ట్స్ డే మార్నింగ్ మాకు తెలిసింది ఏమిటంటే.. ఆ క్రౌడ్‌లో ఓ ఫ్యామిలీ వచ్చారు. ఆ ఫ్యామిలీకి దెబ్బలు తగిలాయి. ముఖ్యంగా ఒక లేడీ, ఇద్దరు పిల్లల తల్లి రేవతి.. అక్కడ జరిగిన తొక్కిసలాటలో ఆకస్మాత్తుగా చనిపోయారని తెలిసింది. ఆ విషయం తెలియగానే.. నేను, సుకుమార్‌గారు, ఎంటైర్ టీమ్ ఆఫ్ పుష్ప.. అందరం సడెన్‌గా డిజప్పాయింట్‌లోకి వెళ్లి షాకయ్యాం. అస్సలు ఊహించలేదు. ఎందుకంటే, దాదాపు 20 ఏళ్ల నుండి మెయిన్ థియేటర్‌కి వెళ్లి సినిమా చూసి వస్తుండటం జరుగుతుంది. ఇలాంటిది ఎప్పుడూ జరగలేదు. ఇన్నేళ్లుగా ఎప్పుడూ జరగలేదు.. సడెన్‌గా ఇలా అయ్యే సరికి షాకయ్యాం. ఈ న్యూస్ తెలిసి మేము, మా టీమ్ అంతా కూడా పుష్ప సెలబ్రేషన్స్‌లో యాక్టివ్‌గా పాల్గొనలేకపోయాం. చాలా అంటే చాలా బాధగా అనిపించింది.
ఎందుకంటే, మేము సినిమాలు తీసేదే.. జనాలు థియేటర్లకు వచ్చి ఎంజాయ్ చేయాలని. అలాంటి థియేటర్‌లో ఇలాంటి ఇన్సిడెంట్ జరిగే సరికి ఎలా రియాక్ట్ కావాలో కూడా అర్థం కాలేదు. మాటలలో చెప్పలేను కూడా. రేవతిగారి ఫ్యామిలీ మొత్తానికి నా తరపున, టీమ్ పుష్ప తరపున సానుభూతిని తెలియజేస్తున్నాను. ఇప్పుడు మేము ఏం చేసినా ఆ లాస్‌ని తిరిగి తీసుకురాలేము. కానీ, మా శక్తి మేరకు ఆ ఫ్యామిలీకి ఏం కావాలన్నా చేయడం సిద్ధంగా ఉన్నాము. నేను మీకోసం ఉన్నానని మీకు నమ్మకం కలిగించడానికి తక్షణమే ఆ ఫ్యామిలీకి నా తరపున రూ. 25 లక్షలు డొనేట్ చేస్తున్నాను. వారి పిల్లలకి ఎలాంటి సపోర్ట్ కావాలన్నా కూడా, ఎప్పుడైనా చేయడానికి సిద్ధమని తెలియజేస్తున్నాను. ఇప్పటి వరకు జరిగిన మెడికల్ ఖర్చులు కూడా మేమే చూసుకుంటాం. ఆ ఫ్యామిలీపై ఇక ఎటువంటి భారం పడనివ్వం. ఈ కష్ట సమయంలో ఆ ఫ్యామిలీకి ఎటువంటి సపోర్ట్ అయినా చేయడానికి సిద్ధంగా ఉన్నాం.
ఈ సందర్భంగా నేను విన్నవించేది ఏమిటంటే.. మేము సినిమాలు చేసేది.. మీరు థియేటర్స్‌కు ఫ్యామిలీతో వచ్చి బాగా ఎంజాయ్ చేసి, ఆ సెలబ్రేషన్‌తో మిమ్మిల్ని పంపిద్దామని. ఇలాంటి సంఘటనలతో మా ఎనర్జీ కూడా డౌన్ అవుతుంది. దయచేసి సినిమాలకు వచ్చేటప్పుడు కాస్త కేరింగ్‌గా ఉండండి. చక్కగా సినిమా చూసి.. అంతే కేరింగ్‌గా ఇంటికి వెళ్లాలని కోరుకుంటున్నాను.. థ్యాంక్యూ’’ అని చెప్పుకొచ్చారు.