Allu Arjun: చిరు పద్మ విభూషణ్.. ఐకాన్ స్టార్ ఏమన్నారంటే ..!
ABN, Publish Date - Jan 26 , 2024 | 04:30 PM
పద్మ విభూషణ్ పురస్కారానికి ఎంపికైన చిరంజీవికి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వినూత్నంగా శుభాకాంక్షలు తెలిపారు. చిరంజీవి సాధించిన కొన్ని ఘనతలతో ఈ మేరకు ఓ ప్రత్యేక ఫొటోను డిజైన్ చేసి ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. కుటుంబ సభ్యులే కాదు అభిమానులు, తెలుగు ప్రేక్షకులు గర్వించేలా చేశారని కొనియాడారు.
పద్మ విభూషణ్ పురస్కారానికి ఎంపికైన చిరంజీవికి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వినూత్నంగా శుభాకాంక్షలు తెలిపారు. చిరంజీవి సాధించిన కొన్ని ఘనతలతో ఈ మేరకు ఓ ప్రత్యేక ఫొటోను డిజైన్ చేసి ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. కుటుంబ సభ్యులే కాదు అభిమానులు, తెలుగు ప్రేక్షకులు గర్వించేలా చేశారని కొనియాడారు.
"మెగాస్టార్...
155 సినిమాలు..
పది లక్షల బ్లడ్స్ యూనిట్స్ డొనేషన్స్
కరోనా కష్టకాలంలో రెండు తెలుగు రాష్ట్రాల జిల్లాలోనూ 32 ఆక్సిజన్ బ్యాంక్‌లు..
మూడు నందులు
తొమ్మిది ఫిల్మ్‌ఫేర్ అవార్డులు...
పద్మభూషణ్..
టూరిజం మినిస్టర్...
ఇప్పుడు పద్మవిభూషణ్ చిరంజీవి కొణిదెల’’ అని స్కెచ్ చేసిన ఫొటోను షేర్ చేసి శుభాకాంక్షలు తెలిపారు ఐకాన్ స్టార్ .
‘‘ప్రతిష్ఠాత్మక పద్మవిభూషణ్ అవార్డుకు ఎంపికైన చిరంజీవిగారికి ధన్యవాదాలు. భారతీయ సినీ పరిశ్రమ, సమాజానికి మీరందించిన సేవలు నాతోపాటు ఎంతోమంది అభిమానులను ప్రేరేపించడంలో కీలక పాత్ర పోషించాయి. కుటుంబంతోపాటు ఫ్యాన్స్, తెలుగు ప్రేక్షకులు గౌరవంగా, గర్వంగా ఫీలయ్యే క్షణమిది. మేమంతా గర్వపడేలా చేసిన మాకు కృతజ్ఞతలు’’ అని ట్వీట్‌లో పేర్కొన్నారు అల్లు అర్జున్.
ఊహించని పురస్కారమిది: చిరంజీవి
గణతంత్ర దినోత్సవంలో సందర్భంగా చిరంజీవి బ్లడ్‌బ్యాంక్‌లో ఏర్పాటుచేసిన జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. అభిమానుల వల్లే తాను ఈ స్థాయికి వచ్చినట్లు చెప్పారు. ‘‘45 ఏళ్ల సుదీర్ఘ సినీ ప్రయాణంలో కళామతల్లికి నావంతు సేవలు అందించాను. కళాకారులకు సామాజిక బాధ్యత కూడా ఉందని గ్రహించి.. సాయం కోరిన వాళ్లకు ఎన్నోఏళ్లుగా అండగా నిలబడ్డా. అందులో భాగంగానే బ్లడ్‌బ్యాంక్ స్థాపించా. దీని ఆధ్వర్యంలో ఎంతోమందికి ేసవ చేస్తున్నందుకు గర్వపడుతున్నా. ఇదంతా అభిమానుల సపోర్ట్‌తోనే సాధ్యమవుతోంది. ఈ జర్నీలో అండగా ఉన్న ప్రతి ఒక్కరికి ఎప్పుడూ రుణపడి ఉంటా. ఈ గణతంత్ర దినోత్సవం ఎంతో ప్రత్యేకం. నా సేవలను గుర్తించి 2006లో పద్మ భూషణ్ అవార్డు ఇచ్చారు. అదే నాకెంతో ప్రోత్సాహాన్ని ఇచ్చింది. ఊహించని విధంగా కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది పద్మవిభూషణ్ ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోదీకి ప్రత్యేక ధన్యవాదాలు. పద్మ అవార్డు గ్రహీతలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు’ అని చిరంజీవి అన్నారు.