Unstoppable4: బాల‌య్య అన్ స్టాపబుల్ 4.. గెస్ట్‌గా అల్లు అర్జున్

ABN, Publish Date - Oct 18 , 2024 | 06:23 PM

నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ఓటీటీ షో  'అన్‌స్టాపబుల్‌’ సీజన్ 4' స్ట్రీమింగ్కు రెడీ అవుతోంది. అయితే ఈ కార్య‌క్ర‌మం ఫస్ట్ ఎపిసోడ్ కు అల్లు అర్జున్ గెస్ట్ గా రానున్నట్లు తెలుస్తోంది.

nbk

నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna)వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ఓటీటీ షో  'అన్‌స్టాపబుల్‌’ సీజన్ 4' (Unstoppable 4) స్ట్రీమింగ్కు రెడీ అవుతోంది. ఈ అక్టోబర్‌ 24 న తొలి ఎపిసోడ్ ప్లే కానుంది. దసరా పండుగను పురస్కరించుకుని ఇప్ప‌టికే దీనికి సంబంధించిన ట్రైలర్‌ను మేక‌ర్స్ గ‌త శనివారం విడుదల చేసిన సంగ‌తి తెలిసిందే. అయితే అన్ స్టాపబుల్ 4 ఫస్ట్ ఎపిసోడ్ కు అల్లు అర్జున్ (Allu Arjun) గెస్ట్ గా రానున్నట్లు తెలుస్తోంది. పుష్ప 2 (Pushpa2TheRule) సీక్వెల్ రిలీజ్ అవ్వనున్న నేపథ్యంలో పుష్ప టీమ్ కూడా షోకు వస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే ఎపిసోడ్ కంప్లీట్ అయిందని, త్వరలోనే ప్రోమో రిలీజ్ అవ్వనుందని తెలుస్తోంది. ఇదిలాఉండ‌గా ఈ షోలో భాగంగా బాలయ్య , బన్నీతో నంద్యాల ఎపిసోడ్ ను ప్రస్తావించిన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ఏపీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం సమయంలో నంద్యాల వైసీపీ అభ్యర్థి.. తన ఫ్రెండ్ శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి ఇంటికి అల్లు అర్జున్ వెళ్లిన విషయం తెలిసిందే. పవన్ కళ్యాణ్ కు మద్దతుగా ట్వీట్ చేసి.. శిల్పా రవి ఇంటికి వెళ్లి మరీ విష్ చేయడాన్ని మెగా అభిమానులు జీర్ణించుకోలేకపోయారు. ఆ తర్వాత నుంచి ఇప్పటివరకు మెగా, అల్లు కుటుంబాల ఫ్యాన్స్ మధ్య మాటల యుద్ధం జరుగుతూనే ఉంది. దీంతో ఇప్పుడు నంద్యాల విషయంపై బన్నీ ఏం చెప్పారనేది ఆసక్తికరంగా మారింది. పలువురు కామన్ ఫ్యాన్స్.. నంద్యాల వివాదాన్ని క్లోజ్ చేయాల్సిందిగా ఎప్పటి నుంచో అల్లు అర్జున్ ను కోరుతున్నారు. ఇప్పుడు అన్ స్టాపబుల్ వేదికగా వివరణ ఇచ్చి ..ఇక్కడితో వివాదాన్ని ముగించాలని అల్లు అరవింద్ ప్లాన్ చేసినట్లు సమాచారం..

Updated Date - Oct 18 , 2024 | 06:23 PM