Wayanad Landslide Tragedy: అల్లు అర్జున్ విరాళం రూ.25 లక్షలు

ABN, Publish Date - Aug 04 , 2024 | 02:29 PM

ఐకాన్  స్టార్‌ అల్లు అర్జున్  (Allu Arjun) తన గొప్ప మనసు చాటుకున్నారు. కేరళలోని వయనాడ్‌లో చోటు చేసుకున్న ప్రకృతి విపత్తుపై ఆయన స్పందించారు. ఈ మేరకు కేరళ ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.25 లక్షల విరాళం ఇస్తున్నట్లు ప్రకటించారు.

ఐకాన్  స్టార్‌ అల్లు అర్జున్  (Allu Arjun) తన గొప్ప మనసు చాటుకున్నారు. కేరళలోని వయనాడ్‌లో చోటు చేసుకున్న ప్రకృతి విపత్తుపై ఆయన స్పందించారు. ఈ మేరకు కేరళ ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.25 లక్షల విరాళం ఇస్తున్నట్లు ప్రకటించారు. మృతులు, బాధిత కుటుంబాలకు సోషల్‌ మీడియా వేదికగా సానుభూతి తెలిపారు. వయనాడ్‌ ఘటన తనని కలచివేసింది. కేరళ వాసులు నన్ను ఎంతగానో అభిమానించి ఆదరిస్తారు’’ అని అన్నారు. కేరళలో అల్లు అర్జున్ కు  పెద్ద సంఖ్యలో ఫ్యాన్  ఫాలోయింగ్‌ ఉన్న సంగతి తెలిసిందే! అక్కడి అభిమానులు ప్రేమగా మల్లు అర్జున్‌ అని పిలుస్తుంటారు. (Allu arjun donates 25 lakhs)

వయనాడ్‌లో కొండచరియలు (Wayanad Landslide Tragedy) విరిగిపడిన ఘటనలో ఇప్పటికే ఎంతోమంది మృతిచెందడం యావత్‌ దేశాన్ని కలిచి వేస్తోంది. ఈ క్రమంలో బాధిత కుటుంబాలను ఆదుకునేందుకు ప్రభుత్వం తో పాటు పలువురు ప్రముఖులు ముందుకు వస్తున్నారు. ఇప్పటికే హీరో సూర్య, ఆయన భార్య జ్యోతిక, సోదరుడు కార్తి సంయుక్తంగా రూ.50 లక్షలు, నయనతార - విఘ్నేశ్‌ శివన్‌ దంపతులు రూ.20 లక్షలు, మలయాళ నటులు మమ్ముట్టి, ఆయన తనయుడు దుల్కర్‌ సల్మాన్‌ కలిపి రూ.35 లక్షలు, ఫహాద్‌ ఫాజిల్‌ రూ.25 లక్షలు, విక్రమ్‌ రూ.20 లక్షలు, రష్మిక రూ.10 లక్షల విరాళం ప్రకటించారు. ఈ ఘటనపై మలయాళ చిత్ర పరిశ్రమ విచారం వ్యక్తం చేసింది. కొన్ని రోజుల పాటు సినిమా వేడుకలు నిలిపివేస్తున్నట్లు పలు చిత్ర బృందాలు, నిర్మాణ సంస్థలు వెల్లడించాయి. మరోవైపు నటుడు మోహన్‌లాల్‌ స్వయంగా సహాయక చర్యల్లో పాల్గొన్నారు.

Updated Date - Aug 04 , 2024 | 02:29 PM