HBD Allu Arjun: టీజర్ మాత్రమే కాదు.. టీవీల్లో ఎంటర్‌టైనమెంట్‌కు కొదవలేదు..
ABN, Publish Date - Apr 08 , 2024 | 09:36 AM
సోమవారం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) పుట్టినరోజు వేడుక సందర్భంగా బుల్లితెరపై మాస్ హంగామా జరగబోతోంది. ఈ రోజు దాదాపు ప్రతీ తెలుగు తెలుగులో ఛానల్‌లో బన్నీ (HBD allu arjun) సినిమాలే టెలికాస్ట్ కానున్నాయి.
సోమవారం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) పుట్టినరోజు వేడుక సందర్భంగా బుల్లితెరపై మాస్ హంగామా జరగబోతోంది. ఈ రోజు దాదాపు ప్రతీ తెలుగు తెలుగులో ఛానల్‌లో బన్నీ (HBD allu arjun) సినిమాలే టెలికాస్ట్ కానున్నాయి. అల్లు అర్జున్ కెరీర్‌కు టర్నింగ్ పాయింట్‌గా నిలిచిన చిత్రాలన్ని ఈ రోజు టీవీల్లో దర్శనమివ్వనున్నాయి. అయితే ఈ లిస్ట్‌లో పాన్ ఇండియా సూపర్‌హిట్ 'పుష్ప’ (Pushpa)లేకపోవడం గమనార్హం. ఇంతకీ ఏయే ఛానల్‌లో ఏయే చిత్రాలు వేస్తున్నారో మీరూ చూసేయండి.
బన్నీ బర్త్ డే సందర్భంగా ఈరోజు మొత్తం తన సినిమాలు తప్ప వేరే చిత్రాలకు చోటు లేదు అంటోంది ‘స్టార్ మా మూవీస్’. వరుసగా బన్ని నటించిన నాలుగు చిత్రాలను బ్యాక్ టు బ్యాక్ ప్రసారం చేయనుంది. ఉదయం 9 గంటలకు... ‘జులాయి’, ఆ తర్వాత బన్ని అభిమానులకు పర్సనల్ ఫేవరెట్ సినిమా అయిన ‘పరుగు’ మధ్యాహ్నం 12 గంటలకు టెలికాస్ట్ కానున్నాయి. తదుపరి ‘బద్రీనాథ్’ మధ్యాహ్నం 3 గంటలకు బుల్లితెర ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నాయి. ఇక సాయంత్రం 6 గంటలకు అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబోలోని రెండో సూపర్ హిట్ సినిమా ‘సన్నాఫ్ సత్యమూర్తి’ టెలికాస్ట్ కానుంది.
'జీ’లోనూ సందడే..
స్టార్ మా’ నే కాదు.. జీలో కూడా బన్నీ బర్త్‌డే సందడి కనిపిస్తోంది. ముందుగా ఉదయం 9 గంటలకు ‘జీ తెలుగు’లో ‘డీజే’ టెలికాస్ట్ కానుంది. ఇక ‘జీ సినిమా’లో సాయంత్రం 6 గంటలకు ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ ప్రసారం కానుంది.
ఇక ఈరోజు అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా 'పుష్ప-2' టీమ్ కూడా అభిమానులకు ప్రేక్షకులు ట్రీట్ ఇవ్వనుంది. సోమవారం 11.07 నిమిషాలకు టీజర్‌ను విడుదల చేయనున్నారు. దీని కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఆగస్టు 15న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.