Allu Arjun: అల్లు అర్జున్ అరెస్ట్ కేసులో బిగ్ ట్విస్ట్.. పర్మిషన్ లెటర్
ABN, Publish Date - Dec 13 , 2024 | 05:08 PM
అల్లు అర్జున్ అరెస్ట్ నేపథ్యంలో ఓ లెటర్ సంచంలనంగా మారింది.
సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో అరెస్టయిన అల్లు అర్జున్‌కు గాంధీ ఆస్పత్రిలో వైద్య పరీక్షల అనంతరం నాంపల్లి క్రిమినల్ కోర్టులో హాజరు పరిచారు. నాంపల్లి కోర్టు 14రోజులు జ్యూడిషియల్ కస్టడీ విధించడంతో ఆయనను చంచల్‌గూడ జైలుకు తరలించనున్నారు. ఈ క్రమంలోనే సంధ్య థియేటర్ బయట పెట్టిన ఓ లేఖ వైరల్ గా మారింది.
ఈనెల 4న పుష్ప 2 ప్రీమియర్ షో గురించి ముందుగానే సీపీకి సంధ్య థియేటర్ లేఖ రాసింది. రాత్రి 9.30కి హీరోతో సహా పలువురు వీఐపీలు వస్తున్నారని, అవసరమైన పోలీసు బందోబస్తు కల్పించాలని కోరుతూ లేఖలో కోరారు. ఈ లేఖను రిలీజ్ కి రెండు రోజుల ముందే అందించడం విశేషం. మరోవైపు పోలీసులు నమోదు చేసిన FIRలో మాత్రం పర్మిషన్ తీసుకోలేదని మెన్షన్ చేయడంతో పరిస్థితులలో గందరగోళం ఏర్పడుతుంది.