Allu Arjun Arrest: మినిట్ టు మినిట్ జరిగింది ఇదే..
ABN, Publish Date - Dec 13 , 2024 | 04:40 PM
అల్లు అర్జున్ అరెస్ట్ తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు సృష్టిస్తుంది. ఉదయం అరెస్ట్ నుండి ఇప్పటి వరకు ఏం జరిగిందంటే..
మధ్యాహ్నం 12 గంటలు
పుష్ప -2 రిలీజ్ సందర్భంగా ఈ నెల 4వ తేదిన సంధ్య థియేటర్‌లో జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మరణించిన కేసు విషయంలో చిక్కడపల్లి పోలీసులు శుక్రవారం 12 గంటలకి నేరుగా అల్లు అర్జున్ ఇంటికి బయలుదేరారు.
నేరుగా ఆయన బెడ్ రూమ్ దగ్గరికే పోలీసులు చేరుకోవడంతో బన్నీ అసహనం వ్యక్తం చేశారు. అనంతరం టీ తాగిన బన్నీ భార్యకి భరోసా చెప్పారు. తనతో పాటు పోలీసు కారు ఎక్కినా తన తండ్రితో వారించి నేరుగా పోలీస్ స్టేషన్ బయలుదేరారు.
మధ్యాహ్నం 1.30 గంటలు
అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్, తమ్ముడు అల్లు శిరీష్, నిర్మాత దిల్ రాజు వంటి వారు పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు.
మధ్యాహ్నం 2 గంటలకు
విశ్వంభర సినిమా షూటింగ్ క్యాన్సిల్ చేసుకున్న చిరంజీవి హుటాహుటిన అల్లు అర్జున్ ఇంటికి చేరుకున్నారు. ఆయనతో పాటు భార్య సురేఖ కూడా ఉన్నారు.
కొద్దిసేపటికే నాగబాబు కూడా అక్కడికి చేరుకున్నారు. భద్రత పరిణామాల దృష్ట్యా వీళ్లెవరిని పోలీస్ స్టేషన్ కి అనుమతించలేదు..
మధ్యాహ్నం 2:02 ని.లకు గాంధీ ఆసుపత్రికి బన్నీ తరలింపు.
2:20 ని.లకు వైద్య పరీక్షలు.
2:50 ని.లకు వైద్య పరీక్షలు పూర్తి.
2:55 ని.లకు నాంపల్లికి కోర్టుకి బన్నీ తరలింపు.
3:15 ని.లకు నాంపల్లికి కోర్టుకి చేరుకున్న బన్నీ.
3:40 ని.లకువిచారణలో బన్నీని A11గా తేల్చిన కోర్టు, 14 రోజుల రిమాండ్ విధింపు.
4:20 ని.లకు బన్నీని చంచల్ గూడ జైలుకు తరలించేందుకు ఏర్పాటు.
4.30 ని.లకు హైకోర్టులో క్వాష్ పిటిషన్ పై విచారణ
5:00 గంటలకు న్యాయవాదుల వాదనలు విన్న తర్వాత మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు.
వార్త అప్డేట్ చేయబడుతోంది.