Allu Aravid: మీ బామ్మర్దితో సినిమా అంటే.. ఎన్టీఆర్ ఏమన్నారంటే!
ABN, Publish Date - Jul 19 , 2024 | 07:55 PM
నార్నే నితిన్, నయన సారిక జంటగా తెరకెక్కుతున్న చిత్రం ‘ఆయ్’. అంజి కె.మణిపుత్ర ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. జీఎ2 పికర్స్, అల్లు అరవింద్ సమర్పణలో బన్నీవాసు, విద్యా కొప్పినీడి ఈ చిత్నాన్ని నిర్మించారు.
నార్నే నితిన్ (Narne Nithin), నయన సారిక (Nayana Sarika) జంటగా తెరకెక్కుతున్న చిత్రం ‘ఆయ్’ (AAY). అంజి కె.మణిపుత్ర (Anji k Maniputhra) ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. జీఎ2 పికర్స్, అల్లు అరవింద్ సమర్పణలో బన్నీవాసు(Bunny vasu), విద్యా కొప్పినీడి ఈ చిత్నాన్ని నిర్మించారు. శుక్రవారం ఈ చిత్రం నుంచి థీమ్ సాంగ్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో అల్లు అరవింద్ మాట్లాడుతూ ‘ఆయ్’ టైటిల్ పెడితే.. ఒక ప్రాంతానికే పరిమితం అవుతుందా? అనే అనుమానం తలెత్తింది. దాని కోసం ఇరవై రకాల వేరియేషన్స్‌లో అనుకున్నాం. కానీ ుఫిదా’ టైటిల్ అన్ని చోట్ల సక్సెస్ అయింది. కథ బాగుంటే అందరూ ఆదరిస్తారని ఈ టైటిల్ ఫైనల్ చేశాం. ‘కథ చాలా సరదాగా ఉంది. కథ హిట్ అయితే అదే హీరోయిజం’ అని కథ విన్న తర్వాత హీరో నితిన్ అన్నారు. ఈస్ట్ గోదావరిలో వర్షంలో తీస్తానని అన్నారు. వర్షం కోసమే కోటి పైగా ఖర్చు పెట్టారు. అవుట్‌పుట్ చూస్తే మనం నిజంగానే ఆ ఊర్లోకి వెళ్లి వర్షంలో తడుస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఈ కథ సెట్ అయిన తరువాత ఎన్టీఆర్ గారికి ఫోన్ చేశాం. ‘ఫస్ట్ డే వరకు మనం పుష్ చేస్తాం.. ఆ తరువాత సినిమా బాగుంటేనే ఆడుతుంది.. ఎవరి కష్టం వారిదే.. సినిమా కథ బాగుందని అంటున్నారు.. చేసేయండి’ అని ఎన్టీఆర్ అన్నారు. నితిన ఈజ్‌తో యాక్ట్ చేశారు. అజయ్ అరసాడ చక్కని సంగీతం అందించారు’’ అని అన్నారు.
నార్నే నితిన్ మాట్లాడుతూ.. ‘మేం మంచి గోదావరి సినిమాను తీశాం. మంచి ఫ్రెండ్ షిప్ గురించి చెప్పాం. అందరూ ఎంజాయ్ చేసేలా ఉంటుంది. ఇంత మంచి చిత్రంలోకి నన్ను తీసుకున్న అంజి, బన్నీ వాస్ గారికి, అల్లు అరవింద్ గారికి థాంక్స్’’ అని అన్నారు.
బన్నీ వాస్ మాట్లాడుతూ ‘నాకు ఎంటర్‌టైన్మెంట్, ఫన్ అంటే చాలా ఇష్టం. ఎంత కష్టంలో, ఒత్తిడిలో ఉన్నా కూడా ఒక జోక్ మనకు రిలీఫ్ ఇస్తుంది. ఈ సినిమా చూస్తే కచ్చితంగా నవ్వి నవ్వి బుగ్గలు నొప్పి పెడతాయి. ఆ గ్యారెంటీ మేం ఇస్తున్నాం. కథ విని రెండు రోజులు నవ్వుతూనే ఉన్నాను. మీమర్స్‌కు మంచి కంటెంట్ దొరుకుతుంది. నితిన్, అంకిత్, కసిరాజు అద్భుతంగా నటించారు.
దర్శకుడు అంజి కె.మణిపుత్ర మాట్లాడుతూ.. ‘ఇప్పటి వరకు గోదావరి ప్రాంతాన్ని బేస్ చేసుకుని వచ్చిన చిత్రాలన్నింటిల్లోకెల్లా ది బెస్ట్ చిత్రం అవుతుంది. నితిన్ నార్నే ఎంతో సహజంగా నటించారు. అచ్చం అక్కడి యాసలానే మాట్లాడాడు.అమ్మాయిలను నేచర్‌తో పోల్చుతాం. అమ్మాయి తడిసినా, ఊరు తడిసినా అందంగా ఉంటుంది. మా ఆయ్ చిత్రం కూడా అంత అందంగా ఉంటుంది’ అని అన్నారు.