మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Aa Okkati Adakku: తండ్రి సినిమా టైటిల్‌కు ఫిక్సయిన అల్లరి నరేష్.. గ్లింప్స్ అదిరింది

ABN, Publish Date - Feb 16 , 2024 | 06:28 PM

61వ సినిమా కోసం డెబ్యు డైరెక్టర్ మల్లి అంకంతో చేతులు కలిపారు. అవుట్ అండ్ అవుట్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని చిలక ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాజీవ్ చిలక నిర్మిస్తున్నారు. భరత్ లక్ష్మీపతి సహ నిర్మాత. శుక్రవారం ఈ చిత్ర టైటిల్, ఫస్ట్ లుక్, గ్లింప్స్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ సినిమాకు అల్లరి నరేష్ ఫాదర్ ఈవీవీ సత్యనారాయణ కెరీర్‌లో ఎపిక్ హిట్‌గా నిలిచిన చిత్రం ‘ఆ ఒక్కటీ అడక్కు’నే టైటిల్‌గా ఫిక్స్ చేశారు.

Allari Naresh in Aa Okkati Adakku Movie

అల్లరి ఈజ్ బ్యాక్. ఎందుకు ఈ మాట అనాల్సి వచ్చిందంటే.. అల్లరి నరేష్ గత కొన్ని సినిమాలుగా.. సీరియస్ సబ్జెక్ట్‌లనే ఎన్నుకుని తనలోని వైవిధ్యతను చాటే ప్రయత్నం చేశారు. మళ్లీ ఆయన తన బిగ్గెస్ట్ ఫోర్ట్ - కామెడీకి తిరిగి వచ్చారు. తన 61వ సినిమా కోసం డెబ్యు డైరెక్టర్ మల్లి అంకంతో చేతులు కలిపారు. అవుట్ అండ్ అవుట్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని చిలక ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాజీవ్ చిలక నిర్మిస్తున్నారు. భరత్ లక్ష్మీపతి సహ నిర్మాత. శుక్రవారం ఈ చిత్ర టైటిల్, ఫస్ట్ లుక్, గ్లింప్స్‌ను మేకర్స్ విడుదల చేశారు. అల్లరి నరేష్ (Allari Naresh) ఫాదర్ ఈవీవీ సత్యనారాయణ కెరీర్‌లో ఎపిక్ హిట్‌గా నిలిచిన చిత్రం ‘ఆ ఒక్కటీ అడక్కు’ (Aa Okkati Adakku). అదే టైటిల్‌ని ఇప్పుడు అల్లరి నరేష్ చిత్రానికి టైటిల్‌గా ఫిక్స్ చేశారు.

టైటిల్‌తో పాటు అల్లరి నరేష్ పాత్రను పరిచయం చేస్తూ విడుదల చేసిన గ్లింప్స్.. సినిమా ప్రిమైజ్‌ని ఆసక్తికరంగా పరిచయం చేసింది. ఇందులో అల్లరి నరేష్ పాత్ర పేరు గణ, అతని పెళ్లి గురించి కుటుంబ సభ్యులు, ఇరుగుపొరుగు వారు అడుగుతారు. టైటిల్‌ను రివీల్ చేస్తూ ‘ఆ ఒక్కటీ అడక్కు’ అని వారికి సమాధానమిచ్చాడు. పెళ్లి అనేది పాన్ ఇండియా సమస్య అని చెప్తాడు, అయితే సినిమా తెలుగులో మాత్రమే విడుదల అవుతుంది. టైటిల్ లాగే, గ్లింప్స్ హిలేరియస్‌గా నవ్వులు పూయిస్తోంది. ఫరియా అబ్దుల్లా కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో వెన్నెల కిషోర్, జామీ లీవర్, వైవా హర్ష, అరియానా గ్లోరీ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. (Aa Okkati Adakku Title Glimpse Out)


అబ్బూరి రవి రైటర్, సూర్య డీవోపీగా పని చేస్తున్న ఈ చిత్రానికి గోపీ సుందర్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ చిత్రానికి చోటా కె ప్రసాద్ ఎడిటర్ కాగా, జె కె మూర్తి ఆర్ట్ డైరెక్టర్‌గా బాధ్యతలను నిర్వహిస్తున్నారు. ఈ టైటిల్ గ్లింప్స్‌లో సినిమాను 2024 మార్చి 22న విడుదల చేయబోతున్నట్లుగా మేకర్స్ ప్రకటించారు.


ఇవి కూడా చదవండి:

====================

*Vijay Deverakonda: ఫోర్బ్స్‌ లిస్ట్‌లో రష్మికకు చోటు.. విజయ్ స్పందనిదే..

****************************

*Chiranjeevi: ‘సుందరం మాస్టర్’కు మెగాస్టార్ సపోర్ట్.. ఏం చేశారంటే?

***************************

*‘ఏజెంట్’ బాటలోనే సందీప్ కిషన్ ‘ఊరు పేరు భైరవకోన’.. కాకపోతే?

***********************

Updated Date - Feb 16 , 2024 | 06:28 PM