Zulfi Ravdjee: అఖిల్ మామ చాలా రిచ్.. దుబాయ్‌లో పెద్ద

ABN, Publish Date - Nov 27 , 2024 | 09:46 AM

అక్కినేని అఖిల్ నిశ్చితార్థం వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ నేపథ్యంలోనే ఆయన

అఖిల్ అక్కినేని నిశ్చితార్థం వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అఖిల్ కాబోయే భార్య ఎవరని నెటిజన్లు ఆరా తీయడం మొదలు పెడితే ఆసక్తికరమైన విషయాలు బయటపడ్డాయి. అఖిల్ ఫియాన్సీ జైనాబ్ రావుద్జీ‌ తండ్రి జుల్ఫీ రావుద్జీ‌ బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే మాములుగా లేదు. సినీ ఇండస్ట్రీలో అక్కినేని ఫ్యామిలీ ఎంతో ప్రముఖమైనదో గల్ఫ్ దేశాల్లో రియల్ ఎస్టేట్ రంగంలో రావుద్జీ‌ ఫ్యామిలీ రేంజ్ అంతటిది.


జుల్ఫీ రావుద్జీ‌ గల్ఫ్ దేశాల్లో బిగ్ రియల్ ఎస్టేట్ టైకూన్. వేల కోట్ల ఆస్తి కలిగిన కుబేరుడు. ఆయనకు రియల్ ఎస్టేట్ రంగంలో 30 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. అంతేకాకుండా ఆయన ఏపీ మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలో సలహాదారుగా కూడా పని చేశారు. ఆయన ఏపీ గవర్నమెంట్ లో ప్రత్యేక ప్రతినిధిగా వ్యవహరించారు. ఇక ఆయన కుమారుడు జైన్ రావుద్జీ‌ ZR Renewable Energy Pvt Ltd సంస్థకు చైర్మన్, ఎండీగా పనిచేస్తున్నారు. రావుద్జీ‌ హైదరాబాద్ లోని రోడ్ నెంబర్.7, బంజారాహిల్స్ లో నివాసం ఉండేవారు. దాదాపు కేబినెట్ మినిస్టర్ స్థాయిలో ఏపీ గవర్నమెంట్ ఆయనకు కారు, ల్యాప్ టాప్, మూడు లక్షలు విలువ చేసే ఫర్నిచర్, లక్షన్నర విలువ చేసే కిచెన్ సామగ్రి, మెడికల్ రీయింబర్స్మెంట్, ఒక ప్రైవేట్ సెక్రటరీ, మరో అదనపు ప్రైవేట్ సెక్రటరీ, పర్సనల్ అసిస్టెంట్, ఒక జమేదార్, ఇద్దరు డ్రైవర్లు, మూడు మొబైల్ ఫోన్ కనెక్షన్లు అందించింది.


ఇక జైనాబ్ పుట్టింది హైదరాబాద్ లోనే అయినా దుబాయ్, లండన్, ఢిల్లీ, ముంబై వంటి నగరాల్లో విలాసాల మధ్య పెరిగింది. ఇక ఢిల్లీకి చెందిన జైనాబ్‌ థియేటర్‌ ఆర్టిస్ట్‌ మాత్రమే కాదు, సోషల్‌మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌ కూడా.. ఆమె సృజనాత్మకత, సంస్కృతి పట్ల ఆమెకున్న ప్రేమ అఖిల్‌కి దగ్గరయ్యేలా చేసినట్లుగా సమాచారం.

Updated Date - Nov 27 , 2024 | 10:25 AM