Akhil Akkineni: గుబురు గడ్డం, కోర మీసాలు.. తదుపరి సినిమా కోసమేనా?
ABN, Publish Date - Jun 14 , 2024 | 09:01 PM
అఖిల్ అక్కినేని ‘ఏజెంట్’ సినిమా పరాజయం తర్వాత ఆయన నుంచి మరో సినిమా అప్డేట్ రాలేదు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన స్పై యాక్షన్ థ్రిల్లర్‌గా వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీసు దగ్గర డిజాస్టర్‌గా మిగిలింది.
అఖిల్ అక్కినేని (Akhil Akkineni) ‘ఏజెంట్’ (Agent)సినిమా పరాజయం తర్వాత ఆయన నుంచి మరో సినిమా అప్డేట్ రాలేదు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన స్పై యాక్షన్ థ్రిల్లర్‌గా వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీసు దగ్గర డిజాస్టర్‌గా మిగిలింది. ఇప్పటికీ ఓటీటీలో కూడా విడుదల కాలేదు. ఈ మూవీ వచ్చి ఏడాది దాటినా తన నెక్స్ట్ ప్రాజెక్ట్‌ను అనౌన్స్ చెయ్యలేదు అఖిల్. మీడియాకు దూరంగా ఉంటున్నారు. అయితే చాలా రోజుల తర్వాత అఖిల్ మీడియా కంటపడ్డారు. దీంతో ఆయన కొత్త లుక్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.
అఖిల్ తాజాగా బెంగుళూరు నుంచి తిరిగొస్తూ, శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌లో కెమెరా చిక్కారు. ఇందులో అతను బ్లాక్ అండ్ బ్లాక్ డ్రెస్‌లో (Akhil new Look) హాలీవుడ్ హీరోను తలపించేలా కూల్‌గా ఉన్నారు. ఇంతకుముందు ఎన్నడూ లేని విధంగా గుబురు గడ్డం, కోర మీసాలు, పొడవాటి జుట్టుతో సూపర్ స్టైలిష్‌గా కనిపిస్తున్నారు. అయ్యగారి లేటెస్ట్ లుక్ చూసి అందరూ అవాక్కవుతున్నారు. అక్కినేని ఫ్యాన్స్ మాత్రం తమ హీరో నయా లుక్ చూసి ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఈ మేకోవర్ అంతా కచ్చితంగా తన తదుపరి చిత్రం కోసమే అని అభిప్రాయపడుతున్నారు అభిమానులు. అయితే అఖిల్ అనిల్ కుమార్ అనే కొత్త దర్శకుడితో సినిమా చేయనున్నట్లు కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి. ‘సాహో’, ‘రాధేశ్యామ్’ వంటి సినిమాలకు దర్శకత్వ శాఖలో పని చేశారు. ఇప్పుడు యూవీ క్రియేషన్స్ బ్యానర్లో అఖిల్ 6’ మూవీతో దర్శకుడిగా పరిచయం కాబోతున్నట్లు సమాచారం. భారీ బడ్జెట్‌తో తెరకెక్కే పీరియాడిక్ యాక్షన్ మూవీ అని, దీనికి ‘ధీర’ అనే టైటిల్ కూడా అనుకుంటున్నారని ప్రచారం జరుగుతోంది. ఏప్రిల్‌లో బర్త్‌డే స్పెషల్‌గా ఈ ప్రాజెక్ట్‌ను అధికారిక ప్రకటన చేస్తారనుకున్నారు. కానీ అది జరగలేదు. అయితే ఇప్పుడు అఖిల్ ఈ మూవీ కోసమే సరికొత్తగా మేకోవర్ అవుతున్నారని టాక్ వినిపిస్తోంది.