Akhanda 2: భం భం అఖండ.. ఖం ఖం ఖంగుమంది శంఖం
ABN, Publish Date - Dec 11 , 2024 | 06:11 PM
కొన్ని కాంబోలు, సినిమాల గురించి మాట్లాడటానికి మాటలు కరువవుతాయి.. అప్డేట్స్ రాయడానికి పదాలు కరువవుతాయి..
'సింహ’తో గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ(balakrishna), మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను (Boyapati Srinu) కాంబినేషన్ మొదలైంది. బాలయ్య (NbK) నుంచి అభిమానులు ఏం కోరుకుంటారో... ఆ అంశాలతో పాటు బలమైన కథ, పాత్ర, డైలాగ్‌లతో సినిమా తీసి విజయం సాధించారు. బాలయ్యను పాత్రకు తగ్గట్టు ఎలా మౌల్డ్ చేయాలో కూడా బోయపాటికి బాగా తెలుసు. వాళ్లిద్దరికీ అలా సింక్ అయింది. ఆ తర్వాత వారిద్దరి కలయికలో వచ్చిన ‘లెజెండ్’, ‘అఖండ’ చిత్రాలు సైతం భారీ విజయం సొంతం చేసుకున్నారు. హ్యాట్రిక్ కొట్టారు. ఇప్పుడు డబుల్ హ్యాట్రిక్ కోసం ‘అఖండ 2’కి శ్రీకారం చుట్టినా విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే బాలయ్య అభిమానులు పూనకాలు సిద్ధమయ్యే అప్డేట్ ని ఇచ్చారు మేకర్స్.
కొన్నిరోజుల క్రితం ఈ సినిమా పూజ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. 'డాకు మహారాజ్' రిలీజ్ తర్వాత ఈ సినిమా షూటింగ్ శరవేగంగా నిర్వహించేందుకు మేకర్స్ ప్లాన్ చేశారు. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ పోస్టర్ ని విడుదల చేసి ఆడియెన్స్ లో బజ్ క్రియేట్ చేశారు. ఈ సినిమాని సెప్టెంబర్ 25, 2025న రిలీజ్ చేయనున్నారు. ఈ పోస్టర్ లో బాలయ్య చేతులో త్రిశూలాన్ని మాత్రమే చూపించారు.
మరోవైపు బాలయ్య 'డాకు మహారాజ్' సినిమాకి దర్శకుడు బాబీ. బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తుండగా.. సంచలన స్వరకర్త ఎస్. థమన్ సంగీతం అందిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్‌ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పిస్తోంది. సంక్రాంతి కానుకగా 2025, జనవరి 12న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల కానుంది.