Ajith Kumar: అజిత్‌ కుమార్@32.. ‘మైత్రీ’ స్పెష‌ల్ విషెష్‌

ABN, Publish Date - Aug 06 , 2024 | 06:27 PM

అగ్రహీరో అజిత్‌ కుమార్ సినీ రంగ ప్రవేశం చేసి 32 యేళ్లు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన నటిస్తున్న ‘గుడ్‌ బ్యాడ్‌ అగ్లీ’ చిత్ర బృందం ప్రత్యేక పోస్టర్‌ను రిలీజ్‌ చేసింది.

ajith

అగ్రహీరో అజిత్‌ కుమార్ (Ajith Kumar) సినీ రంగ ప్రవేశం చేసి 32 యేళ్లు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన నటిస్తున్న ‘గుడ్‌ బ్యాడ్‌ అగ్లీ’ (Good Bad Ugly) చిత్ర బృందం ప్రత్యేక పోస్టర్‌ను రిలీజ్‌ చేసింది. 32 వసంతాల అజిత్‌ సినీ ప్రయాణం పేరుతో దీన్ని రూపొందించారు. అందులో ‘32 యేళ్ల ధైర్యం, క్రమశిక్షణ, గౌరవం.. మరి కొన్నేళ్లు ఇదేవిధంగా కొనసాగాలని కోరుకుంటున్నాం’ అని పేర్కొంది.


కాగా, ఈ చిత్రానికి ‘మార్క్‌ ఆంటోనీ’ ఫేం ఆధిక్‌ రవిచంద్రన్ (Adhik Ravichandran) దర్శకుడు. ఇందులో హీరో త్రిపాత్రాభినయం చేస్తున్నారు. ఇప్పటివరకు వెండితెరపై చూడని పాత్ర కూడా ఉంది. తెలుగు నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేక‌ర్స్ ( Mythri Movie Makers) ఈ సినిమాను నిర్మిస్తుండ‌గా దేవీ శ్రీ ప్ర‌సాద్ సంగీతం అందిస్తున్నారు. ఇదిలాఉండ‌గా అజిత్ న‌టించిన మగిళ్‌ తిరుమేని దర్శకత్వంలో ‘విడాముయర్చి’ చిత్రం ఈ యేడాది దీపావళికి విడుదల కానుంది.

Updated Date - Aug 06 , 2024 | 06:27 PM