మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Music Shop Murthy Trailer: ‘కొన్ని.. మన అనుకునేవాళ్ల కోసం వదులుకోవాలి’.. ఆకట్టుకుంటోన్న ‘మ్యూజిక్ షాప్ మూర్తి’ ట్రైలర్

ABN, Publish Date - May 31 , 2024 | 04:48 PM

అజయ్ ఘోష్, చాందినీ చౌదరి ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘మ్యూజిక్ షాప్ మూర్తి’ . తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్‌ను చూస్తే ఓ వైపు నవ్విస్తూనే మ‌రో వైపు సున్నిత‌మైన ఫ్యామిలీ ఎమోష‌న్స్‌తో కంట‌త‌డి పెట్టించేలా ఉంది.

Music Shop Murthy

అజయ్ ఘోష్ (Ajay Gosh), చాందినీ చౌదరి (Chandini Chowdary) ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘మ్యూజిక్ షాప్ మూర్తి’ ( Music Shop Murthy). ఫ్లై హై సినిమాస్‌ బ్యానర్ పై హర్ష గారపాటి మరియు రంగారావు గారపాటి ఈ మూవీని నిర్మించారు. శివ పాలడుగు ఈ సినిమాకి కథ, కథనాన్ని అందించి దర్శకత్వం వహించారు. కాన్సెప్ట్, కంటెంట్ బేస్డ్ సినిమాగా రాబోతోన్న ఈ మూవీ టీజర్, పాటలు, పోస్టర్లు ఇప్పటికే మంచి బజ్‌ను క్రియేట్ చేశాయి. ఈ సినిమా జూన్ 14న ప్రేక్ష‌కుల ముందుకు రానుండ‌గా తాజాగా ట్రైలర్‌ను రిలీజ్ చేశారు.

ఈ ట్రైలర్‌ను చూస్తే ఓ వైపు నవ్విస్తూనే మ‌రో వైపు సున్నిత‌మైన ఫ్యామిలీ ఎమోష‌న్స్‌తో కంట‌త‌డి పెట్టించేలా ఉంది. మిడిల్ క్లాస్ కష్టాలు, వారి క‌ల‌లు వాటిని నెరవేర్చుకోవడానికి వయసుతో సంబంధం లేదనేలా ఈ చిత్రంలో చూపించబోతున్నారని ట్రైలర్ చూస్తే అర్థం అవుతోంది. ‘అన్నీ మన కోసమే చేసుకోకూడదు.. కొన్ని మన అనుకునేవాళ్ల కోసం వదులుకోవాలి’ అంటూ అజయ్ ఘోష్ (Ajay Gosh) చెప్పిన ఎమోషనల్ డైలాగ్ ఆకట్టుకుంటుంది.


ఈ చిత్రానికి శ్రీనివాస్ బెజుగం కెమెరామెన్‌గా పని చేయగా, పవన్ సంగీతం అందించారు. బొంతల నాగేశ్వర రెడ్డి ఎడిటర్‌గా వర్క్ చేశారు. అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్, బేబీ, డీజె టిల్లు వంటి బ్లాక్ బస్టర్లను విజయవంతంగా పంపిణీ చేసిన ధీరజ్ మొగిలినేని (Dheeraj Mogilineni) ఎంటర్‌టైన్‌మెంట్ ద్వారా ఈ చిత్రం గ్రాండ్ రిలీజ్ అవుతోంది.

Updated Date - May 31 , 2024 | 04:48 PM