Megastar Chiranjeevi: వింటేజ్ మెగాస్టార్.. బాసూ, ఆ సీక్రెట్ ఏంటో చెప్పొచ్చుగా

ABN, Publish Date - Dec 04 , 2024 | 07:48 AM

మెగాస్టార్ చిరంజీవికి సంబంధించిన కొన్ని లేటెస్ట్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోలను చూసిన వారంతా చేస్తున్న కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. వింటేజ్ మెగాస్టార్ అంటూ వాళ్లు చేస్తున్న కామెంట్స్‌తో ఈ ఫొటోలు ట్రెండ్‌ని షేక్ చేస్తున్నాయి. పూర్తి వివరాల్లోకి వెళితే..

Megastar Chiranjeevi

మెగాస్టార్ చిరంజీవి.. ఈ పేరుకి పరిచయం అవసరమా. తెలుగు సినిమా ఇండస్ట్రీకి రారాజు.. ద వన్ అండ్ ఓన్లీ మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi). రాజకీయాలను వదిలి మళ్లీ సినీ ఇండస్ట్రీలోకి వచ్చిన మెగాస్టార్‌కు అంతకు ముందు ఉన్న చరిష్మా, ఖలేజా ఉంటుందా? అని అంతా అనుకుంటున్న సమయంలో.. ‘ఖైదీ నెంబర్ 150’లో మరోసారి బాక్సాఫీస్‌ని షేక్ చేసిన బాస్.. ఆ తర్వాత వరుస చిత్రాలతో కుర్ర హీరోలకు సైతం పోటీగా బరిలోకి దిగుతున్నారు. అదే స్థాయిలో.. కాదు.. కాదు.. వాళ్ల కంటే ఎక్కువగా వరుస సినిమాలను చేస్తూ.. ఎంతో మంది కుర్ర, స్టార్ హీరోలకు ఆదర్శంగా నిలుస్తున్నారు. ఈ వయసులో ఏం చేస్తాంలే అనుకునే వారికి ఎంతో స్ఫూర్తిని ఇస్తున్నారు.

Also Read- SS Rajamouli: ఆ ఒక్క సీన్‌తో సినిమా ఏంటో అర్థమైపోయింది


ఆయన ఎనర్జీకి కారణం మొదటి నుండి ఆయన నమ్ముకున్న కష్టమే. ఆ కష్టమే ఆయనని ఈరోజుకీ నెంబర్ వన్ స్థానంలో కూర్చోబెట్టి.. మకుటం లేని మహారాజుని చేసింది. ఇక ఆయన వయసు గురించి మాట్లాడుకోవాలి. మాములుగా అయితే కింగ్ నాగార్జున, సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ఈ వయసు, ఫిట్‌నెస్ విషయంలో ఎక్కువగా మాట్లాడుకుంటూ ఉంటారు. రోజురోజుకీ వీళ్ల వయసు తగ్గిపోతుంది ఏంటబ్బా అని ఆశ్చర్యపోతుంటారు. కానీ వాళ్లు కూడా ఆశ్చర్యపోయేలా మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ఇప్పుడు తన వయసు, ఫిట్‌నెస్‌పై దృష్టి పెడుతున్నారు.


ఈ మధ్య ఓ ఫంక్షన్‌లో తనకు, తన మిత్రుడు నాగార్జున కొన్ని ఫిట్‌నెస్ టిప్స్ ఇస్తూ ఉంటాడని, అవి తనకు ఎంతో హెల్ప్ చేస్తున్నాయని చెప్పుకొచ్చారు. నిజంగా నాగార్జున టిప్సే ఇందుకు కారణమో.. లేదంటే మెగాస్టార్ ఈ విషయంలో ఏదైనా ప్రత్యేక మార్గాన్ని కనుగొన్నారో తెలియదు కానీ.. ప్రస్తుతం ఆయన వింటేజ్ మెగాస్టార్‌ని తలపిస్తున్నారు. తాజాగా చిరంజీవి లేటెస్ట్ ఫొటోలను.. ఆయన టీమ్ సోషల్ మీడియాలో విడుదల చేసింది. ఈ ఫొటోలను చూసిన వారంతా.. ‘ఏమున్నాడ్రా బాసూ.. ‘గ్యాంగ్‌లీడర్’ చిరు తిరిగొచ్చాడ్రా..’ అంటూ కామెంట్స్ చేస్తుండటం విశేషం. వాళ్లు అన్నారని కాదు కానీ.. నిజంగానే చిరు ఈ ఫొటోలలో వింటేజ్ చిరుని తలపిస్తున్నారు. మరి ఫిట్‌నెస్ సీక్రెట్ ఏంటో మాకు కూడా చెప్పొచ్చుగా బాస్. ఇది.. నెటిజన్ల మాట.


Also Read-Rashmika Mandanna: దేనికైనా ఓ హద్దుంటుంది.. మితిమీరితే ఊరుకోను

-మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Dec 04 , 2024 | 08:24 AM