సినిమా చూసి.. ‘లవ్ రెడ్డి’ నటుడిపై మహిళ దాడి’ వీడియో వైరల్
ABN, Publish Date - Oct 25 , 2024 | 12:11 PM
లవ్‌రెడ్డి సినిమా ప్రమోషన్లో భాగంగా ఓ థియేటర్‌కు వెళ్లిన లవ్‌రెడ్డి చిత్ర యూనిట్‌కు చేదు అనుభవం ఎదురైంది. అప్పటివరకు సినిమా చూస్తున్న ఓ మహిళ ఉన్నఫలంగా వచ్చి అక్కడున్న ఓ నటుడిపై దాడి చేసింది.
నిత్యం సమాజంలో మనకు చాలా వింత అరుదైన విషయాలు ఎదుట పడడం, ఒక్కోసారి మనకే జరగడం చాలా సార్లు చూసి ఉంటాం. ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్ అయిన సినిమా రంగంలో ఇలాంటివి ఇంకా ఎక్కువగా జరుగుతుంటాయి. అలాంటి ఘటనే ఓ సినిమా విషయంలో నిన్న జరిగింది. తాము చూసింది సినిమా అని, అందులో పాత్రలు పోషించింది కేవలం నటులు మాత్రమేనని, అది ఆ పాత్ర వరకు మాత్రమేనని విషయం మరిచిపోయి చేసిన హంగామా అక్కడి వారిని భయభ్రాంతులకు గురి చేసింది.
విషయానికి వస్తే.. అంజన్ రామచంద్ర, శ్రావణి హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం చిత్రం లవ్ రెడ్డి (Love Reddy). గత వారం థియేటర్లలోకి వచ్చి మంచి ప్రేక్షకుల నుంచి సూపర్ పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ముఖ్యంగా సినిమాలో హరో హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ, క్లైమాక్స్ మూవీ చూసిన ప్రతి ప్రేక్షకుడిని బాగా ఆకట్టుకున్నాయి. అయితే సినిమాకు అనుకున్నంత బజ్, ఓపెనింగ్స్ అభించకపోవడంతో బ్లాక్ బస్టర్ బట్ ఫెయిల్యర్ మీట్ అని ఈవెంట్ పెట్టి టాలీవుడ్లో హాట్ టాపిక్ అయ్యారు. సినిమా బావుందని చూసిన వారంతా చెబుతున్నారని కానీ ప్రేక్షకులను రీచ్ కావట్లేదంటూ తమ ఆవేదనను వెలిబుచ్చారు.
ఈ పెయుల్యర్ ఈవెంట్ వార్త, టీమ్ అవేదన కాస్త వైరల్ అవడం.. ఈ విషయం మన రెబల్ స్టార్ ప్రభాస్ దృష్టికి వెళ్లడంతో ఆయన స్పందించి తన సోషల్ మీడియాలో లవ్ రెడ్డి సినిమా రివ్యూస్ వింటున్నాను ఆల్ ది బెస్ట్ మేకర్స్ అని పోస్టు పెట్టడంతో సినిమాకు కాస్త మైలేజ్ కూడా దొరికింది. దీంతో సినిమా గురించి కొద్ది మందికి తెలిసి యూత్ అండ్ ఫ్యామిలీ ఆడియెన్స్ ఇప్పుడిప్పుడే లవ్‌రెడ్డి సినిమాను ఆదరిస్తున్నారు. ఈక్రమంలో లవ్ రెడ్డి సినిమాలో నటించిన నటులంతా సినిమా ఆడుతున్న థియేటర్లకు వెళ్లి స్వయంగా ప్రేక్షకుల స్పందనను తెలుసుకుంటున్నారు.
ఈక్రమంలో థియేటర్స్ విజిట్ కు హైదరాబాద్ నిజాంపేట జీపీఆర్ మాల్‌కు వెళ్లగా అక్కడ సినిమా క్లైమాక్స్ రన్ అవుతుంది. సరిగ్గా అదే సమయంలో ఆ థియేటర్లో సినిమా చూస్తున్న ఓ మహిళ హీరోయిన్‌కు, తండ్రి పాత్ర మధ్యలో వచ్చిన ఓ ఎమోషనల్ సన్నివేశాన్ని చూసి తట్టుకోలేక ఆగ్రహంతో అలాగే వెళ్లి అక్కడికి వచ్చిన తండ్రి పాత్రదారి రామస్వామిని నాలుగైదు దెబ్బలు వేసింది. పైగా షర్ట్ చిరిగింది. ఒక్కసారిగా జరిగిన ఈ హాఠాత్ పరిణామంతో అక్కడికి వచ్చిన వారు భయభ్రాంతులకు గుయ్యారు. దీంతో వెంటనే తోటి నటులు అప్రమత్తం అయిన అతనిని కాపాడారు. ఇది కేవలం సినిమానే అని నిజం కాదంటూ సదరు మహిళకు నచ్చ చెప్పారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.