మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Adah Sharma: ‘C.D క్రిమినల్ ఆర్ డెవిల్’.. చాన్నాళ్ల‌కు తెలుగులో అదా శర్మ

ABN, Publish Date - May 22 , 2024 | 06:00 PM

ప్రస్తుతం నేషనల్ వైడ్‌గా క్రేజీ బ్యూటీగా మారింది హ‌ర్ట్ ఎటాక్ బ్యూటీ అదా శర్మ. ది కేరళ ఫైల్స్, బస్తర్ వంటి సినిమాలతో త‌న‌ రేంజ్ మారిపోయింది. చాలా కాలం తరువాత ‘C.D క్రిమినల్ ఆర్ డెవిల్’ అనే స్ట్రెయిట్‌ తెలుగు చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తోంది.

adha sharma

ప్రస్తుతం నేషనల్ వైడ్‌గా క్రేజీ బ్యూటీగా మారింది హ‌ర్ట్ ఎటాక్ బ్యూటీ అదా శర్మ (Adah Sharma). ది కేరళ ఫైల్స్, బస్తర్ వంటి సినిమాలతో త‌న‌ రేంజ్ మారిపోయింది. వ‌రుస చిత్రాల‌తో బిజీ అయింది. చాలా కాలం తరువాత రీసెంట్ సెన్సేషన్ అదా శర్మ స్ట్రెయిట్‌గా తెలుగు చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తోంది. తాజాగా ‘C.D క్రిమినల్ ఆర్ డెవిల్’ (Criminal Or Devil) అనే సినిమాలో న‌టిస్తోంది. కృష్ణ అన్నం దర్శకత్వం వహించిన ఈ మూవీని SSCM ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మించారు. ఈ మూవీకి గిరిధర్ ఎగ్జిగూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరించారు.

అసలే ఇప్పుడు హారర్, యాక్షన్, సస్పెన్స్, థ్రిల్లర్ జానర్లకు ఎక్కవ డిమాండ్ ఉంది. కంటెంట్, కాన్సెప్ట్ బేస్డ్ సినిమాలు ఎక్కువగా సక్సెస్ అవుతున్నాయి. ‘C.D క్రిమినల్ ఆర్ డెవిల్’ (Criminal Or Devil)అనే సినిమా కూడా ఓ డిఫరెంట్ కాన్సెప్ట్‌తో రాబోతోంది. ఇప్పటికే విడుదల చేసిన పోస్టర్స్, టీజర్, ట్రైలర్ ఇలా అన్నీ కూడా సినిమా మీద అంచనాలు పెంచేశాయి.


ఇక ఇప్పుడు ఈ ‘C.D క్రిమినల్ ఆర్ డెవిల్’ (Criminal Or Devil) చిత్రానికి సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. సెన్సార్ సభ్యులు ఈ చిత్రానికి యూ/ఏ సర్టిఫికేట్‌ను జారీ చేశారు. మే 24న ఈ చిత్రం భారీ ఎత్తున విడుదల కాబోతోంది. ఇప్పటికే ఆడియెన్స్‌లో మంచి బజ్‌ను క్రియేట్ చేయడం, సెన్సార్ నుంచి మంచి రిపోర్ట్‌ రావడంతో మరింత అంచనాలు పెరిగాయి.

ఈ‘C.D క్రిమినల్ ఆర్ డెవిల్’ (Criminal Or Devil) మూవీలో అదా శర్మ (Adah Sharma) కీలక పాత్ర పోషిస్తుండగా.. విశ్వంత్, జబర్దస్త్ రోహిణి, భరణి శంకర్, రమణ భార్గవ్, మహేష్ విట్టా ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రానికి ఏ.ముద్దు కృష్ణ డైలాగ్స్ అందించగా.. సతీష్ ముత్యాల సినిమాటోగ్రాఫర్‌గా పని చేశారు. సత్య గిడుతూరి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తించారు. RR ధృవన్ సంగీతం అందించారు.

Updated Date - May 22 , 2024 | 06:00 PM