Samanthaprabhu: న‌డుము తిప్పుతూ.. మెలిక‌లు తిరుగుతూ స‌మంత వ‌ర్కౌట్స్

ABN, Publish Date - Jul 03 , 2024 | 10:04 AM

ప్ర‌స్తుతం చేతిలో సినిమాలు లేకున్నా నిత్యం ఏదోర‌కంగా వార్త‌ల్లో ఉంటూ వ‌స్తోంది క‌థానాయిక స‌మంత. తాజాగా ఫిట్నెస్ కోసం వ‌ర్కౌట్ చేసిన వీడియోను బాగా వైరల్ అవుతోంది.

SAMANTHA

ప్ర‌స్తుతం చేతిలో సినిమాలు లేకున్నా నిత్యం ఏదోర‌కంగా వార్త‌ల్లో ఉంటూ వ‌స్తోంది క‌థానాయిక స‌మంత (Samantha). అనారోగ్య స‌మస్యలతో సినిమాల‌కు కాస్త విరామం ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ చాలా సెల‌క్టివ్‌గా మాత్ర‌మే సినిమాలు, సిరీస్‌లు చేస్తోంది. ఇప్పుడు ఎక్కువ‌గా బ‌య‌టి ద‌శాల‌లో విహార యాత్ర‌లు చేస్తూ అక్క‌డే త‌న హెల్త్ గురించి ట్రీట్‌మెంట్ కూడా తీసుకుంటుంది.

ఆ క్ర‌మంలోనే స‌మంత (Samantha) ఇత‌రులు హెల్త్ విష‌యంలో ఎలాంటి జాగ్ర‌త్త‌లు తీసుకోవాలో చెబుతూ ఆ మ‌ధ్య బాత్ ట‌బ్ థెర‌పీ గురించి వివ‌రించ‌గా అ వార్త బాగా వైర‌ల్ అయింది కూడా. అయితేవాటిని కంటిన్యూ చేస్తూనే తాజాగా త‌న వ‌ర్కౌట్ వీడియోను షేర్ చేసి త‌న ఆరోగ్యం విష‌యంలో ఎంత కేర్ తీసుకుంటాన‌నే విష‌యాన్ని వివ‌రించింది.


ఈ వీడియోలో స‌మంత (Samantha) ఆస‌నాలు, వ‌ర్కౌట్స్ చూసి అంతా అవాక్క‌వుతున్నారు. న‌డుమును ఆటు ఇటూ తిప్పుతూ.త‌ను మెలిక‌లు తిరుగుతూ వ్యాయామం చేసింది. ఇప్పుడీ వీడియో సోష‌ల్ మీగ‌డియాలో బాగా వైర‌ల్ అవుతోంది. మీరూ ఓ లుక్కేయండి.

Updated Date - Jul 03 , 2024 | 01:57 PM