Ramya Pasupuleti: ర‌మ్యా.. బుట్ట‌బొమ్మా! ఎక్క‌డా త‌గ్గ‌ట్లేదేంటి

ABN, Publish Date - Jul 28 , 2024 | 07:32 AM

సోష‌ల్ మీడియా యూజ‌ర్స్‌కు ఎక్కువ‌గా ప‌రిచ‌యం చేయాల్సిన అవ‌స‌రం లేని సెల‌బ్రిటీ ర‌మ్య ప‌సుపులేటి. తాజాగా హాలీడేస్ ఎంజాయ్ చేస్తోంది. అక్క‌డ వివిధ భంగిమ‌ల్లో ఫొటోలు దిగి యువ‌త‌కు నిద్ర లేకుండా చేస్తోంది.

Ramya Pasupuleti

ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియా యూజ‌ర్స్‌కు ఎక్కువ‌గా ప‌రిచ‌యం చేయాల్సిన అవ‌స‌రం లేని సెల‌బ్రిటీ ర‌మ్య ప‌సుపులేటి (Ramya Pasupileti). గ‌డిచిన ఐదారేండ్లుగా అడ‌పా ద‌డ‌పా, చిన్నా చిత‌కా సినిమాలు చేస్తూ వ‌స్తోంది.

2018లో హుషారు సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ చిన్న‌ది ఆ త‌ర్వాత ఇప్పటివరకు చెప్పుకోత‌గ్గ ఏ పెద్ద‌ సినిమాల్లో న‌టించ‌కున్నా, రావాల్సినంత బ్రేక్ రాకున్నా ఎప్పుడూ వార్త‌ల్లో నిలుస్తూనే వ‌స్తోంది.

సోష‌ల్ మీడియాలో య‌మా యాక్లివ్‌గా ఉండే ర‌మ్యకు ఫాలోవ‌ర్స్ సంఖ్య గ‌ట్టిగానే ఉంది. అందుకు త‌గ్గ‌ట్టుగా ప్ర‌తి రోజూ త‌న ఫొటోల‌ను షేర్ చేస్తూ అభిమానులు సంతృప్తి ప‌డేలా చేస్తోంది.

ప్ర‌స్తుతం వెకేష‌న్ మోడ్‌లో హాలీడేస్ ఎంజాయ్ చేస్తున్న ఈ అచ్చ తెలుగు అందం చిన్న‌ది అక్క‌డ వివిధ భంగిమల్లో ఫొటోలు దిగుతూ నెట్టింట ర‌చ్చ లేపుతోంది.

తాజాగా స‌ముద్ర‌పు ఒడ్డున బికినీలో ద‌ర్శ‌ణ‌మిచ్చి యువ‌త‌కు నిద్ర లేకుండా చేసింది. మీరూ చూసి ఆ అందాల‌ను ఆస్వాదించండి.


ప‌బ్లిక్ ప్రాంతాలలో త‌రుచూ సంద‌డి చేసే ఈ ముద్దుగుమ్మ త‌న అందంతో ఎదుటివారిని బాగా మెస్మ‌రౌజ్ చేస్తోంది. ఆ మ‌ధ్య స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌కు మ‌ద్ద‌తుగా ఐపీఎల్ మ్యాచ్‌లను చేసేందుకు వ‌చ్చి ఫ్యాన్స్‌లో కొత్త హుషారు తీసుకువ‌చ్చింది.

ఇప్పుడిప్పుడే అవ‌కాశాలు పెంచుకుంటున్న ఈ లేత సోయ‌గం ఓ నాలుగైదు తెలుగు చిత్రాల‌లో క‌థానాయిక‌గా న‌టిస్తోంది.

తాజాగా రావు ర‌మేశ్ మెయిన్‌లీడ్‌గా ర‌మ్య న‌టించిన మారుతీన‌గ‌ర్ సుబ్ర‌హ్మ‌ణ్యం సినిమా త్వ‌ర‌లో విడుద‌ల కానుంది.

Updated Date - Jul 28 , 2024 | 05:08 PM