Raashii Khanna: చీరను ఇలా కూడా కట్టొచ్చా.. రాశీఖన్నా

ABN, Publish Date - Jun 21 , 2024 | 09:14 AM

ఇటీవ‌ల వ‌చ్చిన బాక్‌ చిత్రం విజయంతో మంచి ఊపుమీదున్న హీరోయిన్‌ రాశీఖన్నా గ్లామర్‌ డోస్‌ను బాగానే పెంచింది. తాజాగా చీర కట్టులో ఎక్స్‌పోజింగ్‌ చేస్తూ.. చీరను ఇలా కూడా కట్టొచ్చంటూ షేర్ చేసిన ఫోటోలు పెద్ద‌ ర‌చ్చే చేస్తున్నాయి.

Raashii Khanna

ఈ మ‌ధ్య సుదర్‌ సి దర్శకత్వంలో త‌మిళంలో చేసిన ‘అరణ్మనై-4’ (బాక్‌) చిత్రం విజయంతో మంచి ఊపుమీదున్న హీరోయిన్‌ రాశీఖన్నా (Raashi Khanna) గ్లామర్‌ డోస్‌ను బాగానే పెంచింది.

ఇటీవ‌ల త‌న ఇన్‌స్టా ఎకౌంట్లో షేర్ చేసిన ఫొటోల‌ను చూస్తే అ విష‌యం మ‌న‌కు అర్థ‌మ‌వుతోంది. అయితే ఆ షోల‌ను కంటిన్యూ చేస్తూ కాస్త హీట్ పెంచింది.

తాజాగా స్టైలిష్ వేర్‌ నుంచి రూట్ మార్చి చీర కట్టులో ఆమె ఎక్స్‌పోజింగ్‌ చేస్తూ.. చీరను ఇలా కూడా కట్టొచ్చంటూ స్పెషల్‌ ఫొటోలను సోషల్‌ మీడియాలో షేర్ చేసిన ఫోటోలు పెద్ద‌ ర‌చ్చే చేస్తున్నాయి. రాశిలో ఈ కోణం చూడ‌లేదంటూ నెటిజ‌న్లు కామెంట్లు చేస్తున్నారు.

ఈ ఫొటోల కింద.. ‘ఇక్కడ నా పేరు కంటే నా ముఖమే ఎక్కువగా కనిపిస్తుంది. ఈ యేడాది ‘పాపులర్‌ ఫేస్‌’ అవార్డును ప్రదానం చేసిన ఓ మీడియా సంస్థ కు ధన్యవాదాలు’ అని ట్వీట్‌ చేశారు. 2013లో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ సుంద‌రి ఆ వెంట‌నే 2014లో మ‌నం సినిమాతో తెలుగులో ఆరంగేట్రం చేసి వ‌రుస సినిమాల‌తో దూసుకుపోయింది. 2018లో తమిళంలోకి ఎంట్రీ ఇచ్చిన రాశీఖన్నా (Raashi Khanna) ఆ తర్వాత అక్క‌డ ఓ నాలుగైదు చిత్రాల్లో మాత్ర‌మే నటించింది.


ఎక్కువ‌గా టాలీవుడ్‌పైనే పైనే దృష్టి పెట్టిన‌ ఈ చిన్న‌ది ఇప్ప‌టివ‌ర‌కు తెలుగులో 20కి పైగానే చిత్రాల్లో న‌టించింది. ఇక్క‌డ మంచి గుర్తింపు వ‌చ్చాక ఇప్పుడు బాలీవుడ్‌లోనూ ఛాన్సులు ద‌క్కించుకుంటోంది. ప్ర‌స్తుతం తెలుగు, హిందీల్లో రెండు చొప్పున త‌మిళంలో ఒక సినిమా చేస్తూ చాలా బిజీగా ఉంది.

సినిమాల‌తోనే కాకుండా సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటున్న రాశీఖన్నా (Raashi Khanna) త‌రుచూ త‌న‌ గ్లామర్‌ ఫొటోలను షేర్ చేస్తూ త‌న అభిమానుల‌కు నిద్ర లేకుండా చేస్తోంది.

ఆ కోవలోనే తాజాగా చీర కట్టులో చేసిన ఫొటోషూట్ సామాజిక మాధ్య‌మాల్లో బాగా వైల‌ర్‌గా మారింది. వాటిని చూసిన‌వారంతా చీర‌ను ఇంత గ్లామ‌ర్‌గా కూడా క‌ట్ట‌వ‌చ్చా అంటూ కామెంట్లు చేస్తున్నారు. రాశీఖన్నా (Raashi Khanna) క్రియేటివిటీకి స‌లాం చేస్తున్నారు. మీరు వాటిపై ఓ లుక్కేయండి.

Updated Date - Jun 21 , 2024 | 09:14 AM