మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Rave Party - Hema: అక్కడున్నది ఎవరో నాకు తెలీదు.. హేమ క్లారిటీ

ABN, Publish Date - May 20 , 2024 | 12:06 PM

బెంగళూరు శివారులో నిర్వహించిన రేవ్‌ పార్టీతో (Rave party Banglore) తనకు ఎలాంటి సంబంధం లేదని సినీ నటి హేమ (Hema) క్లారిటీ ఇచ్చారు. ఈ మేరకు ఆమె ఓ వీడియో విడుదల చేశారు.

బెంగళూరు శివారులో నిర్వహించిన రేవ్‌ పార్టీతో (Rave party Banglore) తనకు ఎలాంటి సంబంధం లేదని సినీ నటి హేమ (Hema) క్లారిటీ ఇచ్చారు. ఈ మేరకు ఆమె ఓ వీడియో విడుదల చేశారు. ‘నేను ఎక్కడకు వెళ్లలేదు. హైదరాబాద్‌లోనే ఉన్నాను. ఇక్కడ ఫామ్‌ హౌస్‌లో చిల్‌ అవుతున్నాను. నాపై వస్తోన్న వార్తలు నమ్మకండి. ఆ వార్తలో నిజం లేదు.   బెంగళూరు ఫామ్‌హౌస్‌లో ఎవరున్నారో నాకు తెలియదు. దయచేసి మీడియాలో నాపై వచ్చే వార్తలను నమ్మకండి’’ అని వీడియో ద్వారా తెలిపారు. (Hema Video clarity)

బెంగుళూరు శివారులో ఓ వ్యాపారవేత్తకు చెందిన ఫామ్‌ హౌస్‌లో నిర్వహించిన రేవ్‌ పార్టీలో పలువురు తెలుగు టీవీ నటీనటులు మోడళ్లు పట్టుబడ్డారు. దాదాపు 100 మందికి పైగా పార్టీకి హాజరయ్యారు. పార్టీలో పలు రకాల డ్రగ్స్‌ తీసుకున్నారని ఆదివారం అర్థరాత్రి తర్వాత జరిగిన రైడ్‌లో పోలీసులు గుర్తించారు.

Updated Date - May 20 , 2024 | 01:38 PM