Anushka Shetty: స్పీడ్.. పెంచుతోన్న జేజమ్మ
ABN, Publish Date - Oct 24 , 2024 | 06:27 PM
జేజమ్మ అని తెలుగు ప్రేక్షకులు ముద్దుగా పిలుచుకునే ముద్దుగుమ్మ అనుష్క ఏడాది విరామం తర్వాత సినిమాల విషయంలో కాస్త స్పీడు పెంచినట్లు తెలుస్తోంది.
జేజమ్మ అని తెలుగు ప్రేక్షకులు ముద్దుగా పిలుచుకునే ముద్దుగుమ్మ అనుష్క (Anushka Shetty) ఏడాది విరామం తర్వాత సినిమాల విషయంలో కాస్త స్పీడు పెంచినట్లు తెలుస్తోంది. గతేడాది మిస్ షెట్టి మిస్టర్ పొలిషెట్టి వంటి బ్లాక్‌బస్టర్ హిట్ చిత్రం తర్వాత మళ్లీ ఏడాది విరామం తీసుకున్న అనుష్క తిరిగి వరుసగా సినిమాలను లైన్లో పెడుతోంది. ఇప్పటికే మొట్ట మొదటి సారిగా మలయాళ ఇండస్ట్రీలోకి అడుగుపెడుతూ నటించిన కథనార్ (Kathanar) అనే సినిమా త్వరలో విడుదలకు రెడీ అవుతోంది. దీంతో అనుష్క అభిమానులు, ఫ్యామిలీ ఆడియెన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
బాహుబలి1 విజయం తర్వాత సైజ్ జీరో అంటూ ఓప్రయోగాత్మక చిత్రం చేసి చేయి కాల్చుకున్న అనుష్క (Anushka Shetty) ఆ సినిమా దెబ్బకు తన బరువు విషయంలో అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి రావడంతో సినిమాలు పూర్తిగా తగ్గిపోయాయి. తర్వాత చేసిన రుద్రమదేవి, నిశబ్దం వంటి సినిమాల్లో ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్లు చేసినా తర్వాత సింగం3, ఊపిరి, సోగ్గాడే చిన్ని నాయనా చిత్రాల్లో గెస్ట్ అప్పీరియన్స్‌లా మాత్రమే కనిపించింది. 2018లో వచ్చిన భాగమతి చిత్రం అనుష్క స్టామినాను మరోసారి రుజువు చేసి భారీ విజయం సాధించడంతో పాటు జేజమ్మ క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదని నిరూపించింది. ఆ తర్వా తిరిగి హెల్త్ సమస్యలు, కరోనా వళ్ల మూడేండ్లు సినిమాలకు దూరంగా ఉండి గత సంవత్సరం నవీన్ పొలిశెట్టితో కలిసి మిస్ షెట్టి మిస్టర్ పొలిషెట్టి వంటి ఫ్యామిలీ డ్రామాతో వచ్చి తెలుగు ప్రేక్షకులను మెస్మరైజ్ చేసింది.
తాజాగా మళయాల ఇండస్ట్రీలో అడుగుపెడుతూ అక్కడి ఆగ్ర నటుడు జయసూర్య సరసన కథానాయికగా చేస్తోంది.ఇప్పుడీ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకోగా డిసెంబర్‌లో గాని జనవరిలో గానీ పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. అదేవిధఃగా తనకు కెరీర్ ఆరంభంలో వేదం వంటి కల్ట్ చిత్రాన్ని అందించిన క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఘాటి చిత్రం ప్రస్తుతం షేఊటింగ్ చివరి స్టేజ్‌లో ఉండగా కొత్త సంవత్సరంలో థియేటర్లలోకి రానుంది. దీంతో పాటు బాగమతి2 సినిమా సీక్వెల్ కూడా పట్టాలెక్కనున్నట్లు సమాచారం.సో స్విటీ అనుష్క చాలా రోజుల తర్వాత సినిమా ప్రమోషన్లతో ప్రేక్షకుల ముందుకు రానుండడంతో ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.