Tovino Thomas: ఇక్కడి ప్రజలు ఎంతగానో ప్రేమిస్తున్నారు

ABN, Publish Date - Sep 10 , 2024 | 09:50 PM

స్టార్ హీరో టోవినో థామస్ మోస్ట్ ఎవైటెడ్ పాన్ ఇండియా పాంటసీ ప్రాజెక్ట్"ARM" తో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడానికి రెడీ అయ్యాడు. టోవినో థామస్ 50మైల్ స్టోన్ మూవీగా వస్తున్న ఈ చిత్రంలో కృతి శెట్టి, ఐశ్వర్య రాజేష్, సురభి లక్ష్మి హీరోయిన్స్ గా నటించారు.

arm

స్టార్ హీరో టోవినో థామస్ మోస్ట్ ఎవైటెడ్ పాన్ ఇండియా పాంటసీ ప్రాజెక్ట్"ARM" తో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడానికి రెడీ అయ్యాడు. టోవినో థామస్ 50మైల్ స్టోన్ మూవీగా వస్తున్న ఈ చిత్రంలో కృతి శెట్టి, ఐశ్వర్య రాజేష్, సురభి లక్ష్మి హీరోయిన్స్ గా నటించారు. జితిన్ లాల్ ఈ మూవీతో దర్శకుడిగా ప‌రిచయ‌మ‌వుతుండ‌గా డాక్టర్ జకారియా థామస్‌తో కలిసి మ్యాజిక్ ఫ్రేమ్స్, UGM మోషన్ పిక్చర్స్ బ్యానర్లపై లిస్టిన్ స్టీఫెన్ నిర్మించారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రాన్ని తెలుగులో మైత్రీ మూవీ మేకర్స్ డిస్ట్రిబ్యూటర్స్ గ్రాండ్ గా విడుదల చేస్తున్నారు. "ARM" సెప్టెంబర్ 12న విడుదల కానుంది. ఈ సందర్భంగా 'ARM' ప్రీరిలీజ్ ఈవెంట్ చాలా గ్రాండ్ గా జరిగింది.

ఈ సంద‌ర్భంగా హీరో టోవినో థామస్ (Tovino Thomas) మాట్లాడుతూ.. మైత్రీ మూవీ మేకర్స్ అంటే ఒక బ్రాండ్.. వారు మా సినిమాని తెలుగులో రిలీజ్ చేయడం హానర్‌గా భావిస్తున్నామ‌న్నారు. దర్శకుడు ఈ కథ చెప్పి మూడు క్యారెక్టర్స్ ప్లే చేయమని అడిగినప్పుడు.. మూడు క్యారెక్టర్స్ ని చేయగలనా ? అని అలోచించాను. మరో ఇద్దరు యాక్టర్స్ ని తీసుకోవచ్చు కదా అని అడిగాను. మూడు పాత్రలని నేనే ఎందుకు చేయాలో వారు చెప్పిన తర్వాత కన్విన్స్ అయ్యాను. ఆక్కడ నుంచి ఈ సినిమా ఒక డ్రీంలా జరిగిందన్నారు. మరో మూడు రోజుల్లో ఆ డ్రీం నిజం కాబోతోంది. ఈ సినిమాపై మేమంతా చాలా నమ్మకంగా వున్నాం. సెప్టెంబర్ 12 "ARM" త్రీడీ థియేటర్స్ లోకి వస్తుంది. అందరూ చూడండి. ఈ సినిమాలో పని చేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. అందరం టీంగా పని చేశాం. అందరూ సినిమాని చూస్తారని ఆశిస్తున్నాను. సినిమా మీకు నచ్చుతుంది. సినిమా మీకు నచ్చితే ప్లీజ్ స్ప్రెడ్ ది వర్డ్. అది మాకు చాలా హెల్ప్ అవుతుంది. థాంక్ యూ సో మచ్' అన్నారు.


హీరోయిన్ కృతి శెట్టి (Krithi Shetty)మాట్లాడుతూ.. ఒక మంచి సినిమాని తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ సపోర్ట్ చేస్తారనే నమ్మకం ఉంది. చాలా అద్భుతమైన కథ ఇది. జితిన్ ఈ సినిమా కోసం ఎనిమిదేళ్ళుగా కష్టపడ్డారు. సినిమాని అద్భుతంగా తీశారు. నన్ను తెలుగులో పరిచయం చేసిన మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాని తెలుగులో విడుదల చేయడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఇందులో హరీష్ గారి పాత్రని ఆడియన్స్ చాలా ఎంజాయ్ చేస్తారన్నారు. మలయాళంలో ఈ సినిమా నా డెబ్యు. అందరిసపోర్ట్ తో ఈ జర్నీ అద్భుతంగా జరిగింది. ఈ సినిమా త్రీడీలో వస్తుంది. తప్పకుండా అందరూ సినిమా చూసి ఎంజాయ్ చేయండి' అన్నారు. హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ మాట్లాడుతూ... ఇందులో జోది అనే క్యారెక్టర్ చేశాను. నా పాత్రని చాలా బ్యూటీఫుల్ గా డ్రాయింగ్ వేసి డైరెక్టర్ గారు నేరేట్ చేసినప్పుడు చాలా నచ్చింది. ఈ సినిమాలో భాగం కావడం హానర్ గా భావిస్తున్నా అన్నారు.

యాక్టర్ హరీష్ ఉత్తమన్ మాట్లాడుతూ.. ARM చాలా గ్రాండ్ సినిమా అని ట్రైలర్ చూస్తున్నపుడు మీ అర్ధమౌతుంది. ఇందులో మంచి ప్రేమకథ ఉంది. కృతి శెట్టి, ఐశ్వర్య రాజేష్, సురభి లక్ష్మి హీరోయిన్స్ గా అద్భుతంగా నటించారు. ఐశ్వర్య గారికి నేను ఫ్యాన్‌ని. కృతి ఈ సినిమాలో లక్ష్మీ క్యారెక్టర్ ని చాలా నేచురల్‌గా చేశారు. ఈ సినిమా నాకు చాలా ఇంపార్టెన్ క్యారెక్టర్ చేస్తున్నాను. టోవినో థామస్ త్వరలో నేరుగా తెలుగులో సినిమా చేయాలని కోరుకుంటున్నాను. ఈ సినిమాని త్రీడీలోనే చూడండి తప్పకుండా సినిమా మీ అందరినీ అలరిస్తుందన్నారు. యాక్ట్రెస్ రోహిణి మాట్లాడుతూ.. టోవినో థామస్ అందరూ గర్వపడే సినిమాలు చేస్తున్నారు. "ARM కూడా అలంటి ప్రతిష్టాత్మకమైన సినిమానే. డైరెక్టర్ మూడు కాలాలని జోడిస్తూ మూడు క్యారెక్టర్స్ అద్భుతంగా తీశాడు. ఇందులో నేను అజయన్ తల్లిగా కనిపిస్తాను. మరో కాలంలో తనది మా నాన్న పాత్ర. మరో కాలంలో మా తాత. చాలా అద్భతమైన కథ ఇది.ఈ సినిమా కోసం అందరూ చాలా హార్డ్ వర్క్ చేశారు. ఈ సినిమా మీ అందరికీ నచ్చుతుంది' అన్నారు.

Updated Date - Sep 10 , 2024 | 09:50 PM