Viswak Sen Laila: లేడీ గెటప్ లో మాస్ కా దాస్.. అదిరిపోయిన విశ్వక్ సేన్ లుక్

ABN, Publish Date - Jul 03 , 2024 | 11:03 AM

మాస్ కాదాస్ విశ్వక్ సేన్ వరుస చిత్రాలతో దూసుకుపోతున్నాడు. ఆయన తాజాగా మరో వైవిధ్య భరిత సినిమా లైలాను పట్టాలెక్కించాడు.

laila

మాస్ కాదాస్ విశ్వక్ సేన్ (Viswak Sen) వరుస చిత్రాలతో దూసుకుపోతున్నాడు. ఇప్పటికే ఈ యేడాది గామి, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చిత్రాలతో ప్రజల ముందుకు వచ్చిన ఆయన తాజాగా మరో వైవిధ్య భరిత సినిమాను పట్టాలెక్కించాడు. ఓ వైపు మెకానిక్ రాఖి సినిమా సెట్స్ పై ఉండగానే ఇప్పుడు లైలా (Laila) పేరుతో మరో సినిమా షూటింగ్ ను బుధవారం ప్రారంభించాడు.

విశ్వక్ సేన్ (Viswak Sen) ఫస్ట్ టైం లేడీ గెటప్ లో నటిస్తోన్న ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ (Shine Screens) పతాకంపై సాహూ గారపాటి (Sahu Garapati) నిర్మిస్తోండగా రామ్ నారాయణ్ ( Ram Narayan) దర్శకత్వం వహిస్తున్నాడు. అకాంక్ష శర్మ (AkankshaSharma) కథానాయికగా నటిస్తోంది. జిబ్రాన్ (Ghibran Vaibodha), బాలీవుడ్ ఫేమస్ తనిష్క్ (Tanishk Bagchi) సంగీతం అందిస్తున్నారు.


తాజాగా బుధవారం చిత్రం పూజా కార్యక్రమాల అనంతరం దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు (Raghavendra Rao K) విశ్వక్ సేన్ లైలా (Laila) లుక్ ను రివీల్ చేశారు. అంతేకాక సినిమాను ప్రేమికుల రోజు సందర్భంగా 2025 ఫిభ్రవరి 14న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.

Updated Date - Jul 03 , 2024 | 11:04 AM