Hero Karthi పవన్ స్వీట్ వార్నింగ్‌కు కార్తి స్పందన
ABN, Publish Date - Sep 24 , 2024 | 01:45 PM
తిరుమల శ్రీనువాసుడి లడ్డూ ప్రసాదం కల్తీ వివాదంలో మద్దతు పలకకుండా అపహాస్యంగా మాట్లాడిన వారినూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ (Pawan Kalyan) మండిపడ్డ సంగతి తెలిసిందే.
తిరుమల శ్రీనువాసుడి లడ్డూ ప్రసాదం కల్తీ వివాదంలో మద్దతు పలకకుండా అపహాస్యంగా మాట్లాడిన వారినూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ (Pawan Kalyan) మండిపడ్డ సంగతి తెలిసిందే. సోమవారం రాత్రి హైదరాబాద్‌లో జరిగిన సత్యం సుందరం ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో కార్తి (Hero Karthi) లడ్డూ విషయం సెన్సిటివ్ అని, ఇప్పుడు ఆ విషయం మనకొద్దని యాంకర్‌కు సమాధానం ఇచ్చారు. దీనిపై మంగళవారం ఉదయం పవన్‌కల్యాణ్ స్పందించారు. 'కుదిరితే మద్దతు పలకండి.. కానీ హిందూ ధర్మాన్ని అపహాస్యం చేయొద్దు’ అంటూ కార్తీకి కౌంటర్ ఇచ్చారు. దీంతో కార్తీ స్పందించారు. పవన్ కళ్యాణ్ సర్ మీకు నా క్షమాపణలు అంటూ ట్వీట్ చేశారు కార్తీ. (Karthi apologises)
"పవన్‌కల్యాన్ సర్ మీరంటే నాకు ఎంతో గౌరవం ఉంది. నేను అనుకోకుండా మాట్లాడిన మాటల్లో ఇలా అపార్థాలు ఏర్పడినందుకు నేను క్షమాపణ కోరుతున్నా. నేనూ వేంకటేశ్వరస్వామికి భక్తుడినే. ఎల్లప్పుడూ మన సంప్రదాయాలను గౌరవిస్తాను’’ అని కార్తీ ట్వీట్‌లో పేర్కొన్నారు.