G2: గూడఛారి 2.. షూటింగ్లో ఇమ్రాన్ హస్మీకి గాయాలు
ABN, Publish Date - Oct 07 , 2024 | 10:22 PM
అడివి శేష్ నటిస్తున్న 'గూఢచారి' 2 మూవీ ప్రస్తుతం హైదరాబాద్‌లో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. తాజాగా యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ జరుపుతుండగా నటుడు ఇమ్రాన్ హస్మీ గాయ పడ్డారు.
అడివి శేష్ (AdiviSesh) నటించిన 'గూఢచారి' ఎంతటి విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. 2018లో విడుదలైన ఈ సినిమాకి కొనసాగింపుగా ఇప్పుడు ‘జీ2’ (G2) చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హస్మీ (Emraan Hashmi) విలన్‌గా నటిస్తుండగా బనితా సంధు (Banita Sandhu) హీరోయిన్గా మధుశాలిని, సుప్రియ యార్లగడ్డ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
ప్రస్తుతం హైదరాబాద్‌లో ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఈ నేపథ్యంలో తాజాగా యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ జరుపుతుండగా నటుడు ఇమ్రాన్ హస్మీ (Emraan Hashmi) గాయ పడ్డారు. జంపింగ్ సీన్స్ తీస్తున్న సమయంలో మెడ స్వల్పంగా కట్ అయి రక్తం కారింది. దీంతో షూటింగ్ కాస్త బ్రేక్ ఇచ్చి నట్టు సమాచారం. వెంటనే వైద్యులు ఇమ్రాన్‌కు చికిత్స అందించారు.
పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ (People Media Factory), అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ (Abhishek Agarwal), ఏకే ఎంటర్టైన్మెంట్స్ (AK Entertainments) బ్యానర్లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, శ్రీచరణ్ పాకాల (Sricharan Pakala) సంగీతం అందిస్తున్నాడు. వినయ్ కుమార్ సిరిగినీడి (Vinay Kumar Sirigineedi) ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు.