Brahmaji: మనం చేసి చూపిద్దాం.. రండి సార్‌.. జగన్‌కు కౌంటర్‌!

ABN, Publish Date - Sep 08 , 2024 | 11:57 AM

వరద బాధితులకు (Ap Floods) అనుక్షణం అండగా నిలుస్తున్న ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ మాజీ ముఖ్యమంత్రి జగన్‌ (Ys Jagan)పెట్టిన పోస్ట్‌పై నటుడు బ్రహ్మాజీ (Brahmaji) తనదైన శైలిలో స్పందించిన సంగతి తెలిసిందే!

వరద బాధితులకు (Ap Floods) అనుక్షణం అండగా నిలుస్తున్న ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ మాజీ ముఖ్యమంత్రి జగన్‌ (Ys Jagan)పెట్టిన పోస్ట్‌పై నటుడు బ్రహ్మాజీ (Brahmaji) తనదైన శైలిలో స్పందించిన సంగతి తెలిసిందే! అయితే ఆ పోస్ట్‌ తాను చేయలేదంటూ తాజాగా ఆయన ఎక్స్‌ (ట్విటర్‌) వేదికగా తెలిపారు. తన అకౌంట్‌ హ్యాక్‌కు అయిందని చెప్పారు. ‘‘నా ఎక్స్‌  ఖాతాను హ్యాక్‌ చేశారు. నాకు ఆ ట్వీట్‌కు సంబంధం లేదు. ఫిర్యాదు కూడా చేశాం’’ అని బ్రహ్మాజీ పేర్కొన్నారు. ప్రస్తుతం ఆయన ట్వీట్‌ నెట్టింట వైరల్‌గా మారింది.  అసలు విషయంలోకి వెళ్తే.. వరదలు వచ్చి వారం దాటుతున్నా బాధితులకు సాయం అందడం లేదని కామెంట్‌ చేస్తూ, అసలు ఇదంతా ఎందుకు జరిగిందో చెబుతూ ఎక్స్‌ వేదికగా జగన్‌ సుదీర్ఘ పోస్ట్‌ పెట్టారు. దీనిపై విమర్శలు వెల్లువెత్తాయి. దాంతో ‘క్షేత్రస్థాయిలో జరుగుతున్న సాయం మీకు కనపడటం లేదా’ అంటూ నెటిజన్లు విరుచుకుపడ్డారు. ‘ఐదేళ్ల పాటు మీరు చేసిన నిర్వాకం వల్లే ఈ పరిస్థితి ఏర్పడింది’, ‘ఇది రాజకీయంగా ఆడే ఆట కాదు. ప్రజల జీవితం’, ‘సోషల్‌మీడియాలో ఈ విమర్శలు  ఆపేసి.. ఆకలి కేకలు వేస్తున్న వారికి సాయం చేయండి’ అంటూ నెటిజన్లు మండిపడ్డారు.

 

జగన్‌ పోస్ట్‌పై నటుడు బ్రహ్మాజీ స్పందించారు. సోషల్‌ మీడియాలో సెటైరికల్‌గా పోస్ట్‌లు పెట్టే బ్రహ్మాజీ జగన్‌ పోస్ట్‌కూ అలాగే సమాధానం ఇచ్చారు. ‘‘మీరు కరెక్ట్‌ సార్‌.. వాళ్ళు చెయ్యలేరు.. ఇక నుంచి మనం చేద్దాం.. ఫస్ట్‌ మనం రూ.1000 కోట్లు విడుదల చేద్దాం.  మన వైకాపా కేడర్‌ మొత్తాన్ని రంగంలోకి దింపుదాం .. మనకి  జనాలు ముఖ్యం.. ప్రభుత్వం కాదు. మనం చేసి చూపిద్దాం సార్‌.. జై జగన్‌ అన్నా’’ అంటూ పోస్ట్‌ పెట్టారు.

Updated Date - Sep 08 , 2024 | 12:44 PM