Naga Chaitanya@15: యువ సామ్రాట్ 15 ఇయర్స్ ఇండస్ట్రీ
ABN, Publish Date - Sep 05 , 2024 | 04:55 PM
యువ సామ్రాట్ నాగ చైతన్య 2009లో ‘జోష్’ సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి హీరోగా అడుగుపెట్టారు. ‘జోష్’ సినిమా 2009, సెప్టెంబర్ 5న గ్రాండ్‌గా విడుదలైంది. నేటితో తెలుగు సినిమా ఇండస్ట్రీలో 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్న నాగ చైతన్యకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం ఆయన చేస్తోన్న ‘తండేల్’ టీమ్ కూడా ఓ స్పెషల్ పోస్టర్‌ను విడుదల చేశారు.
యువ సామ్రాట్ నాగ చైతన్య (Yuva Samrat Naga Chaitanya) 2009లో ‘జోష్’ సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి హీరోగా అడుగుపెట్టారు. ‘జోష్’ సినిమా 2009, సెప్టెంబర్ 5న గ్రాండ్‌గా విడుదలైంది. ఈ సినిమా అనుకున్నంత సక్సెస్ సాధించకపోయినప్పటికీ.. డెబ్యూ హీరోగా చైతూకి మంచి పేరునే తెచ్చిపెట్టింది. ఆ తర్వాత నాగ చైతన్య ఒక్కో మెట్టు ఎక్కుతూ.. ఈ రోజు అక్కినేని నట వారసుడిగా దూసుకెళుతున్నారు. ఎన్నో విలక్షణమైన పాత్రలలో నటిస్తూ అనేక సూపర్ హిట్‌లను అందించిన నాగ చైతన్య నేటితో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా నాగచైతన్యకు ఇండస్ట్రీ నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. (15 Years Of Chay In TFI)
Also Read- Tollywood: సాయి ధరమ్, వరుణ్ తేజ్.. ఇప్పటి వరకు ఎవరెవరు ఎంతెంత విరాళం ఇచ్చారంటే..
స్క్రిప్ట్ విషయంలో నాగ చైతన్య టేస్టే వేరు. ఆయన చేసిన కొన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఫెయిలైనా.. హీరోగా మాత్రం నాగ చైతన్య ఎప్పుడూ ఫెయిల్ కాలేదు. ‘ఏ మాయ చేసావే, 100 పర్సంట్ లవ్, వెంకీ మామ, మజిలీ, లవ్ స్టోరీ’ వంటి సక్సెస్‌ఫుల్ సినిమాలతో తనకంటే ఓ క్రేజ్‌ని సొంతం చేసుకున్న చైతూ.. ఇంత వరకు ఏ అగ్ర హీరో చేయని సాహసం చేసి ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌లోనూ తన సత్తా చాటారు. ఓటీటీలో అడుగు పెట్టిన తొలి ప్రయత్నంలోనే ‘దూత’ వెబ్ సిరీస్‌తో బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టి.. పాన్ ఇండియా స్థాయి సక్సెస్‌ను, స్టేటస్‌ని అందుకున్నారు. ప్రస్తుతం ‘కార్తికేయ’ సిరీస్ చిత్రాల దర్శకుడు చందూ మొండేటితో ‘తండేల్’ అంటూ రగ్గడ్ అవతార్‌లో కనిపించేందుకు సిద్ధమయ్యారు.
మాములుగా వారసత్వాన్ని మోయడం అంటే ఎంతో భారంతో కూడుకున్న వ్యవహారం. అలాంటిది అక్కినేని లెగసీని నాగార్జున తర్వాత అంతే సక్సెస్‌పుల్‌గా చైతూ తన భుజస్కంధాలపై తీసుకెళుతూ.. అక్కినేని అభిమానులను ఖుషి చేస్తున్నారు. అలాగే ఇండియన్ రేసింగ్ ఫెస్టివల్‌లో హైదరాబాద్ బ్లాక్ బర్డ్స్ టీమ్‌ను సొంతం చేసుకుని సరికొత్త ప్రయాణానికి చైతూ శ్రీకారం చుట్టారు. ఈ ప్రయాణంలో ఆయన అర్జున్ కపూర్, జాన్ అబ్రహం, మాజీ క్రికెటర్ సౌరభ్ గంగూలీ వంటివారితో పోటీ పడబోతున్నారు.
తండేల్ విషయానికి వస్తే.. చందూ మొండేటి దర్శకత్వంలో అల్లు అరవింద్ సమర్పణలో ప్రతిష్టాత్మక గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై బన్నీ వాసు ఈ సినిమాని గ్రాండ్ గా నిర్మిస్తున్నారు. నిజ జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా ఈ సినిమా రూపొందుతోంది. హైదరాబాద్‌లో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో నాగ చైతన్య సరసన సాయి పల్లవి హీరోయిన్‌గా నటిస్తుంది. ఇక తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ‘తండేల్’ మేకర్స్ ఓ స్పెషల్ పోస్టర్‌ని విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో రగ్గడ్ అవతార్‌లో కనిపించిన నాగ చైతన్య తన చిరునవ్వుతో కట్టిపడేశారు. చైతు సముద్రం దగ్గర ఫిషింగ్ బోట్ మీద నిలబడి కనిపించిన ఈ పోస్టర్ ప్రస్తుతం వైరల్ అవుతోంది.
Read Latest Cinema News