Rhea Chakraborty: రియా చక్రవర్తి స్పెషల్ తెలుగు ఇంటర్వ్యూ

ABN, Publish Date - Oct 19 , 2024 | 12:36 PM

'తూనీగ తూనీగ' (Tuneega Tuneega) సినిమాలో నిధిగా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైనా హీరోయిన్ రియా చక్రవర్తి. ఆమె తన జీవితాన్ని చాఫ్టర్ 2‌గా డిజైన్ చేసుకున్నట్లు తెలిపింది. ఈ నేపథ్యంలోనే రియా చక్రవర్తి చిత్రజ్యోతితో ముచ్చటించారు. ఈ ఇంటర్వ్యూలో ఆమె తన తెలుగు సినిమా కంబ్యాక్ గురించి ఇంకా అనేక ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ షేర్ చేసుకున్నారు. మరెందుకు ఆలస్యం మీరు కూడా వెంటనే ఈ వీడియోని చూసేయండి.

12 ఏళ్ల క్రితం 'తూనీగ తూనీగ' (Tuneega Tuneega) సినిమాలో నిధిగా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైనా హీరోయిన్ రియా చక్రవర్తి (Rhea Chakraborty). ఈ బెంగాలీ బ్యూటీ ఆ తర్వాత బాలీవుడ్‌కి షిఫ్ట్ అయ్యింది. అయితే సినీ కెరీర్ ప్రారంభించాక ముందే ఈ అమ్మడు టీవీలో హోస్ట్‌గా మంచి క్రేజ్ సంపాదించుకుంది. నెక్స్ట్ బాలీవుడ్‌లో వరుసగా మేరే డాడ్‌కి మారుతి, సోనాలి కేబుల్, హాఫ్ గర్ల్‌ఫ్రెండ్, జలేబీ, చెహ్రే సినిమాలతో పర్వాలేదనిపించింది. ప్రముఖ బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుట్‌ (Sushant Singh Rajput) తో ప్రేమాయణం సాగించింది. కాగా 2020లో సుశాంత్ సూసైడ్ చేసుకొని చనిపోయారు. అయితే ఇది ఆత్మహత్య కాదు హత్య అని దీనికి ప్రధాన కారణం రియానే అంటూ పలు ఆరోపణలు బయటకొచ్చాయి. అలాగే డ్రగ్స్ కేసు కూడా నమోదు అయ్యింది. దీంతో ఆమె కొన్ని రోజులు జైలు జీవితం గడిపారు. ప్రస్తుతం ఆమె తన జీవితాన్ని చాఫ్టర్ 2‌గా డిజైన్ చేసుకున్నట్లు తెలిపింది. ఈ నేపథ్యంలోనే రియా చక్రవర్తి చిత్రజ్యోతితో ముచ్చటించారు. ఈ ఇంటర్వ్యూలో ఆమె తన తెలుగు సినిమా కంబ్యాక్ గురించి ఇంకా అనేక ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ షేర్ చేసుకున్నారు. మరెందుకు ఆలస్యం మీరు కూడా వెంటనే ఈ వీడియోని చూసేయండి.

Updated Date - Oct 19 , 2024 | 12:36 PM