Bhoothaddam Bhaskar Narayana: 'భూతద్ధం భాస్కర్ నారాయణ'.. ప్రేక్షకులకు థ్రిల్లింగ్ ఎక్స్ పీరియన్స్ ఇస్తుంది
ABN, Publish Date - Feb 21 , 2024 | 07:27 PM
శివ కందుకూరి హీరోగా రూపొందిన యూనిక్ క్రైమ్ థ్రిల్లర్ భూతద్ధం భాస్కర్ నారాయణ. డిఫరెంట్ కంటెంట్ కాన్సెప్ట్ తో రూపొందిన ఈ సస్పెన్స్ థ్రిల్లర్ నుంచి ఇప్పటికే విడుదలైన టీజర్, సీట్ ఎడ్జ్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో అలరించిన ట్రైలర్ ప్రేక్షకుల్లో క్యురియాసిటీ పెంచింది. మార్చి 1న ఈ చిత్రం విడుదల కానుంది.
శివ కందుకూరి (Shiva Kandukuri) హీరోగా రూపొందిన యూనిక్ క్రైమ్ థ్రిల్లర్ భూతద్ధం భాస్కర్ నారాయణ (Bhoothaddam Bhaskar Narayana) అద్భుతమైన ప్రమోషనల్ కంటెంట్ తో హ్యుజ్ బజ్ ని క్రియేట్ చేస్తోంది. స్నేహాల్, శశిధర్, కార్తీక్ నిర్మించిన ఈ సినిమాకి పురుషోత్తం రాజ్ (Purushotham Raaj) దర్శకత్వం వహిస్తున్నారు. డిఫరెంట్ కంటెంట్ కాన్సెప్ట్ తో రూపొందిన ఈ సస్పెన్స్ థ్రిల్లర్ నుంచి ఇప్పటికే విడుదలైన టీజర్, సీట్ ఎడ్జ్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో అలరించిన ట్రైలర్ ప్రేక్షకుల్లో క్యురియాసిటీ పెంచింది. మార్చి 1న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ నేపధ్యంలో నిర్మాతలు స్నేహాల్, శశిధర్ విలేకరుల సమావేశంలో చిత్ర విశేషాలని పంచుకున్నారు.
మీ మూవీ జర్నీ ఎలా మొదలైయింది ?
2014లో షీష్‌మహల్ అనే ఇండిపెండెంట్ సినిమా చేశాం. 2020లో 'నీతో' అనే సినిమా చేశాం. 2022 భూతద్ధం భాస్కర్ నారాయణ కథ (Bhoothaddam Bhaskar Narayana) విన్నాం. స్క్రిప్ట్ అద్భుతంగా అనిపించింది. సినిమాని ఎక్కడా రాజీ పడకుండా మంచి క్యాలిటీతో నిర్మించాం. అవుట్ అవుట్ అద్భుతంగా వచ్చింది. టీజర్ ట్రైలర్ పాటలు చాలా మంచి బజ్ ని క్రియేట్ చేయడం ఆనందంగా ఉంది.
భూతద్ధం భాస్కర్ నారాయణ (Bhoothaddam Bhaskar Narayana) ఎలా వుండబోతుంది ?
భూతద్ధం భాస్కర్ నారాయణ డిటెక్టివ్ థ్రిల్లర్. దర్శకుడు ఈ కథని చాలా కొత్తగా తీశారు. డిటెక్టివ్ కథని పురాణాలతో ముడి పెట్టిన విధానం ప్రేక్షకులకు చాలా థ్రిల్లింగ్ ఎక్స్ పీరియన్స్ ఇస్తుంది. ఇందులో ఇన్వెస్ట్ గేషన్ చాలా ఆసక్తిగా వుంటుంది. మంచి కంటెంట్ ఉన్న సినిమా ఇది. ప్రేక్షకులకు ఖచ్చితంగా నచ్చుతుందనే నమ్మకం ఉంది.
శివ కందుకూరి పాత్ర గురించి ?
డిటెక్టివ్ పాత్రలో శివ కందుకూరి గారు అద్భుతంగా చేశారు. ఇందులో డిటెక్టివ్ రోల్ రెగ్యులర్ కి భిన్నంగా ఉంటుంది. శివ కందుకూరి గారు ఈ పాత్రకు యాప్ట్. చాలా సహజంగా ఆ పాత్రలో ఒదిగిపోయారు. అలాగే హీరోయిన్ రాశి సింగ్ (Rashi Singh) కూడా చాలా హార్డ్ వర్క్ చేసింది. తనకి చాలా మంచి ప్రతిభ వుంది.
బడ్జెట్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు ?
భూతద్ధం భాస్కర్ నారాయణ (Bhoothaddam Bhaskar Narayana) కథ చాలా కొత్తగా వుంటుంది. ఈ కథకు బడ్జెట్ కావాలి. మేము ముందు అనుకున్నదానికంటే ఎక్కువే అయ్యింది. అయితే కథకు కావలసినది సమకూర్చి ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మించాం. సినిమా చాలా గ్రాండ్ గా వచ్చింది. బిజినెస్ పరంగా చాలా హ్యాపీగా వున్నాం. ఓవర్సిస్, ఓటీటీ బిజినెస్ క్లోజ్ అయ్యింది.
దర్శకుడు పురుషోత్తం రాజ్ గురించి ?
పురుషోత్తం రాజ్ (Purushotham Raaj) మంచి విజన్ ఉన్న దర్శకుడు. చాలా మంచి కథతో వచ్చారు. ఇందులో కథే హీరో. ఇప్పటివరకూ ఇలాంటి కథని చూసి వుండరు. ప్రతి ఇంటిముందు దిష్టి బొమ్మ ఉంటుంది. దాని వెనుక ఉన్న కథ ఏమిటి ? దీనికి ఒక ఫాంటసీ ఎలిమెంట్ ని జోడించి ఈ కథని చాలా అద్భుతంగా తీశారు.
శ్రీచరణ్ పాకాల మ్యూజిక్ గురించి ?
శ్రీచరణ్ (Sricharan Pakala) ప్రాణం పెట్టి ఈ సినిమా చేశారు. ఆయన బిజీఎం మామూలుగా ఉండదు. బీజీఎం ని ప్రేక్షకులకు చాలా ఎంజాయ్ చేస్తారు. ఇందులో శివ ట్రాన్స్ సాంగ్ లిరికల్ వీడియో కోసం ఏఐని వాడమన్నారు. మా ప్రొడక్షన్ డిజైన్ ఇచ్చిన ఆర్ట్ ని ఏఐ కంటెంట్ కి సరిపడా అవుట్ పుట్ ఇచ్చింది. దినికి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది.
కొత్త ప్రాజెక్ట్స్ గురించి?
కొన్ని ప్రాజెక్ట్స్ చర్చల్లో ఉన్నాయి. ప్రస్తుతం మా దృష్టి ఈ సినిమా విడుదలపైనే ఉంది.
ఆల్ ది బెస్ట్ , థాంక్ యూ