Venu Donepudi: ‘విశ్వం’లో అవి ప్రధాన హైలైట్ అవుతాయి

ABN, Publish Date - Oct 10 , 2024 | 10:14 PM

మాచో స్టార్ గోపీచంద్, దర్శకుడు శ్రీను వైట్ల కాంబినేషన్‌లో రూపుదిద్దుకున్న మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ ‘విశ్వం’. దసరా కానుకగా అక్టోబర్ 11న గ్రాండ్ రిలీజ్‌కు రెడీ అయ్యిందీ చిత్రం. ఇంకొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ మూవీ గురించి తాజాగా నిర్మాతలలో ఒకరైన వేణు దోనేపూడి చెప్పుకొచ్చారు.

Venu Donepudi Producer

మాచో స్టార్ గోపీచంద్ (Gopichand), దర్శకుడు శ్రీను వైట్ల (Sreenu Vaitla) కాంబినేషన్‌లో రూపుదిద్దుకున్న మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ ‘విశ్వం’ (Viswam). దసరా కానుకగా అక్టోబర్ 11న గ్రాండ్ రిలీజ్‌కు రెడీ అయ్యిందీ చిత్రం. ఈ హై బడ్జెట్ ఎంటర్‌టైనర్‌ను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, చిత్రాలయం స్టూడియోస్‌పై టీజీ విశ్వప్రసాద్, వేణు దోనేపూడి నిర్మిస్తున్నారు. దోనేపూడి చక్రపాణి ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. విడుదలకు సిద్ధమైన వేళ ఈ చిత్రం గురించి నిర్మాత వేణు దోనేపూడి అనేక విషయాలను మీడియాతో పంచుకున్నారు. ఆయన మాట్లాడుతూ..

‘‘ ‘విశ్వం’ ఫ్యామిలీ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్. ఇది అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుంది. యాక్షన్, కామెడీ, ఫ్యామిలీ సెంటిమెంట్, డ్రామా వంటి కమర్షియల్ అంశాలన్నీ ఇందులో ఉన్నాయి. దర్శకుడు శ్రీను వైట్ల స్క్రిప్ట్‌‌ని అద్భుతంగా మలిచారు. ఇందులోని కామెడీ, యాక్షన్, ఎమోషన్ ఇలా అన్నీ కూడా అద్భుతంగా వచ్చాయి. కామెడీ, యాక్షన్, ఎంటర్‌టైన్‌మెంట్ మేళవించిన కథనాన్ని శ్రీను వైట్ల తన స్టైల్‌లో విశ్వం రూపొందించారు. మిలన్‌లో చిత్రీకరించిన యాక్షన్ సన్నివేశాలు ప్రధాన హైలైట్ అవుతాయి. మాతేరా సిటీ, రోమ్, మిలన్, గోవా, హిమాచల్ ప్రదేశ్ వంటి సుందరమైన ప్రదేశాలలో ఈ చిత్రాన్ని షూట్ చేశాం. (Producer Venu Donepudi Interview)


గోపీచంద్‌ ఇమేజ్‌ని దృష్టిలో పెట్టుకుని దర్శకుడు శ్రీను వైట్ల కథను సిద్ధం చేశారు. గోపీచంద్ తన డైనమిక్ స్క్రీన్ ప్రెజెన్స్‌తో పాటు తన పాత్రను అద్భుతంగా పోషించారు. అతను కామెడీ టైమింగ్, యాక్షన్‌కు ఆడియెన్స్ ఫిదా అవుతారు. అతని కెరీర్‌లో ‘విశ్వం’ అత్యుత్తమ చిత్రంగా నిలుస్తుందని భావిస్తున్నాం. శ్రీను వైట్ల, గోపీచంద్‌లతో కలిసి పనిచేయడంతో ఎన్నో విషయాలు తెలుసుకున్నాను.. అలాగే నేర్చుకున్నాను.

Also Read- Vishwambhara: ‘విశ్వంభర’ వాయిదా? ‘గేమ్ చేంజర్’ సంక్రాంతికి వచ్చినా సమస్యే?

అమెరికాలో చాలా సంవత్సరాలు ఆటోమొబైల్ పరిశ్రమలో పనిచేశాను. కానీ సినిమాలు, కథ చెప్పడం నా అభిరుచి. యుఎస్‌లో ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్ అండ్ ఎగ్జిబిటర్‌గా.. 140కి పైగా తెలుగు, తమిళం, హిందీ చిత్రాలను విడుదల చేశాను. సినిమాల మీదున్న ప్యాషన్‌తోనే ఇక్కడకు వచ్చాను. ‘విశ్వం’ సినిమాను నిర్మించాను. ఈ సినిమా తర్వాత ‘జర్నీ టు అయోధ్య’ స్క్రిప్ట్ దశలో ఉంది. చిత్రాలయం స్టూడియోలో అద్భుతమైన కథలు, సంగీతంతో ఆకట్టుకునే చిత్రాలను నిర్మించడం నా లక్ష్యం. ఆ పని విజయవంతంగా చేస్తానని నమ్ముతున్నాను’’ అన్నారు.

Also Read- Prabhas: ప్రభాస్ పెళ్లిపై క్లారిటీ.. ఎప్పుడంటే

Also Read- Bigg Boss 8 Telugu: బిగ్‌బాస్ హౌజ్‌లో స్మోక్‌ చేస్తూ దొరికిన విష్ణుప్రియ‌.. వైర‌ల్‌

-మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Oct 10 , 2024 | 10:14 PM