మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

BHIMAA: ఇదంతా శివుని ఆజ్ఞ .. ‘భీమా’ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచుతుంది

ABN, Publish Date - Mar 06 , 2024 | 07:44 PM

మాచో హీరో గోపీచంద్ మోస్ట్ ఎవైటెడ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ భీమా. ఎ హర్ష దర్శకత్వం వహించారు. మార్చి 8న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ నేపధ్యంలో దర్శకుడు ఎ హర్ష విలేకరుల సమావేశంలో చిత్ర విశేషాలని పంచుకున్నారు.

bhimaa

మాచో హీరో గోపీచంద్ (Gopichand) మోస్ట్ ఎవైటెడ్ యూనిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్ భీమా (BHIMAA). ఈ సినిమాకి ఎ హర్ష (Nimma A Harsha) దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీసత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కె కె రాధామోహన్ లావిష్ గా నిర్మించారు. ప్రియా భవానీ శంకర్ (Priya Bhavani Shankar), మాళవిక శర్మ (Malvika Sharma) హీరోయిన్స్ గా నటించారు. టీజర్, ట్రైలర్, పాటలు ఇలా సినిమాకు సంబంధించిన ప్రతి ప్రమోషనల్ కంటెంట్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. మార్చి 8న మహా శివరాత్రి సందర్భంగా ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ నేపధ్యంలో దర్శకుడు ఎ హర్ష విలేకరుల సమావేశంలో చిత్ర విశేషాలని పంచుకున్నారు.

భీమా ప్రాజెక్ట్ తో తెలుగులో దర్శకుడిగా పరిచయం కావడం ఎలా అనిపిస్తోంది? ఈ ప్రాజెక్ట్ ఎలా మొదలైయింది?

నేను బెంగళూరులో పుట్టి పెరిగాను. ఇప్పటివరకూ అన్నీ కన్నడ సినిమాలే చేశాను. రాధామోహన్ గారి నిర్మాణంలో వచ్చిన బెంగాల్ టైగర్ సినిమాలో రెండు పాటలకు కొరియోగ్రఫీ చేశాను. ఇప్పుడు వారి బ్యానర్ లోనే భీమా (BHIMAA)తో తెలుగులో దర్శకుడిగా పరిచయం కావడం ఆనందంగా ఉంది. కోవిడ్ సమయంలో ఈ చిత్ర సహా నిర్మాత శ్రీధర్ గారు కాల్ చేశారు. ఆయనే గోపీచంద్ గారితో పరిచయం చేయించారు. గోపీచంద్ (Gopichand) గారికి ఓ కథ చెప్పాను. ఆయన కొన్ని మార్పులు చెప్పారు. ఆయన ఎలాంటి కథని కోరుకుంటున్నారో అర్ధమైయింది. ఓ ఎనిమిది నెలలు గ్యాప్ తీసుకొని ‘భీమా’ కథని చెప్పాను. దాదాపు స్క్రీన్ ప్లేతో సహా నేరేట్ చేశాను. కథ, నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే, ఎమోషన్స్ అన్నీ ఆయనకి నచ్చాయి. అలా భీమా మొదలైయింది.

నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే అందరికీ అర్ధమయ్యేలా ఉంటుందా ?

ప్రేక్షకులు ఎప్పుడూ చాలా పరిణితితో వుంటారు. వారిని కథలో యంగేజింగ్ గా వుంచడం కోసం కొత్త తరహ స్క్రీన్ ప్లేలని అనుసరించాలి. భీమా స్క్రీన్ ప్లే గ్రిప్పింగ్ గా వుంటుంది. అందరికీ అర్ధమౌతుంది. ఎంటర్ టైన్, ఎలివేషన్, ఎమోషన్ తో భీమా (BHIMAA) మంచి కమర్షియల్ సినిమాగా అలరిస్తుంది. సోషల్ మెసేజ్ కూడా వుంది. భీమా క్యారెక్టర్ చాలా ఎంటర్ టైనింగ్ గా ఉంటుంది. భీమా క్యారెక్టర్ ని అందరూ ఇష్టపడతారు. ఈ కథలో సెమీ ఫాంటసీ ఎలిమెంట్ కూడా వుంది. కమర్షియల్ టచ్ లో ఫాంటసీ ఎలిమెంట్ బ్లెండ్ చేయడం చాలా కొత్తగా వచ్చింది. ఆడియన్స్ కు ఇది సరికొత్త అనుభూతిని ఇస్తుంది.

ఈ కథని గోపీచంద్ గారికే చెప్పాలనిపించడానికి కారణం ?

గోపీచంద్ (Gopichand) గారు వండర్ ఫుల్ ఆర్టిస్ట్. చాలా మంచి పెర్ఫార్మార్. ఆయన సినిమాలన్నీ చూశాను. తనకి యూనిక్ బాడీ లాంగ్వేజ్ వుంది. భీమా పాత్ర ఆయనకే అద్భుతంగా నప్పుతుంది. ఆయన చాలా మంచి వ్యక్తిత్వం వున్న మనిషి. చాలా పాజిటివ్ గా ఎప్పుడూ నవ్వుతూనే ఉంటారు. భీమా (BHIMAA) పాత్రని ప్రేక్షకులు చాలా ఎంజాయ్ చేస్తారు. అవుట్ పుట్ పై సినిమా యూనిట్ అంతా చాలా ఆనందంగా వున్నాం.

ఈ సినిమాలో ప్రముఖ సాంకేతిక నిపుణులు కన్నడ నుంచి పని చేయడానికి కారణం ?

అలా ప్రత్యేకంగా ఏమీ లేదండీ. ఒక సినిమాకి డీవోపీ చాలా కీలకం. దర్శకుడి విజన్ తెరపై చూపించేది తనే. ఈ సినిమా డీవోపీ స్వామీతో నాకు 2012 నుంచి అనుబంధం ఉంది. నా ప్రతి సినిమా తనే చేస్తాడు. నాకు ఒక కో డైరెక్టర్ లా ఉంటారు. స్క్రిప్ట్ లో కూడా కూర్చుంటాడు. మా మధ్య ఆ అనుబంధం వుంది. ఇక రవి బస్రూర్ సినిమాలకి రాక మునుపు నాకు తెలుసు.


రవి బస్రూర్ (Ravi Basrur) మ్యూజిక్ గురించి ?

సలార్ తర్వాత తన నుంచి వస్తున్న సినిమా కావడంతో ఖచ్చితంగా అంచనాలు ఉంటాయి. అయితే నేను మాత్రం తనపై ఎలాంటి ఒత్తిడి తీసుకురాలేదు. అయితే టైం విషయంలో మాత్రం కాస్త ఒత్తిడి ఎదురైయింది. కన్నడలో అయితే రీ రికార్డింగ్ రెండు నెలలు పాటు చేస్తాం. ఇక్కడ 45 రోజుల్లో చేశాం, అది తప్పితే మరో ఒత్తిడి లేదు. తను వండర్ ఫుల్ కంపోజర్. సినిమా నచ్చితే ప్రాణం పెట్టి పని చేస్తాడు. భీమా (BHIMAA) ట్రైలర్ టీజర్ మ్యూజిక్ కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. సినిమాలో నేపధ్య సంగీతం మరో స్థాయిలో వుంటుంది

భీమా (BHIMAA) ట్రైలర్ చూశాక అఖండ తో పోలిక తెచ్చారు ? దీని గురించి ?

లేదండీ. అఖండకి భీమాకి సంబంధం లేదు. అఘోరాలని యాంబియన్స్ కోసం చూపించాం తప్పితే వారు సినిమాలో కీలకం కాదు.

ప్రియా భవానీ శంకర్, మాళవిక శర్మ గురించి ?

ప్రియా భవానీ (Priya Bhavani Shankar) చాలా చక్కని పాత్రని పోషించింది. నా ఫేవరేట్ క్యారెక్టర్. మాళవిక శర్మ (Malvika Sharma) పాత్ర కూడా ఆకట్టుకునేలా వుంటుంది.

నిర్మాత రాధామోహన్ (K.K.Radhamohan) గారి గురించి ?

రాధమోహన్ (K.K.Radhamohan) గారు చాలా పాషన్ ఉన్న నిర్మాత. సినిమాని అండర్ స్టాండ్ చేసుకునే నిర్మాత. సినిమాకి కావాల్సిన ప్రతిది సమకూర్చారు. అద్భుతమైన క్యాలిటీతో సినిమాని నిర్మించారు.

భీమా (BHIMAA) శివరాత్రికి రావడం ముందే ప్లాన్ చేశారా ?

నిజంగా ఇది మిరాకిల్. మహా శివరాత్రికి రావాలని ప్రత్యేకంగా ప్లాన్ చేసుకోలేదు. ఈ సినిమా ఆరంభం, ముగింపు శివునితో వుంటుంది. హీరో ఎద్దుపై వస్తారు. ఇది కూడా ప్లాన్ చేయలేదు. హీరో గోపీచంద్ (Gopichand) మొదటి డైలాగ్ కూడా శివుని మీద ఉంటుంది. ఇదంతా శివుని ఆజ్ఞ అని భావిస్తున్నాను.

Updated Date - Mar 06 , 2024 | 07:44 PM