కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Director Vijay Binni: ‘నా సామిరంగ’లో చాలా సర్‌ప్రైజ్‌లున్నాయ్..

ABN, Publish Date - Jan 06 , 2024 | 07:47 PM

కింగ్ నాగార్జున నటించిన హోల్సమ్ ఎంటర్‌టైనర్ ఛిత్రం ‘నా సామిరంగ’. ఈ సినిమాతో కొరియోగ్రాఫర్ విజయ్ బిన్ని.. దర్శకునిగా పరిచయం అవుతున్నారు. ఇప్పటి వరకు విడుదలైన ఈ మూవీ ప్రమోషనల్ కంటెంట్.. సినిమాపై హ్యూజ్ బజ్‌ని క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమా విశేషాలను చిత్ర దర్శకుడు విజయ్ బిన్ని మీడియాకు తెలియజేశారు.

Vijay Binni and King Nagarjuna

కింగ్ నాగార్జున (King Nagarjuna) నటించిన హోల్సమ్ ఎంటర్‌టైనర్ ఛిత్రం ‘నా సామిరంగ’ (Naa Saami Ranga). ఈ సినిమాతో కొరియోగ్రాఫర్ విజయ్ బిన్ని (Vijay Binni).. దర్శకునిగా పరిచయం అవుతున్నారు. ఇప్పటి వరకు విడుదలైన ఈ మూవీ ప్రమోషనల్ కంటెంట్.. సినిమాపై హ్యూజ్ బజ్‌ని క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్‌పై శ్రీనివాస చిట్టూరి హై బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సంక్రాంతి (Sankranthi) కానుకగా ఈ సినిమా జనవరి 14న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలయ్యేందుకు సిద్ధమైంది. తాజాగా చిత్ర దర్శకుడు విజయ్ బిన్ని.. మీడియాకు ఈ చిత్ర విశేషాలను తెలియజేశారు.

కొరియోగ్రాఫర్ నుంచి దర్శకుడిగా ఎలా టర్న్ అయ్యారు?

దర్శకుడిని కావాలనే పరిశ్రమలోకి వచ్చాను. ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ సినిమా చూసిన తర్వాత అన్నీ క్రాఫ్ట్స్ బాగా చేశారు, కొరియోగ్రాఫర్‌కి ఆ గ్రిప్ ఉంటుందని భావించి కొన్నాళ్ళు కొరియోగ్రఫీ వైపు వెళ్లాను.

మీ తొలి సినిమాతోనే కింగ్ నాగార్జున వంటి పెద్ద స్టార్‌ని డైరెక్ట్ చేయడం ఎలా అనిపించింది?

ఇంతకుముందు నాగార్జున గారికి పాటలు చేశాను. సినిమా కూడా చాలా హ్యాపీ‌గా చేసుకుంటూ వెళ్లాం. దర్శకుడిగా తొలి సినిమాని నాగార్జునగారితో చేయడం నా అదృష్టం.


కొరియోగ్రఫీ వేరు డైరెక్షన్ వేరు కదా.. ఈ రెండూ చేయడం ఒత్తిడి అనిపించిందా?

లేదండీ. నాకు మొదటి నుంచి డైరెక్షన్ పైనే ఆసక్తి వుంది. కొరియోగ్రఫీ కూడా ఎక్కువ స్టోరీ టెల్లింగ్ వున్న పాటలు, మాంటేజస్ చేశాను. సరైన సమయంలో ఈ అవకాశం వచ్చింది. ఎక్కడా ఇబ్బంది లేకుండా అంతా సజావుగా జరిగింది.

అసలీ అవకాశం ఎలా వచ్చింది?

ముందు నాగార్జునగారితో ఒక సినిమా చేయాలని ఆయనకి కథ చెప్పాను. అప్పుడు ఆయన ఈ కథ గురించి చెప్పి ఈ ప్రాజెక్ట్‌ని డైరెక్ట్ చేయమని చెప్పారు. అప్పుడు ఈ కథని ఓన్ చేసుకొని నా స్టయిల్‌లో చేశాను. ఈ సినిమాలో చాలా హైస్ వుంటాయి. వింటేజ్ నాగార్జునగారు కనిపిస్తారు. నేను నాగార్జునగారిని ఎంత డిఫరెంట్‌గా చూపించాలని అనుకున్నానో.. అంత కొత్తగా ప్రజెంట్ చేశానని భావిస్తున్నాను. (Director Vijay Binni About Naa Saami Ranga)

అల్లరి నరేష్, రాజ్ తరుణ్ పాత్రల గురించి?

ఇదొక ఫ్రెండ్షిప్ మూవీ. నరేష్‌గారికి నాగార్జున గారంటే పిచ్చి. వారిద్దరిని ఈ కథలో పెడితే బావుంటుందనిపించింది. నరేష్‌గారు అద్భుతంగా చేశారు, వీరితో పాటు మరో యంగ్ యాక్టర్ వుండాలి. ఆ పాత్రకు రాజ్ తరుణ్‌ని తీసుకున్నాం. ఇందులో ముగ్గురికీ ఒక్కొక్క కథ వుంటుంది. ఈ కథలు ఎలా కనెక్ట్ అయి వున్నాయి? వాళ్ళ మధ్య జరిగిన సిచ్యుయేషన్స్ ఏమిటనేది చాలా కొత్తగా వుంటాయి.

మీ వర్క్ పట్ల కింగ్ నాగార్జున రియాక్షన్ ఏంటి?

నాగార్జునగారు చాలా హ్యాపీగా వున్నారు. ఆయన ఎంతో మంది దర్శకులతో పని చేశారు. అందులో నా ప్రత్యేకత ఏమిటనేది నాగార్జున గారు చెబితేనే బావుంటుంది. ఆర్టిస్ట్ సపోర్ట్ చేస్తే సినిమాని ఎంత త్వరగా పూర్తి చేయవచ్చో ఈ సినిమాతో నేర్చుకున్నాను. నాగార్జున‌గారు, నరేష్‌గారు, రాజ్ తరుణ్ అద్భుతంగా సపోర్ట్ చేశారు. (Director Vijay Binni)

ఇందులో ఐటెం సాంగ్ సర్‌ప్రైజ్ వుందని విన్నాం?

చాలా సర్‌ప్రైజ్‌లు వున్నాయి. అవన్నీ తెరపై చూడాల్సిందే.


ఆస్కార్ అవార్డ్ అందుకున్న తర్వాత కీరవాణి చేసిన చిత్రమిది. తొలి సినిమా దర్శకుడిగా ఆయనతో పని చేసిన మీ అనుభవం?

కీరవాణి‌గారు చాలా సపోర్ట్ చేశారు. ఎప్పుడూ కొత్త దర్శకుడిలా చూడలేదు. నేను కొరియోగ్రఫర్‌ని కాబట్టి మ్యూజిక్ సెన్స్ వుంటుంది. ఆయనకి ఏదైనా చెప్పినా ఒక సెన్స్‌తోనే చెబుతుంటాడని భావించేవారు. ఆయన సపోర్ట్‌ని మర్చిపోలేను. ఇప్పటివరకూ వచ్చిన మూడు పాటలు సూపర్ హిట్ అయ్యాయి. రాబోయే మూడు పాటలు కూడా వైరల్ అవుతాయి.

ఈ సినిమా నేపధ్యం ఏమిటి?

స్నేహం, మంచి ప్రేమకథ, చాలా మంచి ఎమోషన్స్ వుంటాయి. 80-90 మధ్య కాలంలో జరిగే కథ ఇది.

‘నా సామిరంగ’ టైటిల్ ఆలోచన ఎవరిది?

నా సామిరంగ.. ఏఎన్ఆర్‌గారి సినిమాలో ప్రజాదరణ పొందిన పాట. అది టైటిల్ అయితే బావుంటుందని అందరం కలసి తీసుకున్న నిర్ణయం ఇది.

ఈ సినిమా కోసం చాలా ఫాస్ట్‌గా పని చేశారు కదా.. ఎక్కడా ఒత్తిడి అనిపించలేదా?

డైరెక్టర్ కావడం నా డ్రీమ్. ఆ డ్రీమ్ కోసం చాలా కష్టపడ్డాను. సరైన సమయంలో ఈ చిత్రం వచ్చింది. దీనికి నా బెస్ట్ ఇవ్వడానికి ప్రయత్నించాను. కమర్షియల్‌లోనే నా సొంత స్టైల్‌ని ప్రయత్నించాను. అది ఖచ్చితంగా యూనిక్‌గా వుంటుంది. ప్రేక్షకులకు నచ్చుతుంది.

నిర్మాతల గురించి?

నిర్మాతలు చాలా సపోర్ట్ చేశారు. కావాల్సిన ప్రతీది సమకూర్చారు. అందుకే ఇంత సజావుగా సినిమా జరిగింది. (Director Vijay Binni Interview)

ఇందులో కొరియోగ్రఫీ మీరే చేశారా?

నాలుగు పాటలకు నేను చేశాను. ఒక పాట విజయ్, మరో పాట దినేష్ మాస్టర్ చేశారు.

ఎలాంటి జోనర్ సినిమాలు చేయాలని అనుకుంటున్నారు?

అన్ని జోనర్ సినిమాలు చేయాలని వుంది.


ఇవి కూడా చదవండి:

====================

*RC16: ఆయనే.. అధికారికంగా ప్రకటించేశారు

***********************

*Nawazuddin Siddiqui: విక్టరీ వెంకటేష్ నుండి అందరూ అది నేర్చుకోవాలి

****************************

*Dhanush: సోషల్‌ మీడియాతో జర జాగ్రత్త!

****************************

Updated Date - Jan 06 , 2024 | 07:47 PM
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!