మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Music Shop Murthy: పాతికేళ్ల వయసులో సాధించలేనిది.. యాభై ఏళ్ల వయసులో సాధించాల్సి వస్తే..

ABN, Publish Date - Jun 12 , 2024 | 10:02 PM

అజయ్ ఘోష్, చాందినీ చౌదరి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘మ్యూజిక్ షాప్ మూర్తి’. ఫ్లై హై సినిమాస్‌ బ్యానర్‌పై హర్ష గారపాటి, రంగారావు గారపాటి నిర్మించారు. శివ పాలడుగు ఈ సినిమాకి కథ, కథనాన్ని అందించి దర్శకత్వం వహించారు. ఈ సినిమా జూన్ 14న గ్రాండ్‌గా విడుదలయ్యేందుకు ముస్తాబైంది. ఈ క్రమంలో దర్శకుడు శివ పాలడుగు మీడియాకు చిత్ర విశేషాలను తెలియజేశారు.

Music Shop Murthy Director Siva Paladugu

అజయ్ ఘోష్ (Ajay Ghosh), చాందినీ చౌదరి (Chandini Chowdary) ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘మ్యూజిక్ షాప్ మూర్తి’ (Music Shop Murthy). ఫ్లై హై సినిమాస్‌ బ్యానర్‌పై హర్ష గారపాటి, రంగారావు గారపాటి నిర్మించారు. శివ పాలడుగు (Director Siva Paladugu) ఈ సినిమాకి కథ, కథనాన్ని అందించి దర్శకత్వం వహించారు. ఈ సినిమా జూన్ 14న గ్రాండ్‌గా విడుదలయ్యేందుకు ముస్తాబైంది. ఈ క్రమంలో దర్శకుడు శివ పాలడుగు మీడియాకు చిత్ర విశేషాలను తెలియజేశారు.

ఈ సినిమా ఛాన్స్ ఎలా వచ్చింది?

మాది విజయవాడ. అమెరికాలో ఉద్యోగం చేశాను. అక్కడే నాకు ఫ్రెండ్‌గా హర్ష పరిచయమయ్యాడు. అమెరికాలోనే డైరెక్షన్ కోర్సులో డిప్లొమా చేశాను. నాకు మొదటి సినిమా ఛాన్స్ చాలా సులభంగానే వచ్చింది. నా ఫ్రెండ్స్ నిర్మాతలు కావడంతో ఈ సినిమా ఛాన్స్ ఈజీగా వచ్చింది.

అజయ్ ఘోష్‌ను ఈ కథకు ఎన్నుకోవడానికి కారణం?

పాతికేళ్ల కుర్రాడి కథ చెబితే మళ్లీ రొటీన్ అవుతుందని, కాస్త కొత్తగా ఉండాలనే ఈ ‘మ్యూజిక్ షాప్ మూర్తి’ కథను రాసుకున్నాను. ఈ కథకు అజయ్ ఘోష్ అయితే బాగుంటుందని అనుకున్నాను. కాస్త కొత్తగా ఉంటుందనే ఆయనతో ఈ కారెక్టర్ వేయించాను. ఆయన అద్భుతంగా ఎమోషన్స్ పండించగల నటుడు. ఈ సినిమా అనుకుంటున్న టైంలో ఇంకా ‘పుష్ప’ (Pushpa) రాలేదు. (Music Shop Murthy Director Interview)

చాందినీ చౌదరి (Chandini Chowdary) పాత్ర ప్రాముఖ్యత ఏంటి?

ఈ సినిమా ఆమె పాత్రతోనే ప్రారంభం అవుతుంది. ఆమె పాత్ర చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేసేలా ఉంటుంది. మూర్తి జీవితంలో అంజన వల్ల వచ్చిన మార్పులే ఈ సినిమాను ముందుకు తీసుకెళ్తాయి. అంజన కారెక్టర్‌లో చాందినీ చౌదరి అద్భుతంగా నటించారు. ఆమె పాత్రకు ఇందులో ఎంతో ప్రాధాన్యం ఉంటుంది.

ఈ సినిమా కోసం మ్యూజిక్ మీద ఏమైనా రీసెర్చ్ చేశారా?

మ్యూజిక్ మీద చాలానే రీసెర్చ్ చేశాం. అప్పటితరం సంగీతం, నేటి ట్రెండీ మ్యూజిక్ ఇలా అన్నింటిపై పరిశోధించాం. పవన్ మంచి సంగీతాన్ని ఇచ్చారు. ప్రతీ పాట సందర్భానుసారంగానే వస్తుంది. ఎక్కడా అతికించినట్లుగా అనిపించదు.


బడ్జెట్ పరంగా ఏమైనా సమస్యలు వచ్చాయా?

ఈ సినిమా ప్రయాణంలో నాకు బడ్జెట్ పరంగా ఎలాంటి సమస్యలు రాలేదు. నా స్నేహితులే నిర్మాతలు కావడంతో, వారు నాపై నమ్మకంతో ఖర్చుకి వెనుకాడలేదు. అనుకున్నదానికంటే కాస్త ఎక్కువే ఖర్చు అయినా.. ఎక్కడా వృథాగా ఖర్చు పెట్టలేదు. (Director Siva Paladugu About Music Shop Murthy)

మొదటి సినిమా కదా.. ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి?

నాకు మంచి టీం దొరికింది. ఆ టీం సహాయంతోనే సినిమాను ఇంత వరకు తీసుకురాగలిగాను. అయితే సినిమా తీయడం కంటే.. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్, రిలీజ్ చేయడం, ప్రమోషన్స్ చేయడం చాలా కష్టంగా అనిపించింది. మొత్తానికి మా సినిమా జూన్ 14న రాబోతోంది. చాలా ఆనందంగా ఉంది.

ప్రస్తుతం పెద్ద సినిమాలే సరిగ్గా ఆడటం లేదు.. మీకు మీ చిత్రంపై ఉన్న నమ్మకం ఏంటి?

చిన్న సినిమా, పెద్ద సినిమా అన్న తేడా ఇప్పుడు లేదు. చిన్న చిత్రాలకు ఓపెనింగ్స్ అంతగా రాకపోవచ్చు. కానీ కంటెంట్ ఉంటే.. ఎమోషన్స్ ఉంటే.. ఆడియెన్స్‌కు కనెక్ట్ అయితే చిన్న చిత్రాలే పెద్ద విజయాలను సాధిస్తాయి.. సాధిస్తున్నాయి. అందుకు చాలా ఉదాహరణలు కూడా ఉన్నాయి. మా సినిమా కంటెంట్, మా చిత్రంలోని ఎమోషన్స్ మీద మాకు చాలా నమ్మకం ఉంది. ఈ చిత్రం అందరికీ నచ్చుతుంది.

చాందినీ చౌదరి నటించిన రెండు చిత్రాలు ఒకే రోజున వస్తున్నాయి? అదేమైనా ఎఫెక్ట్ పడే అవకాశం ఉందా?

చాందినీ చౌదరి నటించిన ‘యేవమ్’ (Yevam) సినిమా కూడా జూన్ 14వ తేదీనే రిలీజ్ అవుతోంది. అయితే మా జానర్ వేరు.. ఆ సినిమా జానర్ వేరు. వారికి సపరేట్ ఆడియెన్స్ ఉంటారు.. మాకు సపరేట్ ఆడియెన్స్ ఉంటారు. మా చిత్రం ఫ్యామిలీ ఎమోషన్స్‌తో ఉంటుంది. కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రమిది.

ఈ సినిమాతో ఏమైనా సందేశం (Message) ఇవ్వబోతున్నారా?

ఏదో సందేశం ఇవ్వాలని ఈ కథను రాసుకోలేదు. పాతికేళ్ల వయసులో సాధించలేనిది.. యాభై ఏళ్ల వయసు వచ్చాక సాధించాలనుకుంటే.. ఆ సాధన కోసం చేసే ప్రయత్నం ఎలా ఉంటుంది? ఎంత ఎమోషనల్‌గా ఉంటుందనేది ఆడియెన్స్‌కు చెప్పాలనే ఈ కథను రాసుకున్నాను.

మీ తదుపరి చిత్రాల గురించి చెప్పండి?

ఈ సినిమా సక్సెస్‌తోనే నా ఫ్యూచర్ కూడా డిసైడ్ అవుతుంది. ఈ సినిమా ఫలితంతోనే నా నెక్ట్స్ ప్రాజెక్ట్‌లను అనౌన్స్ చేస్తాను.

Updated Date - Jun 12 , 2024 | 10:02 PM