Sricharan Pakala: ఒక బిడ్డ పుట్టిన తర్వాత కాజల్ అలా చేస్తుంటే.. నేను కూడా ఇన్‌స్పైర్ అయ్యా!
ABN , Publish Date - Jun 03 , 2024 | 06:57 PM
కాజల్ అగర్వాల్ లీడ్ రోల్‌లో నటించిన సినిమా ‘సత్యభామ’. నవీన్ చంద్ర ఇందులో కీలక పాత్రలో నటించారు. ఈ చిత్రాన్ని అవురమ్ ఆర్ట్స్ పతాకంపై బాబీ తిక్క, శ్రీనివాసరావు తక్కలపల్లి నిర్మించారు. ‘మేజర్’ చిత్ర దర్శకుడు శశికిరణ్ తిక్క సమర్పకులుగా వ్యవహరిస్తూ స్క్రీన్‌ప్లే అందించారు. క్రైమ్ థ్రిల్లర్ కథతో దర్శకుడు సుమన్ చిక్కాల తెరకెక్కించారు. జూన్ 7న విడుదలకు సిద్ధమైన ఈ చిత్ర విశేషాలను సంగీత దర్శకుడు శ్రీచరణ్ పాకాల చెప్పుకొచ్చారు.
‘క్వీన్ ఆఫ్ మాసెస్’ కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal) లీడ్ రోల్‌లో నటించిన సినిమా ‘సత్యభామ’ (Satyabhama). యంగ్ హీరో నవీన్ చంద్ర (Naveen Chandra) ఇందులో అమరేందర్ అనే కీలక పాత్రలో నటించారు. ఈ చిత్రాన్ని అవురమ్ ఆర్ట్స్ పతాకంపై బాబీ తిక్క, శ్రీనివాసరావు తక్కలపల్లి నిర్మించారు. ‘మేజర్’ చిత్ర దర్శకుడు శశికిరణ్ తిక్క (Sasikiran Tikka) సమర్పకులుగా వ్యవహరిస్తూ స్క్రీన్‌ప్లే అందించారు. క్రైమ్ థ్రిల్లర్ కథతో దర్శకుడు సుమన్ చిక్కాల (Suman Chikkala) తెరకెక్కించారు. ఈ నెల 7న ఈ సినిమా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో సినిమాకు సంగీతం అందించిన సంగీత దర్శకుడు శ్రీచరణ్ పాకాల (Music Director Sricharan Pakala) చిత్ర విశేషాలను మీడియాకు తెలియజేశారు. ఆయన మాట్లాడుతూ..
Also Read- Anjali: బాలయ్య నన్ను ఎందుకు నెట్టారో నాకు తెలుసు.. అనవసరంగా పెద్దది చేశారు
‘‘కాజల్ అగర్వాల్ లీడ్ రోల్ చేస్తుండటం ఈ సినిమాపై నాకు ఎగ్జైట్‌మెంట్ పెంచింది. అలాగే శశికిరణ్‌తో నేను చేస్తున్న మూడో సినిమా ఇది. డైరెక్టర్ సుమన్ కూడా నాకు బాగా పరిచయం. స్నేహితులతో కలిసి చేస్తున్న సినిమా కాబట్టి ఎగ్జైట్‌గానే పనిచేస్తాం. మిగతా వారితో వర్క్ చేసినప్పుడు ఈ ఇంట్రెస్ట్ ఉండదని కాదు కానీ.. పదేళ్లుగా కలిసున్న ఫ్రెండ్స్ అంటే ఆ ఫీల్ వేరే ఉంటుంది కదా. కాజల్‌కు పర్ఫెక్ట్ కమ్ బ్యాక్ మూవీ ఇది. ఈ సినిమాలో యాక్షన్ సీక్వెన్సులు చూస్తున్నప్పుడు చాలా ఎంజాయ్ చేశాను. థ్రిల్లర్ మూవీస్ ఇష్టపడే వారికి ఈ సినిమా బాగా నచ్చుతుంది. ఇందులోని ట్విస్ట్‌లు, టర్న్‌లు సూపర్బ్‌గా ఉంటాయి. ఒక పోలీస్ ఆఫీసర్ ఎమోషనల్ జర్నీ ఇది. ఇందులోని యాక్షన్ సీక్వెన్స్ ఎప్పటికీ గుర్తుండిపోతాయి. కాజల్ యాక్షన్ ఎపిసోడ్స్ అన్నీ తనే సొంతంగా చేసేంది. బిడ్డ పుట్టిన తర్వాత తను ఇంత భారీ యాక్షన్ సీక్వెన్స్ చేయడం అంత ఈజీ కాదు. ఆ యాక్షన్ సీక్వెన్స్ చూసి నేను ఇన్స్పైర్ అయ్యి మ్యూజిక్ చేశాను. (Music Director Sricharan Pakala about Satyabhama)
Also Read- Jr NTR: జూనియర్ ఎన్టీఆర్‌పై పిఠాపురం వర్మ సంచలన వ్యాఖ్యలు
ఇందులో మొత్తం ఐదు పాటలుంటాయి. ముందు రెండు సాంగ్స్ అనుకుని స్టార్ట్ చేశాం. ‘కళ్లారా చూసాలే’ అనేది కాజల్, నవీన్ చంద్ర మధ్య వచ్చే లవ్ సాంగ్, ‘వెతుకు వెతుకు’ కీరవాణిగారు పాడారు. ఇది కాజల్ కేసు ఇన్వెస్టిగేషన్ నేపథ్యంగా ఉంటుంది. ఒక ఇంగ్లీష్ సాంగ్ చేశాం. మిగతా లిరికల్ సాంగ్స్ త్వరలో రిలీజ్ చేస్తాం. ఈ పాటలన్నీ సినిమాలో ఉంటాయి. ఈ సినిమాలో వెతుకు వెతుకు పాటకు కీరవాణిగారు, చంద్రబోస్‌గారితో కలిసి వర్క్ చేయడం మర్చిపోలేని విషయం. గతంలో ‘ఆపరేషన్ గోల్డ్ ఫిష్’ సినిమాకు నా మ్యూజిక్‌లో కీరవాణిగారు పాడారు. ‘సత్యభామ’ పాటకు ఆయన స్టూడియోకు వస్తూనే నా పాట ఏది విన్నావ్, ఏ పాట విని నన్ను నీ పాటకు పాడేందుకు పిలిచావ్ అని అడిగారు. చంద్రబోస్ గారు కూడా ట్యూన్ మీటర్‌కు పాట ఇచ్చి వెళ్లిపోకుండా డిస్కస్ చేస్తూ పాట బాగా వచ్చేవరకు మాతోనే ఉన్నారు. వాళ్లు అంత సీనియర్స్ అయి ఉండి కూడా.. వర్క్ మీద చూపించే శ్రద్ధ కొత్తవాళ్లు నేర్చుకోవాలి.
థ్రిల్లర్ మూవీస్‌కు ఎక్కువ వర్క్ చేస్తాననే పేరొచ్చింది. ఈ ఇమేజ్ నాకు ఇబ్బందిగానే ఉంది. అయితే నేను మొత్తం థ్రిల్లర్ మూవీస్ చేయలేదు. ‘కృష్ణ అండ్ హిస్ లీల, డీజే టిల్లు, గుంటూరు టాకీస్’ వంటి లవ్, కమర్షియల్ చిత్రాలకూ సంగీతాన్ని అందించాను. కానీ థ్రిల్లర్స్ మ్యూజిక్ డైరెక్టర్ అనే ముద్ర వచ్చేసింది. నాకు పర్సనల్‌గా మాస్, కమర్షియల్ మూవీస్, లవ్ స్టోరీస్ చేయాలనే కోరిక ఉంటుంది. ‘గూఢచారి 2’ తర్వాత థ్రిల్లర్ సినిమాలు ఎన్ని చేస్తానో తెలియదు. థ్రిల్లర్ మూవీస్‌లో సాధారణంగా బీజీఎంకు ఎక్కువ పేరొస్తుంది. అలాగని పాటలు బాగుండవని కాదు. పాటలు బాగున్నా ఆడియెన్స్ బీజీఎంకు ఎక్కువ కనెక్ట్ అవుతారు. నాకు డిఫరెంట్ జానర్ మూవీస్‌కు మ్యూజిక్ చేయాలని ఉంటుంది. ‘మేజర్’లో హృదయమా పాట హిట్ అయ్యింది, డీజే టిల్లులో పటాస్ పిల్లా హిట్ అయ్యింది. నేను అన్ని రకాల మూవీస్‌కు పాటలు చేయగలను. కానీ అలాంటి అవకాశాలు కూడా రావాలి కదా. నేను చిన్నప్పుడు గజల్స్ ఎక్కువగా వినేవాడిని. రాక్ మ్యూజిక్ చేశాను. నేను ఏ మ్యూజిక్ డైరెక్టర్ దగ్గరా అసిస్టెంట్‌గా పనిచేయలేదు. ‘క్షణం’ సినిమాకు అవకాశం వచ్చింది. ఆ సినిమాకు నేను ఇచ్చిన మ్యూజిక్ ప్రేక్షకులకు నచ్చింది. అలా కంటిన్యూ చేస్తూ వస్తున్నాను. (Music Director Sricharan Pakala Interview)
ఇప్పుడు ప్రేక్షకులు చాలా క్లియర్‌గా మూవీస్ చూస్తున్నారు. మ్యూజిక్ ఏంటని గుర్తుపడుతున్నారు. ఇక్కడి నుంచి అక్కడి నుంచి లేపేసి పెడితే కుదరదు. వారికి కొత్తగా మ్యూజిక్ ఇవ్వాలి. ఆ క్వాలిటీ కోసం నిద్రలేకుండా కూడా పనిచేస్తా. నేను ఎవరితో పోటీ అనుకోను. నాకు నేనే పోటీగా భావిస్తా. నా తోటి మ్యూజిక్ డైరెక్టర్స్‌లో వివేక్ సాగర్, కాళభైరవ, ప్రవీణ్ లక్కరాజ్ వంటి అందరితో ఫ్రెండ్లీగా ఉంటాను. ఇప్పటి వరకు నేను హాలీడేకు వెళ్లలేదు. మూవీ తర్వాత మూవీ వస్తూనే ఉంది. నాకు అదృష్టవశాత్తూ మంచి డైరెక్టర్స్ పరిచయం అయ్యారు. ‘కృష్ణ అండ్ హిస్ లీల’లో చిన్న క్యారెక్టర్‌లో కనిపించాను. ఫ్రెండ్స్ మూవీస్‌లో సరదాగా ఏదైనా క్యారెక్టర్ చేయమంటే చేస్తా. కానీ యాక్టింగ్ కెరీర్‌గా తీసుకోవడానికి టైమ్ లేదు. సినిమాలు బ్యాక్ టు బ్యాక్ ఉన్నాయి. ‘గూఢచారి 2’ తర్వాత మరో నాలుగైదు ప్రాజెక్ట్స్ లైనప్‌లో ఉన్నాయి..’’ అని చెప్పుకొచ్చారు.
Read Latest Cinema News