King Nagarjuna: మహేష్‌తో కలిసి సినిమా చేస్తాను.. కానీ?
ABN, Publish Date - Jan 12 , 2024 | 06:26 PM
కింగ్ నాగార్జున హీరోగా నటించిన చిత్రం ‘నా సామిరంగ’. కొరియోగ్రాఫర్ విజయ్ బిన్ని దర్శకునిగా పరిచయం అవుతున్న ఈ చిత్రం అందరినీ ఆకట్టుకునే ప్రమోషనల్ కంటెంట్‌తో ఇప్పటికే హ్యూజ్ బజ్‌ని క్రియేట్ చేస్తోంది. ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి అందించిన పాటలు చార్ట్ బస్టర్‌గా అలరిస్తున్నాయి. జనవరి 14న విడుదల కాబోతోన్న ఈ సినిమా విశేషాల గురించి కింగ్ నాగార్జున మీడియాకు తెలియజేశారు.
కింగ్ నాగార్జున (King Nagarjuna) హీరోగా నటించిన చిత్రం ‘నా సామిరంగ’ (Naa Saami Ranga). కొరియోగ్రాఫర్ విజయ్ బిన్ని (Vijay Binni) దర్శకునిగా పరిచయం అవుతున్న ఈ చిత్రం అందరినీ ఆకట్టుకునే ప్రమోషనల్ కంటెంట్‌తో ఇప్పటికే హ్యూజ్ బజ్‌ని క్రియేట్ చేస్తోంది. ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి (MM Keeravani) అందించిన పాటలు చార్ట్ బస్టర్‌గా అలరిస్తున్నాయి. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్‌పై శ్రీనివాస చిట్టూరి హై బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 14న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలకానున్న నేపథ్యంలో కింగ్ నాగార్జున ఈ సినిమా విశేషాలను మీడియాతో పంచుకున్నారు.
‘నా సామిరంగ’ మీ కెరీర్‌లో వేగంగా పూర్తి చేసుకున్న సినిమా అనుకోవచ్చా?
షూటింగ్ డేట్ నుంచి మొదలుపెడితే రిలీజ్ డేట్‌కి చిత్రీకరణ వేగంగా జరుపుకున్న సినిమా అనొచ్చు. వర్కింగ్ డేస్‌లో మాత్రం కాదు. చాలా సినిమాలు 35 రోజుల్లో చేశాం. ‘నా సామిరంగ’ 72 రోజుల చిత్రీకరణ చేశాం. నేను 60 రోజులు పని చేశాను. ప్రీ ప్రొడక్షన్ వర్క్ పక్కాగా చేసుకుంటే.. ఇంత ఫాస్ట్ వర్క్ చేయడం సాధ్యపడుతుంది. ఈ చిత్రానికి చాలా మంచి ప్రీ ప్రొడక్షన్ వర్క్ చేశాం. కీరవాణిగారి లాంటి మ్యూజిక్ డైరెక్టర్ వుండటం మా అదృష్టం. మూడు పాటలు షూటింగ్‌కి ముందే ఇచ్చేశారు. అలానే ఫైట్ సీక్వెన్స్‌కి కూడా నేపధ్య సంగీతం చేశారు. నేపధ్య సంగీతం పెట్టుకొని ఫైట్ షూట్ చేశాం. ఇంత ఫాస్ట్‌గా, ఇంత పెద్ద స్కేల్‌లో చేశామంటే దానికి కీరవాణిగారు ఒక కారణం. ఇందులో ప్రతి పాటా అద్భుతంగా వుంటుంది. మా సినిమాకి కీరవాణిగారే స్టార్.
‘నా సామిరంగ’ కథలో మిమ్మల్ని ఎట్రాక్ట్ చేసిన అంశాలు ఏమిటి?
అన్ని ఎలిమెంట్స్ నచ్చాయి. మంచి స్నేహం, ప్రేమ, త్యాగం, విశ్వాసం.. ఇలా హ్యూమన్ ఎమోషన్స్ కూడిన చాలా అద్భుతమైన కథ ఇది.
తెలుగు తెరపై తొలిసారి సంక్రాంతి ప్రభల తీర్ధం నేపధ్యాన్ని తీసుకున్నారు కదా?
భోగి, సంక్రాంతి, కనుమ ఈ మూడు రోజుల్లో జరిగే కథ ఇది. మనకి సంక్రాంతి పెద్ద పండగ. ఇది 80 నేపధ్యంలో జరిగే కథ. ఇది పండక్కి అందరూ చూడాల్సిన సినిమా. (King Nagarjuna Interview)
ఇది మలయాళీ మూలకథ. వారి కథలు, పాత్రలు స్లోగా మొదలవుతాయి. తెలుగులో వచ్చేసరికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు?
కథ సోల్ మిస్ అవ్వకుండా చేశాం. ఈ విషయంలో దర్శకుడు బిన్నీకి క్రెడిట్ ఇస్తాను. చాలా చక్కగా డిజైన్ చేశాడు. ప్రసన్న తెలుగు నేటివిటీకి తగ్గట్టు చాలా చక్కగా మార్చాడు.
ఆషికా రంగనాథ్ (Ashika Ranganath) గురించి?
ఇందులో చాలా టిపికల్ లవ్ స్టోరీ వుంది. నేను కిష్టయ్య పాత్రలో కనిపిస్తాను. మా ఇద్దరి మధ్య 12 ఏళ్ళ నుంచి ఒక ప్రేమకథ నడుస్తుంది. ముఫ్ఫై ఏళ్ళు వచ్చిన తర్వాత మళ్ళీ పరిచయమై మాట్లాడకుండానే వాళ్ళ ప్రేమకథ నడుస్తుంది. చాలా డిఫరెంట్ లవ్ స్టోరీ ఇది. ఆషికా చాలా చక్కగా నటించింది.
దర్శకుడు విజయ్ బిన్నీ గురించి?
విజయ్‌కి చాలా మంచి విజువల్ సెన్స్ వుంది. తను కొరియోగ్రఫీ చేసిన పాటలు చూశాను. డ్యాన్స్‌లా కాకుండా పాటలోనే మంచి కథని చెప్పే నేర్పు తనలో వుంది. అది నాకు చాలా నచ్చింది. ఈ కథ తనకి ఇచ్చి ఎలా చేస్తావని చెప్పమన్నప్పుడు.. తను అనుకున్న పద్దతిలో చెప్పాడు. అది మా అందరికీ నచ్చింది. బిన్నీ చాలా క్లారిటీ వున్న దర్శకుడు.
అల్లరి నరేష్ (Allari Naresh), రాజ్ తరుణ్ (Raj Tarun) పాత్రల గురించి?
విజయ్ బిన్నీ ప్రాజెక్ట్ లోకి రాకముందే నరేష్ పాత్రని అనుకున్నాం. సోదరభావం వున్న ఆ పాత్రకు నరేష్ కరెక్ట్‌గా షూట్ అవుతారనిపించింది. అలాగే రాజ్ తరుణ్‌ది కూడా కథలో కీలకమైన పాత్రే.
నా సామిరంగ టైటిల్ గురించి?
నాన్న గారి పాట నుంచి వచ్చిన టైటిల్ ఇది. మన కథకు బాగా నప్పుతుందనిపించింది. సినిమాలో చాలా చోట్ల ఈ టైటిల్ వినిపిస్తూనే వుంటుంది.
అనుకున్న సమయానికి రెడీ చేయడం సవాల్‌గా అనిపించిందా?
నా కంటే ఎక్కువగా డైరెక్టర్, కెమెరా డిపార్ట్‌మెంట్ రౌండ్ ది క్లాక్ పని చేశారు. అలాగే పోస్ట్ ప్రొడక్షన్, మ్యూజిక్, ఎడిటింగ్, ఇలా అన్నీ విభాగాలు మంచి సమన్వయంతో పని చేశాయి.
యాక్షన్ సీక్వెన్స్ ఎలా ఉండబోతున్నాయి?
చాలా మ్యాసీగా వుంటాయి. నా సినిమాల వరకూ నా సామిరంగ వెరీ మ్యాసీ అనే చెప్పాలి.
నిర్మాతల గురించి?
శ్రీనివాసా చిట్టూరి వండర్ ఫుల్ ప్రొడ్యూసర్. మా మధ్య మంచి బాండింగ్ వుంది. ఎక్కడా వెనకడుగు వేయరు. సినిమాకి కావాల్సిన ప్రతిదీ రాజీపడకుండా సమకూరుస్తారు.
మహేష్ బాబు (Mahesh Babu)తో కలసి సినిమా చేసి.. నాగేశ్వరరావు (ANR), కృష్ణ (Krishna) గార్ల లెగసీని కొనసాగించాలని గతంలో ఓ ట్వీట్ చేశారు కదా.. ఆ సినిమా చర్చలు జరుగుతున్నాయా?
ఆయన రాజమౌళి (SS Rajamouli)గారితో సినిమా పూర్తి చేసిన తర్వాతే దాని గురించి ఆలోచించాలి.(నవ్వుతూ)
కొత్త సినిమాల గురించి?
శేఖర్ కమ్ముల (Sekhar Kammula) దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్నాను.
ఇవి కూడా చదవండి:
====================
*Racharikam: ‘రాచరికం’లో అప్సరా రాణి ఎలా ఉందో చూశారా..
**************************
*సింగర్ సునీత కుమారుడి సినిమా ఓటీటీలోకి వచ్చేసింది.. రిలీజైన 10 రోజులకే!
*************************
*Kalki 2898AD: రిలీజ్ డేట్ ఫిక్స్.. ఆ చారిత్రాత్మక డేట్‌కే!
*************************
*Vijay: విజయ్ న్యూ గెటప్.. అసలు విజయ్‌లా లేడు కదా!
*************************