Kartikeya Gummakonda: ‘భజే వాయు వేగం’ కథ వింటూ.. కార్తీ ‘ఖైదీ’ని ఊహించుకున్నా..
ABN, Publish Date - May 29 , 2024 | 05:37 PM
యూవీ క్రియేషన్స్ సమర్పణలో యూవీ కాన్సెప్ట్స్ బ్యానర్‌పై హీరో కార్తికేయ గుమ్మకొండ హీరోగా నటించిన సినిమా ‘భజే వాయు వేగం’. ఐశ్వర్య మీనన్ హీరోయిన్గా నటించింది. ‘హ్యాపీ డేస్’ ఫేమ్ రాహుల్ టైసన్ కీలక పాత్రను పోషించారు. ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్ కథతో దర్శకుడు ప్రశాంత్ రెడ్డి రూపొందించిన ఈ చిత్రం మే 31న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు రెడీ అయిన సందర్భంగా హీరో కార్తికేయ మీడియాకు చిత్ర విశేషాలు తెలిపారు.
యూవీ క్రియేషన్స్ (UV Creations) సమర్పణలో యూవీ కాన్సెప్ట్స్ (UV Concepts) బ్యానర్‌పై హీరో కార్తికేయ గుమ్మకొండ (Kartikeya Gummakonda) హీరోగా నటించిన సినిమా ‘భజే వాయు వేగం’ (Bhaje Vaayu Vegam). ఐశ్వర్య మీనన్ హీరోయిన్గా నటించింది. ‘హ్యాపీ డేస్’ ఫేమ్ రాహుల్ టైసన్ కీలక పాత్రను పోషించారు. ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్ కథతో దర్శకుడు ప్రశాంత్ రెడ్డి (Prashanth Reddy) రూపొందించిన ఈ చిత్రానికి అజయ్ కుమార్ రాజు.పి. కో ప్రొడ్యూసర్. ఈ నెల 31న ఈ సినిమా వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు రెడీ అయిన నేపధ్యంలో.. సినిమా హైలైట్స్‌తో పాటు తన కెరీర్ విశేషాలను హీరో కార్తికేయ గుమ్మకొండ మీడియాకు తెలియజేశారు.
*Kiraak RP: అమ్మాయిలతో నగ్న పూజలు చేయిస్తున్నాడంటూ వేణు స్వామిపై కిరాక్ ఆర్పీ ఫైర్..
ఆయన మాట్లాడుతూ.. ‘‘లాక్ డౌన్ టైమ్‌లో ప్రశాంత్ రెడ్డి ‘భజే వాయు వేగం’ కథ వినిపించాడు. కథ చెప్పడం ప్రారంభించిన కొద్దిసేపటికే నేను అందులోని ఎమోషన్స్‌కు కనెక్ట్ అయ్యాను. ఈ సినిమా ఖచ్చితంగా చేయాలని నిర్ణయించుకున్నాను. క్యారెక్టర్ కోసం రెడీ అయ్యేందుకు కొంత టైమ్ అడిగాను. ‘భజే వాయు వేగం’ సినిమా షూటింగ్ ప్రారంభించిన తర్వాత కథ మీద దర్శకుడు ప్రశాంత్ మీద మరింత నమ్మకం పెరిగింది. ముందు త్వరగా ఫినిష్ చేయాలనుకున్న ఈ సినిమాను ఇలా కాదు ఇంకాస్త టైమ్ కేటాయించి ఇంకా బెటర్‌గా చేద్దామని అనుకున్నాం. నేను అప్పటికే ‘బెదురులంక’ స్టార్ట్ చేశాను. ఆ సినిమా పూర్తి చేసి మళ్లీ ‘భజే వాయు వేగం’కు తిరిగి రావాలని టీమ్‌తో డిస్కస్ చేసి వెళ్లాను. అందుకే ఈ సినిమాలో కొన్నిచోట్ల జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే నా హెయిర్ స్టైల్ మారినట్లు తెలుస్తుంది.
‘భజే వాయు వేగం’ సినిమా ఇప్పుడున్న నా ఇమేజ్‌కు సరైన మూవీ. హీరో అంటే మనం పోల్చుకునేలా ఉండాలి. అతనికి ఎదురయ్యే సమస్యలు, వాటిని సాల్వ్ చేసుకునేందుకు ఎంచుకునే మార్గాలు.. ఇవన్నీ ఇన్స్పైరింగ్గా ఉండాలని భావిస్తా. అప్పుడే ప్రేక్షకులు హీరోలా చూస్తారు. హీరోగా నాకు కొంచెం సోషల్ కన్సర్న్ ఉంది. అది నేను చేసే పాత్రల మీద రిఫ్లెక్ట్ అవుతుంటుంది. మంచి ఎంటర్టైన్మెంట్ కూడా ఈ సినిమాలో ఉంటుంది. (Kartikeya Gummakonda Interview)
ఇలాంటి చిత్రంలోనే నేను నటించాలని కోరుకున్నాను. ఇందులో హీరోయిజం, యాక్షన్, సెంటిమెంట్, ఎమోషన్, లవ్ అన్నీ కుదిరాయి. ఈ కథ దర్శకుడు చెప్పినప్పుడు కార్తీ హీరోగా నటించిన ఖైదీ (Karthi Khaidi) టైపులో ఊహించుకున్నాను. ఖైదీలో ఉన్నంత యాక్షన్ ఈ మూవీలో ఉండదు కానీ అలాంటి ఎమోషనల్ డ్రైవ్, హీరోకు ఒక ప్రాబ్లమ్, అతనికుండే ధైర్యం ఇలాంటి ఫ్రేమ్‌లో కథ ఉంటుంది. సెకండాఫ్‌లో రేసీ స్క్రీన్‌ప్లేతో మూవీ సాగుతుంది.
యూవీ క్రియేషన్స్‌లో సినిమా చేస్తున్నానంటే హీరోగా నాకొక పెద్ద బ్యానర్ దొరికిందని సంతోషించాను. యూవీలో చేస్తే మేకింగ్, పోస్ట్ ప్రొడక్షన్, రిలీజ్ అన్నీ సరిగ్గా జరుగుతాయి అనే నమ్మకం ఉంటుంది. యూవీ కాన్సెప్ట్స్ నుంచి మా టీమ్‌కు కంప్లీట్ సపోర్ట్ దొరికింది.
ఈ సినిమాలో రెగ్యులర్ టైప్ పాటలు ఉండవు. సీరియస్‌గా కథ వెళ్తున్న టైమ్‌లో పాట వస్తే ఆడియెన్స్ డిస్ట్రబెన్స్గా ఫీలవుతారు. ఈ సినిమాలో ‘సెట్టయ్యిందే’ పాట పాపులర్ అయ్యింది. అయితే ఈ పాట మీద మాకు పెద్దగా దృష్టి లేదు. ఈ పాట కథను ఎలా ముందుకు తీసుకెళ్తుంది అనేది మాత్రమే ప్లాన్ చేసుకున్నాం.
హీరోయిన్ ఐశ్వర్య మీనన్ (Iswarya Menon)కు సంబంధించిన ట్విస్టులేవీ ఈ సినిమాలో ఉండవు. ఆమెది ఇంపార్టెంట్ రోల్. కథను ముందుకు తీసుకెళ్తుంటుంది. ట్రైలర్లో ఐశ్వర్య మీనన్‌కు సంబంధించిన షాట్స్ తక్కువగా ఉన్నాయంటే కారణం ఆమెకు సంబంధించిన షాట్స్ పెడితే కథ రివీల్ అవుతుంది. ట్రైలర్లో హీరో అడాప్ట్ చేసుకున్న కొడుకుగా చూపించాం. అక్కడే కథ మొదలవుతుంది. నా దృష్టిలో ఫైట్స్ చేయడం, విలన్‌ను ఎదిరించడం ఎలా హీరోయిజమో.. తండ్రి కోసం నిలబడటం, నా అనుకున్న వాళ్ల కోసం ఎక్కడిదాకా అయినా వెళ్లడం, ప్రేమించిన అమ్మాయి కోసం పోరాటం చేయడం కూడా హీరోయిజమే. ఈ ఫస్టాఫ్‌లో ఎమోషన్ ఉన్న హీరోను చూస్తారు. సెకండాఫ్‌లో ఆ ఎమోషన్ వల్ల ఎలాంటి స్టెప్స్ తీసుకున్నాడు అనేది చూపిస్తున్నాం.
నేను స్క్రిప్ట్‌లో ఇంటర్ ఫియర్ కాను. కానీ నాకు అనిపించిన అంశాలలో డిస్కస్ చేస్తుంటాను. క్యారెక్టర్‌కు రెడీ అయ్యేందుకు మాత్రం టైమ్ కావాల్సి వస్తే తీసుకుంటా. ‘భజే వాయు వేగం’ సినిమా క్రెడిట్ అంతా వందశాతం దర్శకుడిదే. రాహుల్‌ను స్క్రీన్ మీద ‘హ్యాపీడేస్’ సినిమాలో చూశా. ఆ రెస్పెక్ట్ నాకు తన మీద ఇప్పటికీ ఉంది. రాహుల్ ఈ సినిమా చేసేందుకు ఇంట్రెస్ట్ చూపించాడు. మేము కలిసి హ్యాపీగా షూటింగ్ చేశాం. రాహుల్ తక్కువ టైమ్‌లో నాకు మంచి మిత్రుడు అయ్యారు. అతను బ్రదర్ రోల్ చేస్తున్నాడు. మా కాంబినేషన్ కొత్తగా ఉండబోతోంది. (Hero Kartikeya Gummakonda about Bhaje Vaayu Vegam)
హీరోగా చేస్తున్న టైమ్‌లో విలన్‌గా ‘గ్యాంగ్ లీడర్, వలిమై’ (Gangleader and Valimai) చిత్రాల్లో నటించడం రిగ్రెట్‌గా ఫీలవడం లేదు. అప్పటి వరకు నా సినిమాల రేంజ్ వేరు, గ్యాంగ్ లీడర్ సినిమా రేంజ్ వేరు. నేను అమెరికా సహా చాలా మంది ప్రేక్షకులకు ‘గ్యాంగ్ లీడర్’ ద్వారా గుర్తుండిపోయాను. అజిత్‌తో ‘వలిమై’ సినిమాలో నటించాక.. తమిళనాట గుర్తింపు దక్కింది. ఈ సినిమాల తర్వాతే నేను స్టైలిష్ మేకోవర్‌లో సినిమాలు చేయడం ప్రారంభించా. అప్పటి వరకు మాస్ లుక్‌లో ‘ఆర్ఎక్స్ 100, గుణ’ వంటి మూవీస్‌లో నటించాను. ‘గ్యాంగ్ లీడర్’లో నటించడం నా కెరీర్‌కు ఎంతో అడ్వాంటేజ్ అయ్యింది. ఆ సినిమా తర్వాత విలన్ ఆఫర్స్ తెలుగులో వచ్చినా నాకు నచ్చేలా రాలేదు. తమిళంలో మాత్రం విలన్‌గా ఆఫర్స్ వచ్చినా తెలుగులో హీరోగా చేస్తున్నందు వల్ల కమిట్ కాలేదు. దర్శకుడు ప్రశాంత్‌తో నెక్ట్ మూవీ కూడా చేయాలనుకుంటున్నా..’’ అని చెప్పుకొచ్చారు.
Read Latest Cinema News